Wednesday, 31 January 2024

నిజం అనేది కలత చెందుతుంది, కానీ ఓడిపోదు.✍️

తన చివరి శ్వాసను విడుస్తున్న , జటాయువు… ‘నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికి వాడు అని అనుకుంటారు!

రావణుడు జటాయువు యొక్క రెండు రెక్కలను తెంచినప్పుడు… అప్పుడు  మృత్యువు వచ్చింది. అపుడు జటాయువు మృత్యువుకు సవాలు విసిరాడు.

జాగ్రత్త! ఓ మృత్యువా ! ముందుకు రావడానికి సాహసం చేయద్దు. నేను ఎప్పటివరకు మరణాన్ని అంగీకరించనో, అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీతామాత యొక్క సమాచారం  ‘ప్రభు శ్రీరాముడి’కి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు” అన్నాడు!

మరణం జటాయువును తాకలేకపోతోంది, అది నిలబడి   వణుకుతూనే ఉంది. మరణం అప్పటివరకు కదలకుండా నిల్చునే వుంది, వణుకుతూనే ఉంది. తాను  కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకి వచ్చింది.

కానీ మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు 58 రోజులు బాణాల అంపశయ్య మీద పడుకుని మరణం కోసం ఎదురు చూశాడు. అతని కళ్ళలో కన్నీళ్ళు. ఏడుస్తూవున్నాడు. కానీ భగవంతుడు మనస్సులో తనకి తాను  చిరునవ్వు నవ్వుతున్నారు!

ఈ దృశ్యం చాలా అలౌకికమైనది.

రామాయణంలో జటాయువు శ్రీరాముడి  ఒడిలో పడుకున్నాడు. ప్రభు "శ్రీరామ్" ఏడుస్తున్నాడు మరియు జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు.

అక్కడ మహాభారతంలో

భీష్మ పితామహుడు  ఏడుస్తున్నాడు మరియు       "శ్రీ కృష్ణుడు" చిరునవ్వు నవ్వుతున్నాడు.

తేడా ఉందా లేదా?

అదే సమయంలో , జటాయువుకు ప్రభువు "శ్రీరాముడి" ఒడి పాన్పుగా  అయింది. కాని భీష్మపితామహుడు  చనిపోయేటప్పుడు బాణపు మొనలు పాన్పుగా అయ్యాయి!

జటాయువు తన కర్మ బలం ద్వారా ప్రభు "శ్రీరాముడి" యొక్క ఒడిలో ప్రాణ త్యాగం చేసాడు.  జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు. మరియు బాణాలపై భీష్మపితామహుడు  ఏడుస్తున్నాడు.

ఇంత తేడా ఎందుకు?

ఇంతటి తేడా ఏమిటంటే

ద్రౌపది ప్రతిష్టను నిండు సభలో  పరువు తీస్తున్నా భీష్మ పితామహుడు చూశాడు. అడ్డుకోలేకపోయాడు! దుశ్శాసనునికి  ధైర్యం ఇచ్చారు. దుర్యోధనుడికి అవకాశం ఇచ్చాడు. కాని ద్రౌపది ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ, అరుస్తూ, అరుస్తూ వున్నా సరే భీష్మ పితామహుడు తల వంచుకునే వున్నాడు. ద్రౌపదిని రక్షించలేదు.

దీని ఫలితం ఏమిటంటే, మరణం కోరుకున్నప్పుడే  వరం వచ్చిన తరువాత కూడా, బాణాల అంపశయ్య దొరికింది.

జటాయువు స్త్రీని సన్మానించాడు. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, కాబట్టి చనిపోతున్నప్పుడు, అతనికి ప్రభు “శ్రీరాముడి” ఒడి అనే పాన్పు లభించింది!

ఇతరులుకు తప్పు జరిగిందని చూసి  కూడా ఎవరు కళ్ళు తిప్పు కుంటారో,  వారి గతి భీష్ముడిలా అవుతుంది. ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ, ఇతరుల కోసం పోరాడుతారో వారు, మహాత్మ జటాయువులా కీర్తి సంపాదిస్తారు.

"సత్యమేవ జయతే "

          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

ఒక మంచి జ్ఞానోదయo కలిగించే ఉదాహరణ లాంటి నిజం :-

అనగనగా... 🔔

ఒకడు ఎలాగైనా ధనం సంపాదించాలని ,

చాలా కస్టపడి సుమారు 1,000 కోట్లు రూపాయిలు సంపాదించాడు.

ఒకరోజు , తాను  ఎంతో కష్టపడి , చెమటోడ్చి సంపాదించిన ధనం ,  తాను చనిపోయినా సరే ఎవరికీ , ఒక్క పైసా కూడా ఇవ్వకూడదని , బాగా ఆలోచించి, 

పేపర్లో ఒక ప్రకటన ఇచ్చాడు

ఏమని అంటే , *ఎవరైతే నేను చనిపోయిన తరువాత నా డబ్బు నాతో తీసుకొని వెళ్లే సులువు (టెక్నిక్) చెపితే వారికి 10 కోట్లు ఇస్తానన్నాడు

నెల గడిచినా ఎవరు రాలేదు. మల్లీ 100, 200 కోట్లు ఇస్తానన్నా ఒక్కరు కూడా రాలేదు. దానితో చాలా బెంగతో , చిక్కి సగం అయిపోయి ఉండగా.........

ఈలోగా అకస్మాత్తుగా  ఒక  

జ్ఞాని వచ్చి 

నేను మీ డబ్బు మీరు చనిపోయిన  తరువాత కూడా మీకు  ఉపయోగపడే సులువు టెక్నిక్  చెపుతాను అని అన్నాడు.

ఎలా ?  అని ప్రశ్నించేడు కోటీశ్వరుడు.

దానికి ఆ జ్ఞాని కోటీశ్వరునికి మీరు అమెరికా, ఇంగ్లండ్ , జపాన్ వెళ్ళారా ? అని అడిగేడు.

Ans :-Yes.

