Thursday, 11 August 2016

లలితా సహస్రనామ స్తోత్రం



లలితా సహస్రనామ స్తోత్రం


లలితా సహస్రనామ స్తోత్రము, లలితాదేవిని స్తుతిస్తూ హిందువులు పఠించే ఒక స్తోత్రము. లలితాదేవి, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీ దేవి స్వరూపమును సూచిస్తాయి. శక్తి ఆరాధనలోను, శ్రీవిద్యలోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ స్తోత్రం పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయని, కష్టాలు కడతేరుతాయని, సిద్ధులు లభిస్తాయని, ముక్తి లభిస్తుందని విశ్వాసం కలవారి నమ్మకం.
ఈ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా హయగ్రీవునికి, అగస్త్యునికి జరిగిన సంవాదం రూపంలో ఉపస్థితమై ఉన్నది. లలితా సహస్రనామాన్ని వశిన్యాది వాగ్దేవతలు (వశిని, కామేశ్వరి, అరుణ, విమల, జయిని, మేధిని, సర్వేశ్వరి, కౌలిని అనే ఎనిమిది మంది దేవతలు) దేవి ఆజ్ఞానుసారం దేవిస్తుతికోసం పఠించారని చెప్పబడింది. స్తోత్రంలో దేవి కేశాది పాదవర్ణన ఉంది. ఇందులో అనేక మంత్రాలు, సిద్ధి సాధనాలు, యోగ రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయని, విశ్వసిస్తారు. లలిత (క్రీడించునది)ను స్తుతించే ఈ స్తోత్రాన్ని దేవి ఇతర రూపాలైన దుర్గ, కాళి, మహాలక్ష్మి, సరస్వతి, భగవతి వంటి దేవతలను అర్చించడానికి కూడా పఠిస్తారు. పారాయణం, అర్చన, హోమం వంటి అనేక పూజావిధానాలలో ఈ సహస్రనామస్తోత్రం పఠించడం జరుగుతుంది 
.
స్తోత్ర పరిచయం
బ్రహ్మాండ పురాణం 36వ అధ్యాయం "లలితోపాఖ్యానం"లో లలితా సహస్రనామ స్తోత్రం ఉంది. ఇందులో లలితాదేవిని సకల శక్తిస్వరూపిణిగాను, సృష్టిస్థితిలయాధికారిణిగాను వర్ణించారు. శ్రీమహావిష్ణువు అవతారమైన హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఈ స్తోత్రాన్ని ఉపదేశించాడు. లలితా పురాణంలో భండాసురుని సంహరించడానికి దేవి అవతరించినట్లుగా వర్ణించారు. ఈ గ్రంధాలలో శ్రీపురమును సూచించే శ్రీచక్రం నిర్మాణం వర్ణించబడింది. ఆదిశంకరులు, భాస్కరాచార్యుడు త్రిశతి, సహస్రనామములకు వ్యాఖ్యానాలు అందించారు.
అగస్త్యమహర్షికి ఉపదేశంలో హయగ్రీవుడు శ్రీలలితాదేవి ఆవాసమైన శ్రీపురాన్ని, పంచదశాక్షరి మంత్రాన్ని మరియు శ్రీయంత్రము, శ్రీవిద్య, శ్రీలలితాంబిక, శ్రీగురుదేవుల ఐక్యతను వివరించాడు. అగస్త్యుడు లలితాసహస్రనామమును ఉపదేశింపమని కోరగా అది గుహ్యమని, అర్హత లేనివారికి ఉపదేశించడం నిషిద్ధమని హయగ్రీవుడు తెలిపాడు. కాని అగస్త్యుడు అర్హత కలిగిన ఋషి గనుక హయగ్రీవుడు అతనికి లలితాసహస్రనామాన్ని ఉపదేశించాడు.

స్తోత్రం ముఖ్య విభాగాలు
అన్ని పెద్ద స్తోత్రాలలాగానే లలితా సహస్రనామస్తోత్రంలో కొన్ని విభాగాలున్నాయి. పూజ, అర్చన లేదా పారాయణ చేసే సందర్భాన్ని బట్టి కొన్ని విధి విధానాలను పాటిస్తారు. సాధారణంగా భక్తులు ముందు శుచిగా స్నానాది కార్యములు ముగించుకొని నిత్య పూజా కార్యక్రమం చేసుకొని లలితా సహస్రనామస్తోత్రమును చదవడం జరుగుతుంటుంది 
.
పూర్వ పీఠిక
పూర్వ పీఠికలో స్తోత్ర ఆవిర్భావాన్ని గురించి, ఆస్తోత్రం గోప్యనీయత గురించి హయగ్రీవుడు అగస్త్యునికి చెప్పిన వివరణ ఉంది. స్తోత్ర పారాయణ మహత్మ్యము, అది చదవడంలో పాటించవలసిన నియమాలు వివరింపబడ్డాయి. పూర్వ పీఠికలో తెలుపబడిన కొన్ని ముఖ్యాంశాలు -
ముందుగా హయగ్రీవుడు అగస్త్యునికి శ్రీ లలితాదేవి చరిత్రను, భండాసురుని సంహారము, శ్రీపుర వర్ణన, శ్రీ విద్యా పంచాక్షరీ మంతరమహిమలను తెలిపాడు. హోమ విధానాలను చెప్పాడు. శ్రీచక్రానికి, శ్రీవిద్యకు, శ్రీదేవికి, గురుశిష్యులకు ఉండే అన్యోన్య తాదాత్మ్యాన్ని బోధించాడు. మంత్రిణి శ్యామలాంబ, దండిని వారాహిదేవి సహస్రనామాలను ఉపదేశించాడు. తనకు లలితా సహస్రనామాలను కూడా ఉపదేశించమని అగస్త్యుడు ప్రార్ధించాడు.
లలితాదేవి సహస్రనామాలు రహస్యమయాలనీ, శ్రీదేవియందు శ్రద్ధాభక్తులు కలిగి గురుముఖతః పఞ్చదశాక్షరీ మంత్రోపదేశాన్ని పొందిన శిష్యునకు మాత్రమే గురువు ఈ రహస్యనామాలను ఉపదేశించాలనీ హయగ్రీవుడు తెలిపాడు. లలితా తంత్రాలలో ఈ సహస్రనామాలే సర్వశ్రేష్టం. వీనివలన శ్రీలలితాదేవి సులభంగా ప్రసన్న అవుతుంది. ముందుగా శ్రీచక్రార్చన, పంచదశాక్షరీ జపం చేసి, అనంతరం సహస్రనామ పారాయణ చేయాలి. జపపూజాదులకు అసమర్ధులైనవారు నామసహస్రపారాయణం మాత్రం చేయవచ్చును. దేవి ఆజ్ఞానుసారం వశిన్యాది దేవతలు రచించిన ఈ స్తోత్రం పారాయణం చేసేవారికి లలితాదేవి అనుగ్రహం, సకలాభీష్ఠ సిద్ధి కలుగుతాయి. శ్రీదేవి ఆజ్ఞానుసారం బ్రహ్మవిష్ణుమహేశ్వరాది దేవతలు, మంత్రిణి శ్యామలాంబవంటి శక్తులు కూడా ఈ లలితాసహస్రనామస్తోత్రాన్ని భక్తితో పఠిస్తున్నారు.

