మతము (part 6)
continuation హిందూమతము.
అరణ్యకాలు
ప్రాచీన కాలంలో వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిసి ఒకే ఒక వేదరాశిగా ఉండేది. ఎవరయినా వేదం నేర్చుకోవాలంటే ఒకే ఒక వేదరాశిగా ఉన్న వేదంలోని ఋక్కులు, యజస్సులు, సామలు అన్నీ కలిపి నేర్చుకునేవారు. కృతయుగం నుండి ద్వాపరయుగం వచ్చేసరికి మొత్తం వేదరాశిని అధ్యయనము చేయవలెనంటే బహుకష్టముగా ఉండేది. భగవానుడు అంశ అయిన వేదవ్యాసుడు ఈ వేదరాశిని విడివిడిగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము మరియు అధర్వణవేదము అను నాలుగు భాగములుగా విభజించాడు. వేదాలలో సంహితలు మూలగంథాలు. వీటికి వ్యాఖానాలు బ్రాహ్మాణాలు అవతరించాయి. బ్రాహ్మాణాలలోని ఒక భాగంగానే అరణ్యకం ఆవిర్భవించింది.
అరణ్యకములు
అరణ్యకములు అనగా అడవులకు సంబంధించిన విషయాలు. వివిధ కర్మ, యజ్ఞ కార్యముల అంతరార్ధాలను వివరించేవి. ఇవి బ్రాహ్మణములకు, ఉపనిషత్తులకు మధ్యస్థాయిలో ఉంటాయి. ఇవి కూడా బ్రాహ్మణాలలాగానే కర్మవిధులను ప్రస్తావిస్తాయి. కాని వీటిలో కర్మలయొక్క భౌతిక భాగం ఉండదు. కర్మలవెనుక ఉన్న నిగూఢమైన తత్వాలమీది ధ్యానానికి ఆరణ్యకాలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయి. ప్రతి సంహితలు బ్రాహ్మణాలున్నట్లే అరణ్యకాలు కూడా ఉండేవి. కాలాలు గడిచే కొద్దీ ప్రజల నిరాదరణకు బలై చాలా వరకు నశించి పోయాయి. అథర్వవేదానికి చెందిన గోపథబ్రాహ్మణం అనే బ్రాహ్మణానికి సంబంధించిన అరణ్యకం లేకపోవడము ఇందుకు తార్కాణం.
అరణ్యకాలు అంటే ఏమిటి ?
వేదములలో సంహితలు మహర్షులు దర్శించినవి కావున ఇవి మూలగ్రంథాలు. బ్రాహ్మణాలనేవి సంహితలకు వ్యాఖ్యాన రూపాలు. వేద రాశిలో సంహితలు, బ్రాహ్మణాలు వరుసగా ఒకటి, రెండు స్థానములు కాగా అరణ్యకాలు మూడవ స్థానమును పొందినవి. అరణ్యకాలు అంటే అనేకమంది ద్వారా ఈ క్రింది విధముగా అనేక అర్థాలు ప్రతిపాదించబడినవి.
అరణ్యంలో దీక్షతో అథ్యయనము చేసిన గ్రంథాలే అరణ్యకాలు.
గృహస్థాశ్రమము వదలి సన్యాసము లేదా సన్యసించుట వలన అరణ్యాలకు వెళ్ళి ప్రశాంత వాతావరణములో తపదీక్షతో వేదాధ్యయనము చేయటకు కావలసిన గ్రంథాలే అరణ్యకాలు.
కర్మఫలంతో పాటు జ్ఞానం సంపాదించు మేలు కలయిక అరణ్యకాలు.
యజ్ఞాలలోని రహస్యాలను అరణ్యాలలోనే మహర్షులు చర్చించారు.
బ్రాహ్మణము లలో ఉండే గృహస్థాశ్రమ కర్మకాండలు, జ్ఞానం మాత్రము ప్రధానముగా ఉండే ఉపనిషత్తు ల మేలు కలయికయే అరణ్యకాలు.
అరణ్యములలో మాత్రమే ఆచరించవలసినవి కావున అరణ్యకాలు.
వేదాల సారమే అరణ్యకాలు.