Q ;-   అమెరికాలో మీరు ఎన్ని  రూపాయలు ఖర్చు చేశారు అని అడిగాడు

Ans: - నా Indian currency అమెరికాలొ చెల్లదు. 

కనుక నా రూపాయలను డాలర్లు గా మార్చి తీసుకొని వెలతాను ,  అదే England ఆయితే pounds , జపాన్ ఆయితే Yens 

ఇలా ఏదేశం వెళ్తే , ఆ దేశ కరెన్సీ క్రింద నా రూపాయలను మార్చి ,  ఖర్చుకి తీసుకొని వెళ్తాను అని అన్నాడు..     

ఇప్పుడు జ్ఞాని ఇచ్చిన సలహా

ఓ కోటీశ్వరుడా...............

అలాగే నీవు చనిపోయిన తరువాత కూడా  , నీడబ్బు నీతో రావాలంటే , ఒకవేళ నీవు నరకానికి వెల్లాలి అని అనుకుంటే నీడబ్బును   పాపము " లోనికి  మార్చు. అంటే దుర్వినియోగం, చెడు వ్యసనాలకి, పాపపు పనులలోనికి మార్చు.

లేదా ..... ఒక వేళ నీవు దేవలోకానికి వెళ్లాలంటే, నీ డబ్బును దాన, ధర్మములు చేసి పుణ్యంగా Exchange   చేయు అని  చెప్పగానే .........

ఆ ధనవంతునికి  జ్ఞానోదయం కలిగి, ఆ జ్ఞానికి 100 కోట్లు  తీసుకోమంటాడు. 

దానికి జ్ఞాని నేను కస్టపడి

పని చేయకుండా ఒక్క పైసా కూడా తీసుకోను అని సున్నితంగా తిరస్కరిస్తాడు.

అప్పుడు జ్ఞానోదయం ఆయిన ఆ ధనవంతుడు , తన ఆస్తికి ఆ జ్ఞానినే  Maneger గా నియమించి , తగిన జీతం ఇచ్చి, తన సంపద అంతా సన్మార్గంలోనికి, పుణ్యo లోనికి , జ్ఞాని సలహాతో ఖర్చు చేయగా, 

పాత పాప కర్మలు  పరివర్తనతో  నశిoచి , మంచి కర్మల వలన  పుణ్య గతులకు వెళ్తాడు........

అయ్యా..... ఇదండీ సంగతి  

మన సంపదలు మనతో వచ్చే విధానం.

ఇక మన ఇష్టమే .

మనం కష్టపడి సంపాదించినది మంచి ధర్మ  మార్గం లో  ఖర్చు చేసి ,  పుణ్యం గా మార్చి  మనతో తీసుకొని వెల్దామా ????? 

             లేక

మన తలనొప్పిని కూడా తీసుకోలేని వారికి వదిలి వెల్దామా ?..............

ఎవరు చేసిన కర్మ

         వారే అనుభవిస్తారు🙏         

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

42 రోజులు శివాలయ దర్శనం!!! నియమాలు !!!

జనవరి 26 న మొదలు పెట్టండి శివాలయం దర్శనం కి వెళ్ళడం, మార్చ్ 8 కి శివ రాత్రి అదే రోజు కి 42 రోజులూ పూర్తి అవుతుంది.

42 రోజులు ప్రతీ రోజు శివాలయం దర్శనం ప్రదోష కాలంలో చేస్తే ధర్మ బద్ధంగా ఉండే ఏ కోరిక ఐనా ఖచ్చితంగా తీరుతుంది.

1. రేపట్నుంచి వెళ్లాలి అనుకుంటున్నారా, ఈ రోజు రాత్రి నుంచి మీరు మధ్యపానం, ధూమపానం మరియు మాంసాహారం ఆపేయండం, మితంగా భోజనం చేసి నిద్ర చేయండి.

2. స్నానం చేసి, విభూది ధారణ చేసి, మీ ఇంట్లో ఉన్న దేవుడు కి నమస్కారం చేసి శివాలయం కి భయలుదేరండి.

3. ప్రతీరోజూ ప్రదోసకాలం అనగా సూర్యాస్తమయం కి అటు ఇటు గా శివాలయం కి వెళ్ళండి 42 రోజులు.

4. 9 నెలల నిండు గర్భిణీ ఎలా ఎంత జాగ్రత్తగా అడుగు లో అడుగు వేస్తూ నడుస్తారో అలా శివాలయంలో 3 ప్రదక్షిణలు చేయండి శివనామ స్మరణతో.

5. ప్రదక్షిణలు తరువతా శివలింగం కి నమస్కారం పెట్టుకోండి చాలు మీ మనసుకి తృప్తి పడే వరకు శివలింగం చూడడం, ఏలాంటి కోరిక కోరవద్దు ఎందుకు అంటే శివునికి తెలుసు మీకు ఏమి కావాలో.

6. ఒక 5-10 నిముషాలు శివగుడి లో శివనామ జపం చేయండి లేదా ప్రశాంతంగా కూర్చోండి చాలు.

ఆడపిల్లల కి 42 రోజులు చేయడానికి అవాంతరాలు ఉంటాయి కాబట్టీ, మీరు ఆ+T 5 రోజులు ఇంటి దగ్గరే ఉండి,6 వ రోజు నుండి మళ్ళీ కొనసాగించండి అలా 42 రోజలు పూర్తి చేయండి.రోజు ప్రదోసకాలం లో కుదరకపోతే ఉదయం ఐనా వెళ్ళవచ్చు.

ఈ 42 రోజలు ధూమపానం, మద్యపానం, మాంసాహారం,జూదము కి దూరంగా ఉండటం నియమం.

పొద్దున రోజు 9 గంటలకు మహా శివుడి దర్శనం చేసుకోవచ్చు వేసుకో లేకపోతే ప్రొద్దున 9 గంటలకు లేదా సాయంత్రం ప్రదోషకాలంలో దర్శనం చేసుకోవచ్చు ప్రతిరోజు మనకు వీలు పడినట్టు ఆ మహా శివుడిని ఈ విధంగా మీ దర్శనం చేసుకుంటా తండ్రి అని నొక్కి మీ భక్తుని మీరు కొనసాగించవచ్చు.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

ఫిబ్ర‌వ‌రిలో శ్రీ‌వారి ఆల‌యంలో విశేష ప‌ర్వ‌దినాలు

 తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి నెల‌లో జ‌రుగ‌నున్న విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.