పారాయణ భాగం
పూర్వ పీఠిక, ఉత్తర పీఠికలను కొందరు పారాయణంలో భాగంగా చదువవచ్చును కాని సాధారణంగా వాటిని మినహాయించి "న్యాసం" నుండి "సహస్రనామము" వరకు పారాయణలో చదువుతారు 
.
న్యాసం
పారాయణ క్రమంలో ముందుగా న్యాసము చేస్తారు. చేయబోయే జపం ఏమిటి? ఎవరు దీనిని ముందు చెప్పారు? దాని ప్రాశస్త్యత ఏమిటి? అందుకు రక్షణ ఏమిటి? ఎందుకు ఈ జపం చేయబడుతున్నది వంటి విషయాలు న్యాసంలో చెబుతారు 
.
అస్య శ్రీలలితాసహస్ర నామస్తోత్రమాలా మంత్రస్య
వశిన్యాది వాగ్దేవతావతా ఋషయ:
అనుష్టుప్ ఛంద:
శ్రీలలితా పరాభట్టారికా మహాత్రిపురసుందరీ దేవతా
ఐం - బీజం, క్లీం - శక్తిః, సౌః - కీలకం
(శ్రీమద్వాగ్భవకూటేతి బీజమ్ మధ్యకూటేతి శక్తి: శక్తికూటేతి కీలకమ్ )
సర్వాభీష్ట ఫల సిద్ధ్యర్ధే
శ్రీలలితా త్రిపురసుందరీ పరాభట్టారికా సహస్రనామ జపే వినియోగ:
తరువాత "అంగన్యాసము", "కరన్యాసము" చెబుతారు.
ఐం - అంగుష్ఠాభ్యాం నమః, క్లీం - తర్జనీభ్యాం నమః, సౌః - అనామికాభ్యాం నమః, క్లీం - కనిష్ఠికాభ్యాం నమః, ఐం - కరతల కర పృష్ఠాభ్యాం నమః, ఐం - హృదయాయ నమః, క్లీం - శిరసే స్వాహా, సౌః - శిఖాయై వషట్, సౌః - కవచాయహుం, క్లీం - నేత్రత్రయాయ వౌషట్, ఐం - అస్త్రాయ ఫట్, భూర్భువస్సువరోమితి దిగ్బంధః.
ధ్యానము, పూజ
న్యాసం తరువాత ధ్యానం పఠిస్తారు. దేవతనుద్దేశించి ఈ స్తోత్రం పారాయణం చేయబడుతున్నదో ఆ దేవతను ముందుగా ధ్యానించడం సంప్రదాయం - ఈ స్తోత్ర ధ్యానంలో మూడు శ్లోకాలున్నాయి. "అరుణాం కరుణాంతరంగీమ్ ... ", "ధ్యాయేత్ పద్మాసనస్థాం...", "సకుంకుమ విలేపనామ్..." అనేవి ఆ మూడు ధ్యాన శ్లోకాలు. వాటిలో మొదటిది క్రింద వ్రాయబడింది.
అరుణాం కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపామ్,
అణిమాది భి రావృతాం మయూఖైః అహమి త్యేవ విభావయే భవానీమ్.
ధ్యాయేత్ పద్మాసనాస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం,
హేమాభాం, పీతవస్త్రాం కరకలిత లసద్దేమ పద్మాం వరాంగీమ్.
సర్వాలంకారయుక్తాం, సకల మభయదాం, భక్త నమ్రాం భవానీం,
శ్రీ విద్యాం శాన్తమూర్తిం, సకల సురనుతాం సర్వసమ్పత్ప్రదాత్రీమ్.
సకుంకుమ విలేపనామ్ అళిక చుమ్బి కస్తూరికాం
సమన్ద హసితాక్షణాం సశరచాప పాశాంకుశామ్
అశేష జనమోహినీమ్ అరుణమాల్య భూషాంబరాం
జపాకుసుమ భాసురం జపవిధౌ స్మరే దబ్మి కామ్.
తరువాత దేవికి "లమిత్యాది పంచపూజ" చేస్తారు. గురుధ్యానం కూడా చేస్తారు.
లమిత్యాది పంచపూజాం విభావయేత్ తద్యథా -
లం - పృథివీ తత్త్వాత్మికాయై, శ్రీ లలితాదేవ్యై గన్ధం పరికల్పయామి.
హం - ఆకాశ తత్త్వాత్మికాయై, శ్రీ లలితాదేవ్యై పుష్పం పరికల్పయామి.
యం - వాయు తత్త్వాత్మికాయై, శ్రీ లలితాదేవ్యై ధూపం పరికల్పయామి.
రం - వహ్ని తత్త్వాత్మికాయై, శ్రీ లలితాదేవ్యై దీపం పరికల్పయామి.
వం - అమృత తత్త్వాత్మికాయై, శ్రీ లలితాదేవ్యై అమృత నైవేద్యం పరికల్పయామి.
సం - సర్వ తత్త్వాత్మికాయై, శ్రీ లలితాదేవ్యై తామ్బూలాది సర్వోపచారాన్ పరికల్పయామి 
.
వేయి నామాలు
ఇది శ్రీదేవి వేయి నామములను స్తుతించే ప్రధాన భాగం

