Thursday, 11 August 2016

నదీమతల్లి కృష్ణవేణమ్మ కధ

 నదీమతల్లి కృష్ణవేణమ్మ కధ 
 
 
పూర్వం సృష్టికర్త బ్రహ్మ యఙ్ఞం చేయ సంకల్పించి ఋషులను ,ముక్కోటిదేవతలను ,అందరినీ పిలిచి,యఙ్ఞం ప్రారంభ సమయానికి సరస్వతి రానందున ,యఙ్ఞం ప్రారంభించటానికి సుముహూర్తం ఘడియలు దాటతాయనే భావంతో ,ఇంద్రుడు గొల్లకన్యను తీసుకొనిరాగా ,బ్రహ్మ వివాహమాడి ఆకన్యకు " గాయత్రి " అని పేరుపెట్టి యఙ్ఞం ప్రారంభించెను . యఙ్ఞం జరుగుతున్న సమయంలో సరస్వతీ అక్కడకు వచ్చి , విషయం తెలుసుకొని ,క్రోధావేశముతో అందరూ నదులై ప్రవహించమని శపించెను. శ్రీ విష్ణువు అంశ "కృష్ణానది" గానూ , పరమేశ్వరుడు " వేణీ " నదిగానూ, బ్రహ్మ "కుముద్వతి" నదిగానూ, మిగిలిన దేవతలు,మునులు,నారాయణి,భీమ, మలాసహరిణి, భద్ర హరిణి, విశా,కౌశిక, విజయ,మొదలగు నదులు "కృష్ణవేణి" నదిలో కలిసిరి. త్రిమూర్తుల, దేవతల, మునుల, స్వరూపమే "కృష్ణవేణి" మహారాష్ట్రలోని మహాబలేశ్వరం వద్ద పడమటికనుమల్లో సహ్యాద్రి పర్వతశ్రేణుల్లోపుట్టి మహారాష్ట్ర,కర్నాటక, తెలంగాణా ఆంధ్రప్రదేశ్ లలో సుమారు 1400 కిలోమీటర్లు ప్రయాణించి ఆంధ్రప్రదేశ్ లో దివిసీమలో హంసలదీవివద్ద సముద్రంలో కలుస్తుంది. పడమటి కనుమల్లో సహ్యాద్ర పర్వతంపై బ్రహ్మ తపస్సు చేసిన ప్రాంతాన్ని " బ్రహ్మగిరి " అని "వేదగిరి" అని పిలువబడుతున్నాయి. మహావిష్ణువు ఈ బ్రహ్మగిరి సమీపాన అశ్వత్ధ రూపములోనూ , ఆచెట్టు వేళ్ళనుండి "కృష్ణా"నది పుట్టిందనీ ,అచ్చట లింగాకారములో పరమేశ్వరుడు ఉద్భవించగా ,అక్కడవున్న ఉసిరిక చెట్టు వ్రేళ్ళనుండి "వేణీ" నది అవతరించిందనీ, ఇవి సంగమై "కృష్ణవేణి "అయినది. అనికధ .....

No comments:

Post a Comment