– ఫిబ్ర‌వ‌రి 9న శ్రీ పురంద‌ర‌దాసుల ఆరాధ‌నోత్స‌వం.

– ఫిబ్ర‌వ‌రి 10న తిరుక‌చ్చినంబి ఉత్స‌వారంభం.

– ఫిబ్ర‌వ‌రి 14న వ‌సంత‌పంచ‌మి.

– ఫిబ్ర‌వ‌రి 16న ర‌థ‌స‌ప్త‌మి.

– ఫిబ్ర‌వ‌రి 19న తిరుక‌చ్చినంబి శాత్తుమొర‌.

– ఫిబ్ర‌వ‌రి 20న భీష్మ ఏకాద‌శి.

– ఫిబ్ర‌వ‌రి 21న శ్రీ కుల‌శేఖ‌రాళ్వార్ వ‌ర్ష తిరున‌క్ష‌త్రం.

– ఫిబ్ర‌వ‌రి 24న కుమార‌ధార తీర్థ‌ముక్కోటి, మాఘ పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

రాశిఫలితాలు

తేదీ    ... 01 - 02 - 2024,

వారం ...  బృహస్పతివాసరే ( గురువారం )

మేష రాశి

ఈ రాశి వారికి ఈరోజు మంచిగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం లభిస్తుంది. ఉన్నతాధికారులు మీతో చాలా సంతోషంగా గడుపుతారు. ఈ కారణంగా మీ స్థానం కూడా మెరుగుపడుతుంది. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేయగలిగితే, వ్యాపారులు మంచి లాభం పొందుతారు. మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ భార్య ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.

ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : పేదలకు బట్టలు, అన్నదానం చేయాలి.

వృషభ రాశి

ఈ రాశి వారు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు. కుటుంబ బాధ్యతలు మీపై పెరిగే అవకాశం ఉంది. దీంతో మీకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధిస్తారు. మీరు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేసే అవకాశం ఉంది. అయితే పనిభారం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి.

ఈరోజు మీకు 76 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి.

మిధున రాశి

ఈ రాశి వారు ఈరోజు పనికి సంబంధించి మంచి ఫలితాలను పొందుతారు. మీ కుటుంబ జీవితంలో మీకు గౌరవం లభిస్తుంది. సామాజిక రంగంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ కారణంగా మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు. మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఈరోజు భూమి లేదా ఆస్తికి సంబంధించి మంచి లావాదేవీలను పొందొచ్చు.

ఈరోజు మీకు 63 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు గాయత్రీ చాలీసా పఠించాలి.

కర్కాటక రాశి 

ఈ రాశి వారు ఈరోజు కొత్త పనిని ప్రారంభించడానికి మంచి రోజు కానుంది. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు నష్టపోయే అవకాశం ఉంది. మీ మాటలను అదుపులో పెట్టుకోవాలి. లేదంటే మీ కుటుంబంలో వాదనలు పెరగొచ్చు. మీకు అసమ్మతి పెరగొచ్చు. మీ వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. మీ భార్య ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు. మీ భార్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

ఈరోజు మీకు 80 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు శని దేవుడిని దర్శించుకుని తైలం సమర్పించాలి.

సింహ రాశి

ఈ రాశి వారికి ఈరోజు కొంత మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం విషయం గురించి మాట్లాడితే, మీరు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. లేకుంటే మీరు తీవ్రమైన అనారోగ్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. ఈ విభేదాలు విడాకుల వరకు కూడా చేరొచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ఈరోజు చాలా విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి.

ఈరోజు మీకు 90 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు రాత్రి నల్ల కుక్కకు రోటీ తినిపించాలి.

కన్య రాశి

ఈ రాశి వారికి ఈరోజు మనసులో చాలా సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్త రంగాల్లో మీరు మంచి లాభాలను పొందుతారు. మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందొచ్చు. మీరు మతపరమైన యాత్రకు వెళ్లాలని లేదా ఆలయాలకు ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ఇబ్బందుల్లో ఉంటే, మీ స్నేహితుల నుండి మరింత మద్దతు పొందవచ్చు.

ఈరోజు మీకు 88 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు ‘సంకట హర గణేష్ స్తోత్రం’ పఠించాలి.

తుల రాశి

ఈ రాశి వారు ఈరోజు భూమి లేదా దానికి సంబంధించిన ఏదైనా అంశం కోర్టులో నడుస్తుంటే, ఈరోజు మీరు అందులో విజయం సాధించొచ్చు. మీరు ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు పొందొచ్చు. మీ కుటుంబ జీవితంలో కొన్ని వివాదాలు ఉండొచ్చు. పెద్దల జోక్యంతో మీరు పరిష్కారం కనుగొంటారు. వ్యాపారులకు కొత్త రంగంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు.

ఈరోజు మీకు 86 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు సూర్య భగవానుడికి రాగి పాత్రలో సమర్పించాలి.

