పుష్కరములు అన్న మాట ఎందుకు వచ్చింది?
పుష్కరములు అన్న మాట ఎందుకు వచ్చింది అనగా ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన పరమేశ్వరుని గురించి గొప్ప తపస్సు చేస్తే ఈశ్వరుడు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలి ? అని అడిగితే నేను గొప్ప కల్యాణ కారకుడిని కావాలి. నన్ను ఏస్థానములో పెట్టినా సరే. నేను దేనియందు ఉంటానో దాని ద్వారా లోకమునకు కల్యాణము జరగాలి. అందరికి శుభములు అందాలి. నన్ను అటువంటి కల్యాణ కారకుడిని చేసి ఎక్కడ ఉంటావో చెప్పు అన్నాడు. ఈదేశములో పుట్టిన మహాత్ముల యొక్క అనుగ్రహము చేత ఇంత పేరు ఇన్ని ఉత్సవములు వచ్చాయి. చాలా గొప్ప కోరిక కోరావు నీకోసము అడగలేదు. లోకము కోసము అడిగావు. లోక కల్యాణార్ధము ఏదైనా ఒకదానియందు నన్ను ఉంచు లోకములను తరింపచేస్తానని అడిగావు. నీటియందు ఉండు. నీరు అక్కరలేదు అన్న వాడు ఉండడు. నీరు పుష్కలముగా ఉంటే పాడిపంటలు బాగుంటాయి. దేశము అంతా సుసంపన్నముగా ఉంటుంది. అందువలన నీటి యందు ఉండమని అంటే పుష్కరుడు నీటియము ఉండటము మొదలు పెట్టాడు.

చతుర్ముఖ బ్రహ్మగారు ఇన్ని ప్రాణులను సృష్ఠించాలి. ఆ
సృష్ఠి కల్యాణ ప్రదముగా ఉండాలి. ఎందుకనగా ఒక శరీరము ఇస్తే దానిద్వారా
పాపమును పోగొట్టుకుని పుణ్యమును సముపార్జనము చేసుకోవాలి లేదా కొత్త పాపము
చేయకుండా అన్నా ఉండాలి. కాబట్టి సృష్ఠి కల్యాణప్రదము కావాలి అంటే
ఇంతకుముందు నీటిలో లోక కల్యాణము కోసము పుష్కరుడు కూర్చున్నాడు కాబట్టి ఆ
పుష్కరుడు కూర్చున్న నీటితోపాటు కమండలములో ఉంచుకుంటానని పరమేశ్వరుని
ప్రార్ధన చేసాడు. నువ్వు అడిగినది లోక కల్యాణము కోసమే ఆయన అడిగింది లోక
కల్యాణము కోసమే కాబట్టి పుష్కర సహితమైన జలములను నీ కమండలములో పెట్టుకో
అనుగ్రహిస్తున్నాను అన్నాడు. బ్రహ్మగారి చేతిలోని కమండలములోని జలములలో
పుష్కరుడు కూర్చున్నాడు.
గురువు బృహస్పతి తపస్సు చేసాడు. పరమ శివుడు ప్రత్యక్షము అయ్యాడు. ఏమికావాలి అంటే నేను ఒక్కక్క రాశిలో ఉన్చు కున్నప్పుడు ఒక్కక్క నదిలోకి వెడుతుంటాను. నేను ఏ నదిలోకి వెడతానో ఆ నదిలోకి నాతో పాటు పుష్కరుడిని పంపించు అన్నాడు. శివుడు పుష్కరుని చూసి వెళతావా అంటే నేను వెళ్ళను బ్రహ్మ కమండలములోనే బాగున్నది అన్నాడు . బృహస్పతి ఆయన వస్తేనే నాకు బాగుంటుంది అన్నాడు . ఇద్దరి ఒంక చూసి నేను ఒక మధ్యే మార్గము చెపుతాను. నువ్వు ఒక్కక్క రాశిలోకి వెళ్ళినప్పుడు ఏ నదిలోకి వెడతావో ఆ నదికి పుష్కరములు వస్తాయి. మొదటి 12 రోజులు చివరి 12 రోజులు 12 రాశులు మారాలి కాబట్టి మొదటివి ఆది పుష్కరములు చివరవి అంత్య పుష్కరములు. నువ్వు వెళ్ళిన రోజున మొదటి 12 రోజులు నీతో పాటు పుష్కరుడు రావాలి. పుష్కరుడికి బ్రహ్మ కమండలము ఇష్ఠము. పుష్కరుని విడచి పెట్టకుండా బ్రహ్మగారు కూడా వస్తాడు. ఆయన వస్తారు కనక దేవతలు అందరూ వస్తారు. అందరూ నువ్వు ఏ నదీ జలములలోకి వెడతావో ఆ నదీ జలములలో మొదటి 12 రోజులు చివరు 12 రోజులు స్థిర నివాసము చేస్తారు. ఇప్పుడు వెళ్ళి స్నానము చేస్తే 33 కోట్లమంది దేవతలు,ఋషి మండలము, చతుర్ముఖ బ్రహ్మగారు, పుష్కర్తుడూ, జలాధి దేవతలు, నది యొక్క అధిదేవత ఇంతమంది అనుగ్రహమునకు పాత్రులు అవుతారు. అందుకని పుష్కరములు వస్తాయి. గురుడు మారే రాశిని బట్టి పుష్కరములు రావడము ప్రారంభము అవుతాయి.

No comments:
Post a Comment