శ్లోకాలు
ఓం శ్రీమాతా, శ్రీమహారాజ్ఞీ, శ్రీమత్సింహాసనేశ్వరీ |
చిదగ్నికుండ సంభూతా, దేవకార్య సముద్యతా | | 1
ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా |
రాగస్వరూప పాశాడ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా | | 2
మనో రూపేక్షు కోదండా, పంచతన్మాత్ర సాయకా |
నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండలా | | 3
చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా |
కురువింద మణిశ్రేణీ కనత్కోటీర మండితా | | 4
అష్టమీ చంద్రవిభ్రాజ దళికస్థల శోభితా |
ముఖచంద్ర కళాంకాభ మృగనాభి విశేషకా | | 5
వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా |
వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభ లోచనా | | 6
నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితా |
తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా | | 7
కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా |
తాటంక యుగళీభూత తపనోడుప మండలా | | 8
పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూః |
నవవిద్రుమబింబశ్రీ న్యక్కారి రదనచ్ఛదా | | 9
శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్జ్వలా |
కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా | | 10
నిజసల్లాప మాధ్య్ర్య వినిర్భర్విత కచ్ఛపీ |
మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా | | 11
అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితా |
కామేశబద్ధ మాంగల్య సూత్రశోభితకంధరా | | 12
కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా |
రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్వితా | | 13
కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తనీ |
నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయీ | | 14
లక్ష్యరోమ లతాధారతా సమున్నేయ మధ్యమా |
స్తనభార దళన్మధ్య పట్టబంధవళిత్రయా | | 15
అరుణారుణ కౌసుమ్భ వస్త్రభాస్వత్కటీతటీ |
రత్నకింకిణికారమ్య రశనా దామ భూషితా | | 16
కామేశజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్వితా |
మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా | | 17
ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూణాభ జంఘికా |
గూఢగుల్ఫా, కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపాద్వితా | | 18
సఖదీధితి సన్ఛన్న సమజ్జన తమోగుణా |
పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా | | 19
శింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజా |
మరాళీ మందగమనా, మహాలావణ్య శేవధిః | | 20
సర్వారుణా, అనవద్యాంగీ, సర్వాభరణ భూషితా |
శివకామేశ్వరాకంధా, శివా, స్వాధీన వల్లభా | | 21
సుమేరు శృంగ మధ్యస్థా, శ్రీమన్నగర నాయికా |
చింతామణి గృహాంతఃస్థా, పంచ బ్రహ్మాసన స్థితా | | 22
మహాపద్మాటవీ సంస్థా, కదంబ వనవాసినీ |
సుధాసాగర మధ్యస్థా, కామాక్షీ, కామదాయినీ | | 23
దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవా |
భండాసుర వధోద్యుక్త శక్తి సేనాసమన్వితా | | 24
సంపత్కరీ సమారూడ సింధుర వ్రజ సేవితా |
అశ్వారూఢా ధిష్ఠితాశ్వకోటి కోటిభిరావృతా | | 25
చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతా |
గేయచక్ర రథారూఢ మంత్రిణీ పరిసేవితా | | 26
కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |
లామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా | | 27
భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |
నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా | | 28
భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితా |
మంద్రిణ్యమ్బా విరచిత విషంగ వధతోషితా | | 29
విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |
కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరా | | 30
మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితా |
భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణీ | | 31
కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతిః |
మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా | | 32
కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర శూన్యకా |
బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవసంస్తుత వైభవా | | 33
హరనేత్రాగ్ని సన్దగ్ధ కామ సంజీవనౌషధిః |
శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా | | 34
కంణ్ఠాధః కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ |
శక్తి కూటైకతాపన్న కట్యధోభాగధారిణీ | | 35
మూలమంత్రాత్మికా, మూలకూటత్రయ కళేబరా |
కులామృతైకరసికా, కులసంకేతపాలినీ | | 36
కులాంగనా, కులాంతఃస్థా, కౌలినీ, కులయోగినీ |
ఆకులా, సమయాంతఃస్థా, సమయాచార తత్పరా | | 37
మూలాధారైక నిలయా, బ్రహ్మగ్రంథి విభేదినీ |
మణిపూరాంత రుధిరా, విష్ణుగ్రంథి విభేదినీ | | 38
ఆజ్ఞాచక్రాంత రాళస్థా, రుద్ర గ్రంథి విభేదినీ |
సహస్రారాంబుజారూఢా, సుధాసారాభివర్షిణీ | | 39
తటిల్లతాసమరుచిః, షట్చక్రోపరిసంస్థితా |
మహాసక్తిః, కుండలినీ, బిసతంతు తనీయసీ | | 40
భవానీ, భావనాగమ్యా, భవారణ్య కుఠారికా |
భద్రప్రియా, భద్రమూర్తిః, భక్తసౌభాగ్య దాయినీ | | 41
భక్తప్రియా, భక్తిగమ్యా, భక్తివశ్యా, భయాపహా |
శామ్భవీ, శారదారాధ్యా, శర్వాణీ, శర్మదాయినీ | | 42
శాంకరీ, శ్రీకరీ, సాధ్వీ, శరచ్చంద్ర నిభాననా |
శాతోదరీ, శాన్తిమతీ, నిరాధారా, నిరంజనా | | 43
నిర్లేపా, నిర్మలా, నిత్యా, నిరాకారా, నిరాకులా |
నిర్గుణా, నిష్కళా, శాన్తా, నిష్కామా, నిరుపప్లవా | | 44
నిత్యముక్తా, నిర్వికారా, నిష్ప్రపంచా, నిరాశ్రయా |
నిత్యశుద్ధా, నిత్యబుద్ధా, నిరవద్యా, నిరంతరా | | 45
నిష్కారణా, నిష్కళంకా, నిరుపాధిః, నిరీశ్వరా |
నిరాగా, రాగమథనీ, నిర్మదా, మదనాశినీ | | 46
నిశ్చిన్తా, నిరహంకారా, నిర్మోహా, మోహనాశినీ |
నిర్మమా, మమతాహన్త్రీ, నిష్పాపా, పాపనాశినీ | | 47
నిష్క్రోధా, క్రోధశమనీ, నిర్లోభా, లోభనాశినీ |
నిస్సంశయా, సంశయఘ్నీ, నిర్భవా, భవనాశినీ | | 48
నిర్వికల్పా, నిరాబాధా, నిర్భేదా, భేదనాశినీ |
నిర్నాశా, మృత్యుమథనీ, నిష్క్రియా నిష్పరిగ్రహా | | 49
నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా |
దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహన్త్రీ, సుఖప్రదా | | 50
దుష్టదూరా, దురాచారశమనీ, దోషవర్జితా |
సర్వజ్ఞా, సాన్ద్రకరుణా, సమానాధిక వర్జితా | | 51
సర్వశక్తిమయీ, సర్వమంగళా, సద్గతిప్రదా |
సర్వేశ్వరీ, సర్వమయీ, సర్వమన్త్ర స్వరూపిణీ | | 52
సర్వయన్త్రాత్మికా, సర్వతన్త్రరూపా, మనోన్మనీ |
మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీః, మృడప్రియా | | 53
మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ |
మహామాయా, మహాసత్త్వా, మహాశక్తిః, మహారతిః | | 54
మహాభోగా, మహైశ్వర్యా, మహావీర్యా, మహాబలా |
మహాబుద్ధిః, మహాసిద్ధిః, మహాయోగేశ్వరేశ్వరీ | | 55
మహాతన్త్రా, మహామన్త్రా, మహాయన్త్రా, మహాసనా |
మహాయాగ క్రమారాధ్యా, మహాభైరవ పూజితా | | 56
మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణీ |
మహాకామేశమహిషీ, మహాత్రిపురసుందరీ | | 57
చతుష్షష్ట్యుపచారాఢ్యా, చతుష్షష్టి కళామయీ |
మహా చతుష్షష్టి కోటి యోగినీగణసేవితా | | 58
మనువిద్యా, చన్ద్రవిద్యా, చన్ద్రమండల మధ్యగా |
చారురూపా, చారుహాసా, చారుచన్ద్రకళాధరా | | 59
చరాచర జగన్నాథా, చక్రరాజనికేతనా |
పార్వతీ, పద్మనయనా, పద్మరాగ సమప్రభా | | 60
పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణి |
చిన్మయీ పరమానందా విజ్నాన ఘన రూపిణీ | |61
ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మా ధర్మ వివర్జితా |
విశ్వరూపా జాగరణీ స్వపంతీ తైజసాత్మికా | |62
సుప్తా ప్రాజ్నాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జితా |
సృష్టికర్తీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ | |63
సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ |
సదాశివానుగ్రహదా పంచకృత్య పరాయణా | |64
భానుమండల మధ్యస్థాభైరవీ భగమాలినీ |
పద్మాసనా భగవతీ పద్మనాభ సహోదరీ | |65
ఉన్మేష నిమిషోత్పన్నా విపన్న భువనావళిః |
సహస్ర శీర్షవదనా సహస్రాక్షీ సహస్రపాత్ | |66
ఆబ్రహ్మకీటజననీ వర్ణాశ్రమ విధాయినీ |
నిజాజ్న రూప నిగమా పుణ్యాపుణ్య ఫలప్రదా ||67
శ్రుతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధీళికా |
సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తికా ||68
పురుషార్ధ ప్రదా పూర్ణా భోగినీ భువనేశ్వరీ |
అంబికా నాఢినిధనా హరిబ్రహ్మేంద్ర సేవితా ||69
నారాయణీ నాదరూపా నామరూప వివర్జితా |
హ్రీంకారీ హ్రీమతీ హృద్యా హేయోపాదౌయ వర్జితా ||70
రాజారాజార్చితా రాజ్నీ రమ్యా రాజీవలోచనా |
రంజనీ రమణీ రస్యా రణకింకిణిమేఖలా ||71
రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియా |
రక్షాకరీ రాక్షసఘ్నీ రామా రమణ లంపటా ||72
కామ్యాకామ కలారూపా కదంబకుసుమప్రియా |
కల్యాణీ జగతీకంధా కరుణారస సాగరా ||73
కళావతీ కళాలాపా కాంతా కాదంబరీ ప్రియా |
వరదా వామనయనా వారుణీ మదవిహ్వలా ||74
విశ్వాధికా వేద విద్యా వింధ్యాచల నివాసినీ |
విధాత్రీ వేదజననీ విష్ణుమాయా విలాసినీ ||75
క్షేత్రస్వరూపా క్షేత్రేశీ క్షేత్ర క్షేత్రజ్న పాలినీ |
క్షయవృద్ధి వినిర్ముక్తా క్షేత్రపాల సమర్చితా ||76
విజయావిమలా వంద్యా వందారు జనవత్సలా |
వాగ్వాదినీ వామకేశీ వహ్నిమండల వాసినీ ||77
భ్సక్తిమ త్కల్పలతికా పశుపాశ విమోచినీ |
సంహృతాశేషపాషాండా సదాచార ప్రవర్తికా ||78
తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికా |
తరుణీ తాపసారాధ్యా తనుమధ్యా తమోపహా ||79
చితిస్తత్పదలక్ష్యార్ధ చిదేకరసరూపిణీ |
స్వాత్మానందలవీభూత బ్రహ్మాద్యానంద సంతతిః ||80
పరాప్రత్యక్చితీరూపా పశ్యంతీ పరదేవతా |
మధ్యమా వైఖరీ రూపా భక్త మానస హంసికా ||81
కామేశ్వర ప్రాణనాడీ కృతజ్నా కామపూజితా |
శృంగారరస సంపూర్ణా జయా జాలంధర స్థితా ||82
ఓడ్యాణ పీఠనిలయా బిందుమండలవాసినీ |
రహో యాగ్రక్రమారాధ్యా రహస్తర్పణ తర్పితా ||83
సద్యః ప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా |
షడంగ దేవతాయుక్తా షాడ్గుణ్య పరిపూరితా ||84
నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయినీ |
నిత్య షోడశికా రూపా శ్రీకంఠార్ధ శరీరిణీ ||85
ప్రభావతీ ప్రభా రూపా ప్రసిద్ధా పరమేశ్వరీ|
మూలప్రకృతి రవ్యక్తా వ్యక్తావ్యక్త స్వరూపిణీ||86
వ్యాపినీ వివిధాకారా విద్యా విద్యా స్వరూపిణీ |
మహా కామేశనయనా కుముదాహ్లాద కౌముదీ ||87
భక్తహార్ధతమోబేధ భానుమద్భాను సంతతిః|
శివదూతీ శివారాధ్యా శివమూర్తి శ్శివంకరీ ||88
శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజితా |
అప్రమేయా స్వప్రకాశా మనోవాచామగోచరా ||89
చిచ్చక్తి శ్చేతనారూపా జడశక్తి జడశక్తి ర్జడాత్మికా |
గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిధేవితా ||90
తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్థితా |
నిస్సీమ మహిమా నిత్యయౌవనా మదశాలినీ || 91
మదఘూర్ణిత రక్తాక్షీ మదపాటల గండభూ |
చందన ద్రవ దిగ్ధాంగీ చాంపేయ కుసుమ ప్రియా || 92
కుశలాకోమలాకారా కుకుళ్ళా కుళేశ్వరీ |
కుళకుండలయా కౌలమార్గ తత్పర సేవితా || 93
కుమార గణనాథాంబా తుష్టిః పుష్టి ర్మతి ర్ధృతిః |
శాంతి స్వస్తి మతీ కాంతి ర్నందినీ విఘ్ననాశినీ || 94
తేజోవతీ త్రినయనా లోలాక్షీ కామరూపిణీ |
మాలినీ హంసినీ మాతా మలయాచల నివాసినీ ||95
సుముఖీ నళినీ సుభ్రూ శ్శోభనా సురనాయికా |
కాలకంఠీ కాంతిమతీ క్షోభిణీ సూక్ష్మరూపిణీ || 96
వజ్రేశ్వరీ వామదేవీ వయో వస్థా వివర్జితా |
సిద్ధేశ్వరీ సిద్దవిద్యా సిద్ద మాతా యశశ్వినీ ||97
విశుద్ద చక్రనిలయా రక్తవర్ణా త్రిలోచనా |
ఖట్వాంగాది ప్రహరణా వదనైక సమంవితా || 98
పాయసాన్నా ప్రియా త్వక్‍స్థా పశులోక భయంకరీ |
అమృతాడి మహాశక్తి సంవృతా డాకినీశ్వరీ || 99
అనాహతాబ్జ నిలయా శ్యామాభా వదనద్వయా |
దంష్ట్రోజ్వా లాక్షమాలాది ధరా రుధిర సంస్థితా || 100
కాళరాత్ర్యాదిశక్త్యాఘవృతా స్నిగ్ధౌదన ప్రియా |
మహావీరేంద్ర వరదా రాకిన్యాంబా స్వరూపిణీ || 101
మణిపూరాబ్జనిలయా వదనత్రయ సంయుతా సంయుతా |
వజ్రాదికాయుధోపేతా డామర్యాధిభిరార్చితా || 102
రక్తవర్ణా మాంసనిష్టా గూఢాన్న ప్రీతమానసా |
సమస్త భక్త సుఖదా లాకిన్యాంబా స్వరూపిణీ || 103
స్వాధిష్ఠాంబుజగతా చతుర్వక్త్ర మనోహరా |
శూలాయుధ సంపన్నా పీతవర్ణాతిగర్వితా || 104
మేదోనిష్ఠా మధుప్రీతా బందన్యాది సమంవితా |
దధ్యన్నాసక్త హృదయా కాకినీరూపధారిణీ || 105
మూలాధారంబుజారూఢా పంచవక్త్రాస్థి సంస్థితా |
అంకుశాది ప్రహరణా వరదాది నిషేవితా || 106
ముద్గౌదనాసక్తాచిత్తా సాకిన్యాంబా స్వరూపిణీ |
అజ్నాచక్రాబ్జ నిలయా శుక్లవర్ణా షడాసనా || 107
జ్నాసంస్థా హంసవతీ ముఖ్యశక్తి సమన్వితా |
హరిద్రాన్నైకరసికా హాకినీరూప ధారిణీ || 108
సహస్రదళ పద్మస్థాసర్వవర్ణోపా శోభితా |
సర్వాయుధధరా శుక్ల సంస్థితా సర్వతోముఖి || 109
సరౌదన ప్రీతచిత్తా యాకిన్యంబా స్వరూపిణీ |
స్వాహా స్వధా మతిర్మేధా శ్రుతిః స్మృతిరనుత్తమా || 110
పుణ్యకీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణ కీర్తనా |
పులోమజార్చితా బంధమోచనీ బంధురాలకా || 111
విమర్శరూపిణీ విద్యా వియదాది జగత్ప్రసూః |
సర్వవ్యాధి ప్రశమనీ సర్వమృత్యు నివారిణీ || 112
అగ్రగణ్యా చింత్యరూపా కలికల్మషనాశినీ |
కాత్యాయినీ కాలహంత్రీ కమలాక్ష నిషేవితా || 113
తాంబూలపూరితముఖీ దాడిమీ కుసుమప్రియా |
మృగాక్షీ మోహినీ ముఖ్యా మృడానీ మిత్ర రూపిణీ ||114
నిత్యతృప్తా భక్తనిధి ర్నియంత్రీ నిఖిలేశ్వరీ |
మైత్ర్యాది వాసనాలభ్యా మహాప్రళయసాక్షిణీ || 115
పరాశక్తిః పరానిష్ఠా ప్రజ్నాన ఘనరూపిణీ |
మాధ్వీపానా లసా మత్తా మాతృకావర్ణ రూపిణీ || 116
మహాకైలాస నిలయా మృణాళ మృదుదోర్లతా |
మహనీయా దయామూర్తి ర్మహాసాంరాజ్యశాలినీ || 117
ఆత్మవిద్యా మహా విద్యా శ్రీవిద్యా కామసేవితా |
శ్రీషోడశాక్షరీభూత త్రికుటా కామకోటికా || 118
కటాక్షకింకరీభూత కమలా కోటిసేవితా |
శిరస్థితా చంద్రనిభా పాలస్థేంద్రా ధనుఃప్రభా || 119
హృదయస్థా రవిప్రఖ్యా త్రికోణాంతర దీపికా |
దాక్షాయిణీ దైత్యహంత్రీ దక్షయజ్న నివాసినీ ||120
దరాంతోళిత దీరాక్షీ దరహాసోజ్వల న్ముఖీ |
గురుమూర్తి ర్గుణనిధీ ర్గోమాతా గుహజన్మభూ || 121
దేవేశీ దండనీతిస్థా దహరాకాశ రూపిణీ |
ప్రపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజితా || 122
కలాత్మికా కళానాధా కావ్యాలాప వినోదినీ |
సచామర రమావాణీ సవ్యదక్షిత సేవితా || 123
ఆదిశక్తి రమేయాత్మా పరమా పావనాకృతి |
అనేకకోటి బ్రహ్మాండా జననీ దివ్యవిగ్రహా || 124
క్లీంకారీ కేవలా గుహ్యా కైవల్య పదదాయినీ |
త్రిపురా త్రిజగద్వందా త్రిమూర్తి స్తిదశేశ్వరీ || 125
త్ర్యక్షరీ దివ్యగంధాడ్యా సింధూర తిలకాంచితా |
ఉమా శైలేంద్ర తనయా గౌరీ గంధర్వసేవితా || 126
విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగదీశ్వరీ |
ధ్యానగమ్యా పరిచ్చేద్యా జ్నానదా జ్నానవిగ్రహా || 127
సర్వవేదాంత సంవేద్యా సత్యానంద స్వరూపిణీ |
లోపాముద్రార్చితా లీలాక్లుప్త బ్రహ్మాండ మండలా || 128
అదృశ్యా దృశ్యరహితా విజ్నాత్రీ వేద్యవర్జితా |
యోగినీ యోగదా యోగ్యా యోగానందా యుగంధరా || 129
ఇచ్చాశక్తి జ్నానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ |
సర్వధారా సుప్రదిష్ఠా సదసద్రూపదారిణీ || 130
అష్టమూర్తి రజాజైత్రీ లోకయాత్రా విధాయినీ |
ఏకాకినీ భూమరూపా విర్ద్వైతా ద్వైతవర్ధితా || 131
అన్నదా వసుధా వృద్ధా బ్రహ్మాత్యైక్య స్వరూపిణీ |
బృహతీ బ్రహ్మణీ బ్రహ్మీ బ్రహ్మానందా బలిప్రియా || 132
భాషారూపా బృహత్సేనా భావాభావ వివర్జితా |
సుఖారాధ్యా శుభకరీ శోభనా సులభాగతిః || 133
రాజరాజేశ్వరీ రాజ్యదాయినీ రాజ్యవల్లభా |
రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రితా || 134
రాజ్యలక్ష్మీః కోశనాథా చతురంగబలీశ్వరీ|
సాంరాజ్యదాయినీ సత్యసంధా సాగరమేఖ్సలా || 135
దీక్షితా దైత్యశమనీ సర్వలోక వశంకరీ |
సర్వార్ధదాత్రీ సావిత్రీ సచ్చిదానంద రూపిణీ || 136
దేశకాలాపరిచ్చిన్న సర్వగా సర్వ మోహినీ |
సరస్వతీ శాసత్రమయీ గుహాంబా గుహ్యరూపిణీ || 137
సర్వోపాధి వినిర్ముక్తా సదాశివ పతివ్రతా |
సంప్రదాయేశ్వరీ సాధ్వీ గురుమండల రూపిణీ || 138
కుళోత్తీర్ణా భగారాధ్యా మాయా మధ్యమతీ మహీ |
గణాంబా గుహ్యకారాధ్యా కోమలాంగీ గురుప్రియా || 139
స్వతంత్రా సర్వతంత్రేశీ దక్షిణా మూర్తి రూపిణీ |
సనకాది సమారాధ్యా శివజ్నాన శివజ్నాన ప్రదాయనీ || 140
చిత్కళా నందకలికా ప్రేమరూపా ప్రియంకరీ |
నామపారాయణా ప్రీతా నందివిద్యా నటేశ్వరీ || 141
మిథ్యా జగదధిష్టానా ముక్తిదా ముక్తిరూపిణీ |
లాస్యప్రియా లయకరీ లజ్జా రంబాధి వందితా || 142
భవదావసుధావృష్టిః పాపారణ్య దవానలా |
దౌర్భాగ్య తూలవాతులా జరాధ్వాంత రవిప్రభా || 143
భాగ్యాబ్ధి చంద్రికా భక్తచిత్తకేకి ఘనాఘనా |
రోగపర్వత దందోభీ ర్మృత్యుదారు కుఠారికా || 144
మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాశనా |
అపర్ణా చండికా చండముండాసుర నిషూదినీ || 145
క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణీ |
త్రివర్గధాత్రీ సుభగా త్ర్యంబగా త్రిగుణాత్మికా || 146
స్వర్గాపవర్గదా శుద్దా జపాపుష్ప నిభాకృతిః |
ఓజోవతీ ద్యుతిధరా యజ్నరూపా ప్రియవ్రతా || 147
దురారాధ్యా దురాధర్షా పాటలీ కుసుమప్రియా |
మహతీ మేరునిలయా మందార కుసుమప్రియా || 148
వీరారాధ్యా విరాడ్రూపా విరజా విశ్వతోముఖీ
ప్రత్యగ్రూపా పరాకాశా ప్రాణదా ప్రాణరూపిణీ || 149
మార్తాండభైరవారాధ్యా మంత్రిణీ న్యస్తరాజ్యధూః |
త్రిపురేశ్వరీ జయత్సేనా నిస్త్రైగుణ్యా పరాపరా || 150
సత్యజ్నానందరూపా సామరస్య పరాయణా |
కపర్ధినీ కళామాలా కామధు క్కామరూపిణీ || 151
కళానిధిః కావ్యకళా రసజ్నా రససేవధిః |
పుష్టా పురాతనా పూజ్యా పుస్కరా పుష్కరేక్షణా || 152
పరంజ్యోతిః పరంధామ పరమాణుః పరాత్పరా |
పాశహస్తా పాశహంత్రీ పరమంత్ర వివ్హేదినీ || 153