వృశ్చిక రాశి

ఈ రాశి వారికి ఈరోజు చాలా విషయాల్లో ఇబ్బందికరంగా ఉంటుంది. దీంతో మీ మనసులో కొంత ఆందోళన
ఈరోజు కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఈరోజు మీ మనస్సు ఏదో ఒకదాని గురించి చాలా ఆందోళన చెందుతుంది. కొన్ని తీవ్రమైన అనారోగ్యం కారణంగా ఈరోజు మీ శరీరంలో చాలా బలహీనంగా ఉంటుంది. మంచి వైద్యుడిని సంప్రదించిన తర్వాత మందులు తీసుకోండి. లేకపోతే మీ వ్యాధి మరింత తీవ్రమవుతుంది. ఈరోజు మీకు తెలిసిన వారి నుండి విచారకరమైన వార్తలను అందుకోవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఈరోజు మీకు 77 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

ధనస్సు రాశి

ఈ రాశి వారు ఈరోజు కొన్ని విషయాల గురించి చాలా భయపడతారు. ఈ కారణంగా మీరు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవలసి ఉంటుంది. మీ మనస్సులో కొంత గందరగోళంగా ఉంటుంది. ఈరోజు మీకు పనిభారం కూడా పెరుగుతుంది. అయితే మీరు అన్ని పనులను ధైర్యంగా చేసుకుంటారు. దీంతో మీకు భయం తగ్గిపోతుంది. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ వైవాహిక సంబంధాల విషయానికొస్తే, మీ జీవిత భాగస్వామితో మీకు వివాదం ఉండొచ్చు.

ఈరోజు మీకు 65 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు శ్రీ విష్ణుమూర్తిని ప్రత్యేక పూజలు చేయాలి

మకర రాశి

ఈ రాశి వారిలో వ్యాపారులు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే, దానిని విస్తరించడానికి మీరు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈరోజు మీరు మంచి లాభాలను పొందుతారు. మీ జీవితంలో పురోగతి లభించే అవకాశం ఉంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధించొచ్చు. మీ తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. మీ జీవిత భాగస్వామి నుండి చాలా అంచనాలను కలిగి ఉంటారు. మీ జీవిత భాగస్వామి వాటన్నింటికీ అనుగుణంగా జీవిస్తారు.

ఈరోజు మీకు 70 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు గోమాతకు బెల్లం తినిపించాలి.

కుంభ రాశి

ఈ రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు ఏదైనా వ్యాపారం చేస్తే, ఆ వ్యాపారంలో మీరు భారీ లాభాలను పొందే అవకాశం ఉంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగుంటుంది. దీంతో మీ మనస్సు కూడా సంతృప్తి చెందుతుంది. చాలా కాలంగా కుటుంబంలో ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే, ఆ విభేదాలు ఈరోజుతో ముగిసే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను పొందుతారు.

ఈరోజు మీకు 91 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం : ఈరోజు హనుమాన్ చాలీసా పఠించాలి.

మీన రాశి

ఈ రాశి వారికి ఈరోజు చాలా బాధాకరంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతారు. వ్యాపారులకు ఈరోజు కొంత ఇబ్బందిగా ఉంటుంది. మీ ప్రియమైన స్నేహితుడితో ఏదో ఒక విషయంలో వివాదం ఉండొచ్చు. ఈ వివాదం విబేధానికి దారి తీయొచ్చు. దీంతో మీ ఇంట్లో పెద్దలు కూడా బాధపడతారు.

ఈరోజు మీకు 80 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం : ఈరోజు సూర్య నారాయణుడికి అర్ఘ్యం సమర్పించాలి

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

పంచాంగం

2024 ఫిబ్రవరి 01

  శోభకృతు - ఉత్తరాయణం,హేమంత ఋతువు

పుష్యమాసే,కృష్ణపక్షే

సూర్యోదయము : 06:37 సూర్యాస్తమయం : 05:55

తిథి: షష్టి ప॥ 10:38 వరకు,తదుపరి సప్తమి

వారము:  గురు(బృహస్పతి)వారం

నక్షత్రం: చిత్త రా॥ 12:16 వరకు,తదుపరి  స్వాతి

యోగం:  ధృతి ఉ॥ 09:43 వరకు,తదుపరి శూల

కరణం:  వణజి ప॥ 10:35 వరకు,బవ

శుభ సమయములు: ప॥ 11:00 — మ॥ 12:00

అమృత ఘడియలు : సా॥ 05:18 — రా॥ 07:02

రాహుకాలం:   మ॥ 01:30 — మ॥ 03:00

యమగండము: ఉ॥ 06-00 —  ఉ॥ 07-30

వర్జ్యం: ఉ॥ 06:52 – ఉ॥ 08:36 వరకు,పునః తె॥ ఉ॥ 06:11 లగాయత్

దుర్ముహుర్తం: ప॥ 10-00 — ప॥ 10:48 వరకు,తదుపరి మ॥ 02:48 — మ॥ 03:36

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

విద్యపై గ్రహాల ప్రభావం

సూర్యుడు

సూర్యునిపై శుభ మైన గ్రహాల ప్రభావం: రాజకీయ శాస్త్రం మరియు ప్రజా పరిపాలన.

బుధుడు రాశులతో సూర్యుడు: గణితం అధ్యయనం

టెక్నికల్ సంకేతాలలో బుధుడు మరియు అంగారకుడితో సూర్యుడు: గణాంకాల అధ్యయనం.

కుజుడు మరియు శనితో సూర్యుడు: ఇంజనీరింగ్, ముఖ్యంగా ఎలక్ట్రికల్.

చంద్రుడు

చెడు ప్రభావాలతో వృశ్చికరాశిలో చంద్రుడు: రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రాలు.

హానికరమైన ప్రభావాలలో చంద్రుడు నీటి సంకేతాలలో: ఔషధాల అధ్యయనం.

చంద్రుడు మరియు శుక్రుడు: ఔషధాలను సృష్టించే రసాయన శాస్త్రవేత్త.

నాన్-టెక్నికల్ సంకేతాలలో చంద్రుడు శుభ మైన ప్రభావాలలో ఉన్నాడు: మానవీయ శాస్త్రాలు, సంగీతం మరియు లలిత కళలు.

అంగారకుడు

శని మరియు బృహస్పతితో కుజుడు: చట్టం యొక్క అధ్యయనం.

కఠినమైన హానికరమైన ప్రభావాలలో మార్స్: ఇంజనీరింగ్.

అంగారక-బుధ కలయిక: మంచి రెజ్లర్ లేదా ఎంటర్టైనర్.