అరణ్యకాలు - సంహితలు
వేద విభాగానికి చెందిన సంహితలు మంత్రములతో కూడినవే మునుముందు వేదం అనుకునేవారు. తదుపరి కాలాములో మంత్రముతో పాటు వ్యాఖ్యాన రూపాలైన బ్రాహ్మణాలు కూడా కలిపిందే "వేదం" అని ఇంకొందరు అభిప్రాయ పడ్డారు. అరణ్యకాలు మాటేమిటి ? ఇవి కూడా కర్మభాగంతో పాటుగా జ్ఞాన మార్గమునకు చెందిన ఉపనిషత్తులు కలిగి ఉండుటచే వేదమని పిలువ కూడదని కొందరి అభిప్రాయము. అందుకు కారణము వేదాంతమే ఉపనిషత్తులు అని వ్యవహరించారు.
సంహితము
సంహిత అనగా బాగా మేలు చేసేది అనిఅర్ధం. ప్రతి వేదంలోకూడా సంహిత ఉంటుంది. ప్రతి వేదంలోనూ నాలుగు విభాగాలుంటాయి. (1) సంహిత (2) బ్రాహ్మణాలు (3) అరణ్యకాలు (4) ఉపనిషత్తులు
వేదశాస్త్రం
"సంహితం భవతి హ్యక్షరిణి ధనం ప్రతిష్ఠాయై" - అనగా తరగని సంపదను కలిగించునది సంహితము. "సంధి" అనే అర్ధంలో కూడా సంహితను వివరిస్తారు. వేదమునందలి శాస్త్రమును సంధించునది సంహితము. (సంహితమ్ = కూడుకొనునది). వేద సంహిత అంటే మంత్రాల, సూక్తాల కూర్పు మాత్రమే. రచన కాదు. అంటే వేద ద్రష్టలైన ఋషులు వీటిని రచించలేదు (వేదాలు "అపౌరుషేయాలు"). వీటిని దర్శించి, స్మరించి, కూర్చారు (సంకలనం చేశారు.
సంహిత అర్థం
"సంహిత" అంటే మంత్రాల సంకలనం. నాలుగు వేదాలకు నాలుగు సంహితలున్నాయి. అసలు వేదం అంటే సంహితా విభాగమే. అంటే మంత్రాల సముదాయం. ఋక్సంహితలోని మంత్రాలను ఋక్కులు అంటారు. యజుర్వేదంలో యజుస్సులు, సామవేదంలో సామాలు, అధర్వవేదంలో అంగిరస్‌లు అనబడే మంత్రాలుంటాయి. యజ్ఞంలో నలుగురు ప్రధాన ఋత్విజులు ఉంటారు. ఋగ్వేద మంత్రాలను పఠించే ఋషిని "హోత" అని, యజుర్మంత్రాలు పఠించే ఋషిని "అధ్వర్యుడు" అని, సామగానం చేసే ఋషిని "ఉద్గాత" అని, అధర్వాంగిరస్సులను పఠించే ఋషిని "బ్రహ్మ" అని అంటారు. ఈ నలుగురూ యజ్ఞ వేదికకు నాలుగు వైపుల ఉంటారు.
వేద సంహితలలో యజుస్సంహితలో మాత్రమే గద్యభాగం ఎక్కువగా ఉంది. ఋక్సంహిత, సామ సంహిత పూర్తిగా గద్యభభాగమే అయినా వాటిని కూడా మంత్రాలలా పఠిస్తారు.
చతుర్వేద సంహితలు
ఋగ్వేద సంహిత దేవతల గుణగణాలను స్తుతిస్తుంది.
యజుర్వేద సంహిత వివిధ యజ్ఞాలను నిర్దేశిస్తుంది.
సామవేద సంహిత దేవతలను ప్రసన్నులను చేసుకొనే గానవిధిని తెలుపుతుంది.
అధర్వవేద సంహిత బ్రహ్మజ్ఞానం సహితంగా అనేకానేక లౌకిక విషయాలను వివరిస్తుంది.
యజుర్వేద సంహితలో మళ్ళీ రెండు భాగాలున్నాయి. (1) వాజసనేయ మాధ్యందిన శుక్ల యజుర్వేద సంహిత (2) కృష్ణ యజుర్వేద తైత్తరీయ సంహిత.
అనంతర సంహితలు
వేదాల అనంతరం వచ్చిన క్రింది గ్రంధాలు కూడా 'సంహిత" పేరుతో ప్రసిద్ధమయ్యాయి.
ఘేరండ సంహిత
చరక సంహిత
కశ్యప సంహిత
అష్టావక్ర సంహిత
భృగు సంహిత
యాజ్ఞవల్క్య సంహిత
బ్రహ్మ సంహిత
గర్గ సంహిత
దేవ సంహిత

No comments:
Post a Comment