పరంజ్యోతిః పరంధామ పరమాణుః పరాత్పరా |
పాశహస్తా పాశహంత్రీ పరమంత్ర వివ్హేదినీ || 153
మూర్తా మూర్తా నిత్యతృప్తా మునిమానస హంసికా |
సత్యవ్రతా సత్యరూపా సర్వాంతర్యామినీ సతీ || 154
బ్రహ్మాణీ బ్రహ్మజననీ బహురూపా బుధార్చితా |
ప్రసవిత్రీ ప్రచండాజ్నా ప్రతిష్ఠా ప్రకటాకృతిః || 155
ప్రాణేశ్వరీ ప్రాణదాత్రీ పంచాశత్పీఠరూపిణీ |
విశృంఖలా వివక్తస్థా వీరమాతా వియత్ప్రషూ || 156
ముకుందా ముక్తినిలయా మూలవిగ్రహరూపిణీ |
భావజ్నా భవరోగఘ్నీ భవచక్ర ప్రవర్తినీ || 157
చందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరీ |
ఉదారకీర్తి రుద్దామవైభవా వర్ణ రూపిణీ ||158
జన్మమృత్యు జరాతప్త జనవిశ్రాంతి దాయినీ |
సర్వోపనిష దుదుష్ట్యా శాంత్యతీత కళాత్మికా || 159
గంభీరా గగనాంతస్థా గర్వితా గానలోలుపా |
కల్పనారహితా కాష్ఠా కాంతా కాంతార్ధవిగ్రహా || 160
కార్యకారణ నిర్ముక్తా కామకేళీ తరంగితా |
కనత్కనకతాటంకా లీలావిగ్రహధారిణీ || 161
అజా క్షయ వినిర్ముక్తా ముగ్దా క్షిప్రప్రసాదిని |
అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ దుర్లభా || 162
త్రయీ త్రివర్గనిలయా త్రిస్థా త్రుపురమాలినీ |
నిరామయా నిరాలంబా స్వాత్మారామా సుధాసృతిః || 163
సంసార పంకనిర్మజ్న సముద్దరణ పండితా |
యజ్నప్రియా యజ్నకర్తీ యజమాన స్వరూపిణీ ||164
ధర్మాధరా ధనాధ్యక్షా ధనధాన్యా వివర్ధినీ |
విప్రప్రియా విప్రరూపా విశ్వబ్రహ్మ విశ్వభ్రమణకారిణీ || 165
విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణీ |
అయోని ర్యోనినిలయా కూటస్థా కుళరూపిణీ || 166
వీరగోష్టిప్రియా వీరా నైష్కర్మ్యా నాదరూపిణీ |
విజ్నానకలనా కల్యా విదగ్ధా బైందవాసనా || 167
తత్వాధికా తత్వమయీ తత్వమర్ధ స్వరూపిణీ |
సామగానప్రియా సౌమ్యా సదాశివ కుటుంబిణీ || 168
సవ్యాపసవ్య మార్గస్థా సర్వాప ద్వినివారిణీ |
స్వస్థా స్వభావమధురా ధీరా ధీరసమర్చితా || 169
చైతన్యర్ఘ్య సమారాధ్యా చైతన్య కుసుమప్రియా |
సదోదితా సదాతుష్టా తరుణాదిత్యపాటలా || 170
దక్షిణా దక్షిణారాధ్యా దరస్మేర ముఖాంబుజా |
కౌళినీ కేవలా నర్ఘ కైవల్యపదదాయినీ ||171
స్తోత్ర ప్రియా స్తుతిమతీ మహేశీ మంగళాకృతి |
మనస్వినీ మానవతీ మహేశీ మంగళాకృతిః || 172
విశ్వమాతా జగద్దాత్రీ విశాలాక్షీ విరాగిణీ |
ప్రగల్భా పరమోదారా పరమోదా మనోమయీ ||173
వ్యోమకేశీ విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ |
పంచయజ్నప్రియా పంచప్రేత మంచాధిశాయినీ ||174
పంచమీ పంచభూతేశీ పంచసంఖ్యోపచారిణీ |
శాశ్వతీ శాశ్వతైశ్వర్యా శర్మదా శంభుమోహినీ ||175
ధరా ధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధినీ |
లోకాతీతా గుణాతీతా సర్వాతీతా శమాత్మికా ||176
బంధూక కుసుమప్రఖ్యా బాలా లీలా వినోదినీ |
సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ || 177
సువాసినీన్యర్చనప్రీతా శోభనా శుద్ధమానసా |
బిందుతర్పణ సంతుష్టా పూర్వజా త్రుపురాంబికా || 178
దశముద్రా సమారాధ్యా త్రిపురశ్రీ వశంకరీ |
జ్నానముద్రా జ్నానగమ్యా జ్నానజ్నేయ స్వరూపిణీ ||179
యోనిముద్రా త్రిఖండేశీ త్రిగుణాంబా త్రికోణగా |
అనఘా ద్భుతచారిత్రా వాంచితార్ధ ప్రదాయినీ || 180
అభ్యాశాతిశయజ్నాతా షడధ్వాతీతరూపిణీ |
అవ్యాజ్యకరుణా మూర్తి రజ్నానధ్వాంత దీపికా ||181
ఆబాలగోపవిదితా సర్వానుల్లంఘశాసనా |
శ్రీచక్రరాజనిలయా శ్రీత్రిపురసుందరీ || 182
శ్రీశివా శివశక్తైక్య రూపిణీ లలితాంబికా |
ఏవం శ్రీలలితాదేవ్యా నామ్నాం సాహస్రం జగుః ||183
ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే, ఉత్తరఖండే, శ్రీహయగ్రీవాగస్త్య సంవాదే
శ్రీలలితా రహస్యనామసాహస్ర స్తోత్ర కథనం నామ ద్వితోయో ధ్యాయః