బుధుడు

మెర్క్యురీ శుభ మైన ప్రభావంలో టెక్నికల్త లేని సంకేతాలలో: ఫైన్ ఆర్ట్స్, రైటింగ్, జర్నలిజం.

సూర్యుడు మరియు అంగారక గ్రహాలచే ప్రభావితం చేయబడిన బుధుడు: గణితశాస్త్రంలో విద్య.

కేతువు, కుజుడు మరియు/లేదా సూర్యుడితో టెక్నికల్ సంకేతాలలో బుధుడు: ఇంజనీరింగ్ సబ్జెక్టులు.

బృహస్పతి

బృహస్పతి శుభ మైన ప్రభావాలలో: సంపూర్ణ అధ్యయనాలు, యోగా, వేదాంత.

కుజుడు మరియు శనితో బృహస్పతి: చట్టంలో విద్య.

నీటి సంకేతాలలో హానికరమైన ప్రభావాలతో బృహస్పతి: బయో-టెక్నాలజీ, నిర్వహణ.

శుక్రుడు

బాహ్య ప్రభావాలు లేని బలమైన శుక్రుడు: లలిత కళల పరిజ్ఞానం.

చంద్రుడు, బుధుడు మరియు బృహస్పతితో వీనస్: హ్యుమానిటీస్ మరియు ఫైన్ ఆర్ట్స్.

టెక్నికల్ సంకేతాలలో శని ప్రభావంలో శుక్రుడు: భౌగోళిక అధ్యయనం.

బృహస్పతి ప్రభావంలో శుక్రుడు: హోటల్ నిర్వహణ.

శని

శుభ మైన ప్రభావాలలో బలమైన శని: చరిత్ర మరియు చట్టం యొక్క అధ్యయనం.

టెక్నికల్ సంకేతాలలో అంగారకుడితో శని: మెకానికల్ ఇంజనీరింగ్.

నీటి రాశిలో చంద్రునితో శని: రసాయన ఇంజనీరింగ్ వైపు మొగ్గు.

రాహువు మరియు కేతువు

కారకాంశ లేదా 2వ ఇంట్లో బలమైన రాహువు: యుద్ధ నైపుణ్యాలలో నైపుణ్యం, విషపూరిత మందులతో వ్యవహరించడం.

కారకాంశలో సూర్యునితో రాహువు: ఔషధాల అధ్యయనం.

ఆధునిక పరిశోధనలో రాహు మరియు కేతువులు: విదేశీ వాణిజ్యం, ఏరోనాటిక్స్, విమానయాన సంస్థలు మరియు విదేశీ భాషలను సూచించండి.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

తాంత్రీకుల_ఇష్ట_దేవత_తారా_రసహ్యం:-

తంత్ర సాధకులు, ముఖ్యంగా శాక్త సంప్రదాయానికి చెందిన తాంత్రీకులు దశమహవిద్యల సాధనలను పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఈ దశమహవిద్యలను పరిపూర్ణం చేసిన తర్వాత మాత్రమే, అతను మార్గంలో ముందుకు సాగి, పరిపూర్ణతతో పరమాత్మ ఆనందాన్ని పొందగలడు.

తంత్ర సాధనలోని ఈ దశమహవిద్యలలో 'తారా మహావిద్య ' కు తనదైన ప్రత్యేక స్థానం ఉంది. అందుకే తారా మహావిద్య సాధనను తాంత్రీకులకు ఉత్తమమైనది మరి అద్భుతమైనది ప్రభావవంతమైనది గుర్తించబడింది. ఈ మహవిద్య పూర్తిగా సిద్దించిన వెంటనే ఆ సాధకుడు మహా తాంత్రీకుల వరుసలో చేరుతారు. అప్పుడు ఆ సాధకుడికి ఏది అగమ్యగోచరంగా అర్థంకానిదిగా ఉండదు. ప్రకృతి అతని ఊహా మరి కోరిక ద్వారా మాత్రమే పనిచెయడం ప్రారంభిస్తుంది. 

అయితే, తారా మహావిద్యను పూర్తిగా తనలో ఇముడ్చుకోగలగడం అనూహ్యంగా తాంత్రీకుని వంశానికి సంబంధించిన విషయం. అందుకే చాలా కొద్ది మంది సాధకులు తంత్ర క్రియ సహాయంతో తారా మహావిద్యను పూర్తిగా చేయగలిగారు. రాముని కుటుంబ గురువు అయిన వశిష్ట ఈ మహవిద్యను మొదటి తంత్ర సాధకుడిగా పరిగణించబడ్డాడు. లంకాదిపతి రావణ బ్రహ్మ కూడా ఈ తారా మహావిద్య ధ్యానం చేశాడు. ప్రస్తుత కాలంలో, బెంగాల్ కు చెందిన ప్రసిద్ధ తంత్ర సాధకుడు వామక్షేప, కామాఖ్య కు చెందిన మహ తాంత్రీక్ రమణికాంత్ దేవశర్మ, నేపల్ కు చెందిన ప్రసిద్ధ తాంత్రీక్ పరమహంస దేవ మొదలైన వారు తారా మహావిద్య యొక్క దివ్య అనుభవాలను పొందగలిగారు. బెంగాల్ తాంత్రిక వామక్షేప కి సంబంధించి అటువంటి పురాణాలు ప్రబలంగా ఉన్నాయి. అతను వారాలు మరియు కొన్ని సార్లు నెలలు కూడా తనను తాను గుర్తుంచుకోలేనంతగా తల్లి తారా పూజలో మునిగిపోయాడు. దహన సంస్కారాలలో నివసించే ఈ తాంత్రీకుని దయనీయ స్థితిని ఆ తల్లి తట్టుకోలేనప్పుడు, ఆమె స్వయంగా వచ్చి తన ప్రియ భక్తునికి పాలు ఇచ్చేది. తాంత్రీక్ దేవశర్మ కి సంబంధించి అనేక అద్భుతమైన విషయాలు కూడా ప్రబలంగా ఉన్నాయి. 

శాక్త తాంత్రిక ఈ దశమహవిద్యల సాధనల పట్ల గాఢమైన ఆసక్తి ఉన్న, ఈ దశమహవిద్యలను తమలో ఇముడ్చుకోవాలనుకునే సాధకులు, ఈ మహావిద్యలను సిద్దింపజేసుకోవాలనుకునే సాధకులు, ఈనాటి తంత్ర గురువులు చూపే పగటి కలలు అని చెప్పుకునే వారందరూ ఒక విషయం సరిగా అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సాధనకు సంబంధించి ఈ దశమహవిద్యలు వాస్తవికతకు దూరంగా ఉన్నాయి. నిజానికి, 

ముండమాల తంత్రం,చాముండ తంత్రం, శాక్త ప్రమోద తారా తంత్రం వంటి అనేక ప్రామాణిక గ్రంథాల్లో తంత్ర సాధకులచేత వ్రాయబడినాయి, వాటిలో తారా కి దశమహవిద్యల రూపంలో రెండవ స్థానంలో కూడా ఇవ్వబడింది. తారా విశ్వం యొక్క సృష్టి మరియు పోషణ యొక్క పనిని చూసుకుంటుంది. అందుకే ఈ మహవిద్య ఎప్పుడూ సృజనాత్మక శక్తితో నిండి ఉంటుంది. తంత్ర సాహిత్యం లో, తారా యొక్క పూజలు, ఆచారం, తాంత్రిక పద్దతులు చాలా విషయాలు వివరంగా హైలెట్ చేయబడ్డాయి. తారా దేవి యొక్క అటువంటి పద్దతులను ఆచరించడం ద్వారా, అనేక రకాల బాధలు ఈతిబాధల నుంచి సులభంగా విముక్తి పొంది వివిధ రకాల భౌతిక ఆనందాలను, ఆధ్యాత్మిక చైతన్యాన్ని సులభంగా పొందుతారు. అంతే కాకుండా, ఈ మహవిద్య ద్వారా, సులభంగా భగవంతుని దర్శనం పొందడం ద్వారా ముక్తి ప్రయోజనం కూడా సులభంగా సాధించవచ్చు. 

తారా దేవి రూపానికి మహ కాళీకి చాలా పోలికలు ఉన్నాయ.ఈ కాళీ వంద నలుపు రంగులో లేకపోయినా ముదురు నీలం రంగు లో ఉంది. అందుకే వారిని ' నీల సరస్వతి ' అనీ కూడా అంటారు. తల్లి తారా యొక్క ఈ నీలం రంగు శాశ్వతమైన, అపరిమితమైన పరిమితులు మరి సామర్థ్యాలను సూచిస్తుంది. కాబట్టి రెండవ మహావిద్య రూపంలో తల్లి తారా అనంతమైన అవకాశాలకు ప్రతీక. తారా యొక్క తంత్ర సాధన ఆమె తాంత్రిక ఆచారాల గురించి లోతుగా అధ్యయనం చేసే ముందు, మనం 'తంత్రం' మరియు ''తంత్రం యొక్క పరిమితులు ' గురించి కూడా కొంత తెలుసుకుంటే మరింత సముచితం గా ఉంటుంది, ఎందుకు అంటే ఇది తంత్ర యొక్క అసలు రూపాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా దశమహవిద్యలు, తాంత్రీకుల వాటి పద్దతి. గురువు అనుగ్రహం కరుణ యొక్క ప్రసాదంగా పొందిన ఫలాలను అర్థం చేసుకోవడం తేలికగా అవుతుంది

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

బొట్టు పెట్టుకోవడం వలన ఫలితాలు

భూవోఘ్రాణ స్వయస్సంధిః 

అంటే నాసిక పై భాగం భ్రుకుటి మధ్యభాగం కలుసుకొనే చోట పెట్టుకోవాలి అని అర్థం. 

ఇక్కడ ఇడ,పింగళ ,సుషుమ్న లేక గంగ ,యమున ,సరస్వతి లేక 

సూర్య ,చంద్ర ,బ్రహ్మ అని పిలువబడే 

మూడు ప్రధాననాడులు కలుస్తయ్ .

దీనినే "త్రివేణి సంగమం "అని అంటారు. 

ఇది పీయూష గ్రంధికి అనగా ఆజ్ఞాచక్రానికి అనుబంధస్ధానం .

ఇదే జ్ఞానగ్రంధి అనికూడా పిలువబడుతుంది. 

ఎవరైతే సుషుమ్న నాడికి చురుకుదనం కల్గిస్తారో 

వారు మేధావులౌతారు.

మనం ధరించే బొట్టు ప్రభావం పిట్యుటరీ గ్రంధుల పై ఉంటుంది. 

" కేనన్ " అనే పాశ్చాత్య శాస్ర్తవేత     

భ్రుకుటి స్థానాన్ని మానవ  ధన    

మెడ వెనుక భాగాన్ని ఋణ    

విద్యుత్ కేంద్రాలు అన్నారు .

ఇవి రెండు శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరణ చేస్తుంటయ్.

అందుకే జ్వరం వస్తే వైద్యులు నుదుటి పై చల్లటి గుడ్డ వేయమంటారు.

ఇంకా సూర్యుని నుండీ వచ్చే విశేషమైన శుభ ఫలితాలను ఇచ్చే కిరణాలను ఆకర్షించే శక్తి కేవలం..

ఎర్రటి కుంకుమకే ఉంది. 

అందువలన మనం ఎల్లప్పుడూ ఉత్సాహంగా, 

మన మెదడు ఉత్తేజితమౌతూ ఉంటుంది. 

అందుకే ఒకనాడు వేదఘోష ప్రతిధ్వనించింది. 

ధారణశక్తీ పెరుగుతుంది. 

బొట్టుతో బోలెడన్ని ప్రయోజనాలు..

పైన పేర్కొన్న కీలక సున్నిత నాడులను తీక్షణమైన సూర్యకిరణాల నుండి కాపాడేందుకు కుంకుమ ధరించాలి. సాయంత్రం రాత్రి  సమయాల్లో కుంకుమకు బదులుగా విభూతిని ధరిస్తే చల్లగా ఉంటుంది. 