ఉత్తర పీఠిక (ఫలశృతి)
మూడవ అధ్యాయం అయిన "ఉత్తర పీఠిక"లో ఫలశృతి చెప్పబడింది. అందులో హయగ్రీవుడు అగస్త్యునికి తెలిపిన కొన్ని విషయాలు:
శ్రీలలితాసహస్రనామములు రహస్యమయములు. అపమృత్యువులను, కాలమృత్యువులను కూడా పోగొట్టును. రోగాలను నివాఱించి దీర్ఘాయుర్దాయాన్ని ప్రసాదిస్తాయి. సకల సంపదలనూ కలిగిస్తాయి. ఈ స్తోత్రాన్ని శ్రద్ధాసక్తులతో విధివిధానుసారం పఠించాలి. అన్ని పాపాలను హరించడానికి లలితాదేవియొక్క ఒక్కనామం చాలును. భక్తుడైనవాడు నిత్యం గాని, పుణ్యదినములయందుగాని ఈ నామపారాయణ చేయాలి. విద్యలలో శ్రీవిద్య, దేవతలలో శ్రీలలితాదేవి, స్తోత్రాలలో శ్రీలలితా సహస్రనామ స్తోత్రము అసమానములు. శ్రీవిద్యోపాసన, శ్రీచక్రార్చన, రహస్యనామపారాయణ అనే భాగ్యాలు అల్పతపస్వులకు లభించవు. భక్తిహీనులకు దీనిని ఉపదేశింపరాదు. ఈ లలితాసహస్రనామస్తోత్రమును తప్పక పఠిస్తే శ్రీదేవి సంతసించి సర్వభోగములను ప్రసాదించును.