విభూతి వల్ల రక్తప్రసరణ చాలా బాగా జరుగుతుంది. 

శరీర ఉష్ణోగ్రతలు నియంత్రించబడుతుంది. 

ఓజస్సు వృద్ధి చెంది ,చర్మరోగాలు రాకుండా 

రక్షణ కలుగుతుంది.

బొట్టు శరీరంలో ఉష్ణాన్ని పీల్చీవేస్తుంది.

జఠరశ్వాసకోశాలకు తగినంత ఉష్ణాన్ని అందిస్తుంది. మనం సూర్యుని నేరుగా చూడలేము .

అదే "రంగుల "  కళ్ళద్ధాలు లేదా ఒకవైపు రంగు ఉన్న గాజుద్వారా సూర్యుని చూడగలం .

ఎందుకంటే సూర్యుని కిరణాలు అద్దంపైబడి పరావర్తనం చెందటం  వల్లకళ్ళకు హానికలుగలదు.

అంటే ఇక్కడ సూర్య కిరణాల వల్ల కళ్ళకు హాని కలుగకుండారంగు ఏవిధంగా పని చేస్తుందో , 

ఆవిధంగానే బొట్టు కూడా  భ్రుకటిస్థానంలోని జ్ఞాననాడికి హానికలుగకుండా మానవులను కాపాడుతూ వుంటుంది.

దృష్టి దోషం తగలకుండా బొట్టు..

మనుషుల్లో కొందరు క్రూర స్వభావం కలిగి ఉంటారు. వారు ఎల్లవేళలా ఇతరుల పైన అసూయా ద్వేషాలతో రగిలిపోతూ ఇతరుల వినాశనాన్ని కోరుకుంటూవుంటారు. 

వారి మనసులోని చెడుఆలోచనల ప్రభావమంతా 

వారి చూపుల ద్వారా ఇతరుల పైన ప్రసరిస్తూ ఉంటుంది.

మానవశరీరంలో అన్నిభాగాలకన్నా ముఖభాగమే అత్యంత ప్రధానమైనది.

ఎవరు ఎవరితో మాట్లాడాలన్నా ముఖం చూసే మాట్లాడగలుగుతారు.

అందువల్ల పైన తెలిపిన క్రూరస్వభావం కలిగిన వారు ఇతరులతో మాట్లాడేటప్పుడు వారి ముఖం చూసి 

"అబ్బా వీరి ముఖం ఎంతందంగా ఉంది " అని పలుమార్లు మనసులో అసూయపడతారు. 

అలా వారి అసూయ చూపుల ద్వారా  ఎదుటివారిలోకి ప్రసరించి క్షణాల్లోవారికి తలనొప్పి కలగడం  ఎంతోసేపటికిగాని అది తగ్గకపోవడం నిత్యజీవితంలో మనమందరం గమనిస్తూనే వుంటాం .

అందుకే ఈ మానవస్వభావాల పైన పరిశోధనలు చేసిన ఆయుర్వేద మహర్షులు ఇతరుల దృష్టి దోషం మరొకరికి అనారోగ్యం కలిగించకుండా నివారించడం కోసం కూడా ప్రతి మనిషి విధిగా బొట్టుపెట్టుకోవాలి అనే సదాచారాన్ని అలవాటు చేశారు.

బొట్టుపెట్టుకుంటే దృష్టి దోషం ఎలా నివారించబడుతుంది అని మీకు సందేహం కలగవచ్చు . 

బొట్టు ఎర్రగా నిండుగా కళకళలాడుతూ ప్రకాశిస్తూ వుండటం వల్ల ఇతరులు ముఖంలోకి చూడగానే వారిదృష్టిని ముందుగా ఈ బొట్టే ఆకర్షిస్తుంది. 

వారెంత ప్రయత్నించినా ముఖంలోని అందమైన ఇతరభాగాల వైపు చూడలేరు . 

ఈ విధంగా దృష్టి దోషం అనే సమస్య నుండి తప్పించుకోవడానికి మంచి ఆరోగ్యాన్ని పొందడానికే 

ఈ బొట్టు అనే విధానాన్ని ప్రవేశపెట్టారని మనం తెలుసుకోవాలి.

స్టికర్ బొట్లతో చర్మరోగాలు..

నేటి స్ర్తీలు గతంలో ఎవరికివారు స్వయంగా తయారుచేసుకునే కుంకుమను బొట్టుగా ధరించకుండా ,

విషరసాయనపదార్థాలతో తయారుచేసిన  స్టికర్లను బొట్టుగా వాడటంవలన భ్రుకుటి వద్ద చర్మరోగాలు వస్తున్నాయి. 

దీనివల్ల కొందరు స్ర్తీలు బొట్టు పెట్టుకోలేకపోతున్నారు.

కొందరు బొట్టు ధరించనివారు కూడా మేధావులయ్యారు కాదా అని అనవచ్చు. నిజమే , 

అయితే ఆ మేధావులు బొట్టు ధరించి ఉంటే మరింత మేధాసంపున్నులు అయ్యే వారని మరిచిపోవద్దు.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

జాతకంలో ఎనిమిదవ ఇంట్లో కూర్చున్న వివిధ గ్రహాల కోసం జాగ్రత్తలు:

1) సూర్యుడు - త్రీవమైన అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ఇంటికి లేదా ఆసుపత్రికి వెళ్లవద్దు.

2) గురువు - పీపల్ చెట్టుకు (రావి) హాని చేయవద్దు.

3) చంద్రుడు - ఇంట్లో విదేశీ కరెన్సీని ఉంచవద్దు.

4) శుక్రుడు- ఎవరి కి ఉద్యోగాన్ని సిఫారసు చేయవద్దు.

5) అంగారక గ్రహం- ఇంట్లో నిప్పుల పోయి ఏర్పాటు చేయవద్దు. తందూరి రొట్టే

తినకూడదు

6) బుధుడు - ఇంట్లో బైనాక్యులర్స్ పెట్టుకోవద్దు.