అర్ధాలు, రహస్యార్ధాలు
ఉత్తరపీఠికలోను, పూర్వపీఠికలోను చెప్పబడిన విధంగా లలితాసహస్రనామస్తోత్రంలోని వివిధనామాలు రహస్యమయాలు, అనేక నిగూఢార్ధ సంహితములు అని అనేకులు భావిస్తారు. నామాలలో అనేక మంత్రాలు, బీజాక్షరాలు నిక్షిప్తమై యున్నాయని కూడా వారి విశ్వాసం. ముఖ్యంగా శాక్తేయులకు ఇవి చాలా విశిష్ఠమైనవి. ఈ శ్లోకంలోని నామాల అర్ధాలను, భావాలను అనేకులు వ్యాఖ్యానించారు. అంతేగాక వాటిని విషయపరంగా కొన్ని విభాగాలుగా చేసి, ఒక్కొక్క విభాగం ఒక్కొక్క తాత్విక లేదా తాంత్రిక ఆంశానికి చెందినట్లుగా భావిస్తున్నారు.
సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, అనుగ్రహము - అనే పంచకృత్యాలకు అనుగుణంగా ఈ శ్లోకాలలోని నామములు కూర్చబడినాయని ఒక వివరణ. దేవి "పంచకృత్యపరాయణ" అని వర్ణింపబడింది.
సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జితా
సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణీ -- 63
సంహారిణీ రుద్రరూపా తిరోధానకరీశ్వరీ
సదాశివానుగ్రహదా పంచకృత్య పరాయణా -- 64

అనగా దేవి బ్రహ్మరూపిణియై సృష్టిని, విష్ణు(గోవింద)రూపిణియై స్థితికార్యమును, రుద్రరూపిణియై సంహారమును, ఈశ్వరియై తిరోధానమును, సదాశివమూర్తియై అనుగ్రహమును నిర్వహించుచున్నది. మొదటి శ్లోకంలోని మొదటి మూడునామములు - శ్రీమాత, శ్రీమహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి - కూడ సృష్టి, స్థితి, సంహారములను సూచించుచున్నవి. ఆలాగే తరువాతి రెండు నామములు - చిదగ్నికుండ సమ్భూతా, దేవకార్యసముద్యతా - అనునవి తిరోధానమును, అనుగ్రహమును సూచించునని అంటారు.
"ఉద్యద్భానుసహస్రాభా" నుండి "శింజాన మణిమంజీరమండిత శ్రీపదాంబుజా" వరకు శ్రీదేవి కేశాదిపాద సౌందర్యవర్ణన ఉన్నది. తరువాత దేవి ఆవాసమైన చింతామణిగృహవర్ణన, ఆపై భండాసురసంహారము, కుండలినీశక్తికి సంబంధించిన నామాలు ఉన్నాయి. ఆ తరువాత అనేక విద్యలు, పూజలు, మంత్రములు నిక్షిప్తమై ఉన్నాయంటారు.

శ్రీవిద్య, లలితాసహస్రనామము
లలితాసహస్రనామ పారాయణ (మంత్రము), శ్రీచక్ర పూజ (యంత్రము), కుండలినీయోగ సాధన (తంత్రము), - అనేవి శ్రీవిద్యోపాసనలో ముఖ్యమైన అంశాలు. సగుణ బ్రహ్మోపాసన, నిర్గుణ బ్రహ్మోపాసన అనే రెండు విధానాలు ఈ విద్యాసాధనలో నిక్షిప్తమై ఉన్నాయి. యోగసాధనలో చెప్పబడే షట్చక్రాలు (మూలాధార చక్రము, స్వాధిష్ఠాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, ఆజ్ఞా చక్రము) లలితాసహస్రనామంలో చెప్పబడినాయి. ఈ చక్రాలను అధిగమించి సహస్రారంలో కొలువైయున్న జగన్మాతృకా స్వరూపాన్ని చేరుకోవడమే కుండలినీయోగసాధనలోని లక్ష్యం.

వ్యాఖ్యానాలు
లలితా సహస్ర నామానికి అనేకులు వ్యాఖ్యలు వ్రాశారు. వీటిలో భాస్కరాచార్యుడు వ్రాసిన "సౌభాగ్య భాస్కరము" మనకు తెలిసినవాటిలో మొదటిది, మరియు అనేక ఇతర వ్యాఖ్యానాలకు మాతృక వంటిది. భాస్కరాచార్యుడు కృష్ణాతీరవాసి, ఆంధ్రుడు. కర్ణాటకలో బీజాపూర్ నవాబుకు మంత్రి గంభీరరాయ దీక్షితులు మహాపండితుడు. మహాభారతాన్ని పార్శీ భాషలోనికి అనువదించి "భారతి" అనే బిరుదు పొందాడు. ఇతని భార్య కోనమాంబ. రాచ కార్యంపై ఈ దంపతులు హైదరాబాదుకు వచ్చినపుడు వారికి జన్మించిన బిడ్డ భాస్కరరాయలు. ఇతడు నారయణపేట వద్ద లోకాపల్లిలో నృసింహయాజి వద్ద విద్యాభ్యాసం చేశాడు. సూరత్‌లోని ప్రకాశానంది శివదత్తశుక్ల వద్ద దీక్షోపదేశం పొందాడు. దేశాటనం చేస్తూ 1750 ప్రాంతంలో కాశీ నగరాన్ని సందర్శించాడు. అక్కడ "సౌభాగ్య భాస్కరము" అనబడే లలితాసహస్రనామస్తోత్ర వ్యాఖ్యానం రచించాడు. ఇంకా సేతుబంధము, చండాభాస్కరము, తృచ భాస్కరము, పరివస్యా రహస్యము మొదలైన 43 గ్రంధాలను రచించాడు. ఇతని సిద్ధి శక్తులను గూర్చి, పాండిత్యాన్ని గూర్చి అనేక గాధలు ప్రచారంలో ఉన్నాయి.
సౌభాగ్య భాస్కరమే కాకుండా మరికొన్ని ప్రసిద్ధ వ్యాఖ్యానాలు -
విమర్శనానందుని వ్యాఖ్యానం - 200 శ్లోకాలలో, 9 అధ్యాయాలుగా ఉన్నది. ఈ విమర్శనానందుడు విమలానందనాధుని శిష్యునిగా తెలుస్తున్నది.
సౌభాగ్య రత్నాకరము - సచ్చిదానందనాధూని శిష్యుడైన విద్యారణ్యనాధుని వ్యాఖ్య - 36 తరంగాలలో ఉన్నది.
శివానందనాధుని శిష్యుడైన భట్టనారాయణుని వ్యాఖ్యం - 2500 శ్లోకాలలో

విశేషాలు
కొన్ని సహస్రనామ స్తోత్రాలలో కొన్ని నామాల పునరుక్తి కనిపిస్తుంది. అలాంటి చోట్ల వ్యాఖ్యాతలు ఆ నామాలకు వేరు వేరు అర్ధాలను తెలిపి పునరుక్తి దోషం లేదని నిరూపించారు. కాని లలితా సహస్రనామ స్తోత్రంలో ఏ నామము పునరుక్తింపబడలేదు.
సంస్కృత శ్లోకాలలో కొన్ని చోట్ల ఛందస్సు సరిపోవడానికి "తు, చ, అపి, హి" వంటి అక్షరాలు, పదాలు వాడడం జరుగుతుంది. కాని లలితా సహస్రనామస్తోత్రంలో అలా ఎక్కడా వాడలేదు.


No comments:

Post a Comment