7) శని- స్నానం చేసేటప్పుడు నేలపై తడిగా పాదాలు ఉంచవద్దు. చెప్పులు వేసుకోవాలి 

8) రాహువు - ఏ వితంతువుతోనూ గొడవ పడకండి.

9) కేతువు - విధిని శపించడం పూర్తిగా నిషేధించబడింది

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

Tuesday, 30 January 2024

వాస్తు ఐశ్వర్య కాళీ పాదం

వాస్తు ఐశ్వర్య కాళీ పాద యంత్రాలకు సంప్రదించండి : 9666602371

వాస్తు ఐశ్వర్య కాళీ యంత్ర పోస్టర్ ను ఇళ్ళు లేదా షాపు లేదా ఆఫీసు ప్రదాన ద్వారానికి లోపలి వైపు పైభాగాన ఉంచి 

"ఓం ఇం క్లీం ఐశ్వర్య కాళేయ నమః" 

అనే మంత్రాన్ని నిత్యం పఠించటం వల్ల వాస్తు దోషాలు పోయి ధనాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి, విద్యలో రాణింపు, మంచి ఉద్యోగం లభించటమే కాకుండా వాస్తు ఐశ్వర్య కాళీ పాదం ఉన్నచోట నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది.

కాళికా దేవి తన బంగారు పాదాలతో మన ఇళ్ళు, షాపు, ఆపీసులలోకి అడుగు పెట్టటం వల్ల ధనాభివృధ్ధి, వ్యాపారాభివృధ్ధి, గౌరవాలు, మంచి కమ్యూనికేషన్ ఉంటాయి. ముఖ్యంగా జాతకచక్రం లో శని దోషాలు కలవారు తప్పని సరిగా ఇంటిలో ఉంచుకోవాలి. కుటుంబంలో అందరి మధ్య సఖ్యత ఉంటుంది. నరదిష్టి ప్రభావాలు తొలిగి పోతాయి.

అమ్మవారిని ఎర్రతామరలతో విశేషించి ఎర్రకలువలతో (కాళీ సాధనలో కలువ పూలకు ప్రాధాన్యం) పూజిస్తే ఆమె ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తుంది. తామరగింజల మాలతో కాళీ మంత్ర జపం చేసి సిరిసంపదలను పొందవచ్చు.

కాళీదేవి ఐశ్వర్యానికి అధిదేవత. ఐశ్వర్యం అంటే కేవలం సిరిసంపదలు మాత్రమే కాదు. ఐశ్వర్యం అంటే అధికారం (రాజ్యాధికారం), వైభవం కూడా. ‘‘ఐశ్వర్య కాళి’’గా అమ్మవారిని ఆరాధిస్తే ఆమె వీటన్నింటినీ అనుగ్రహిస్తుంది. అలా అమ్మవారిని అర్చించి, ఆమె కోసం తపస్సు చేసి విక్రమార్కుడు, భట్టి, నరకాసురుడు, తెనాలి రామకృష్ణ మొదలైనవారు ఐశ్వర్యాన్ని పొందారు. ఉజ్జయినీ మహా కాళి శక్తిస్వరూపిణి. ఆమె ఐశ్వర్యకాళిగా భట్టి విక్రమార్కులను అనుగ్రహించింది. విక్రమార్కుని జీవితకథలో అమ్మవారి అనుగ్రహానికి సంబంధించిన ఘట్టం కనిపిస్తుంది

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

రామ్‌లల్లా శిలను వెలికితీసిన వ్యక్తికి జరిమానా

కర్ణాటక - రామ్‌లల్లా విగ్రహాన్ని రూపొందించేందుకు వందల కోట్ల ఏండ్ల నాటి కృష్ణ శిలను(నల్ల రాయి) గుర్తించినందుకు శ్రీనివాస్‌ నటరాజ్‌కు జరిమానా విధించిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ మైనింగ్‌, భూగర్భ శాఖ.

ఒక ప్రైవేట్‌ స్థలంలో అక్రమంగా మైనింగ్‌ చేశారని ఆరోపిస్తూ శ్రీనివాస్‌ నటరాజ్‌పై 80 వేల జరిమానా.. తన భార్య బంగారం నగలను తాకట్టు పెట్టి కట్టానని బాధితుడి ఆవేదన.

హిందూవుల పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి గిట్లనే ఉంటుంది 

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

కలియుగమునందు మానవులకు పరమాయువు 50 సంవత్సరములు కాగలదు.

భగవతము 12 వ స్కంధము 2 వ శఅధ్యాయం 11 వ శ్లోకం

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

ఇదిగిదిగో.. భక్త రామదాసు!?

🔹నేలకొండపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఎప్పట్నుంచో రావిచెట్టు నీడన విగ్రహం

🍥నేలకొండపల్లి, జనవరి 26: రామనామం మాదిరిగానే కంచర్ల గోపన్న కీర్తనలూ 'ఎంతో రుచి'!

❇️మరి.. ఆ రాములోరికి గొప్ప ఆలయాన్ని నిర్మించి, భక్త రామదాసుగా వినుతికెక్కిన ఆయన ఎలా ఉంటారు? శ్రీరామదాసు సినిమాలో చూపించినట్లుగానే ఉండేవారా? అంటే..

🌀ఇదిగో ఈ విగ్రహం మాదిరిగనే ఉండేవారని చరిత్రకారులు చెబుతున్నారు. 16వ శతాబ్దకాలం నాటి ఈ విగ్రహం ఆయనదేనని స్పష్టం చేస్తున్నారు!! చెవులకు కుండలాలు, ముకుళిత హస్తాలతో ఉన్న ఈ విగ్రహం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి పోలీ్‌సస్టేషన్‌లోని ఓ రావిచెట్టు కింద ఎప్పట్నుంచో ఉంది. ఇన్నాళ్లూ ఎవ్వరూ పట్టించుకోని ఆ విగ్రహాన్ని ఇటీవల ఓ వ్యక్తి ఉత్సుకత కొద్దీ ఫొటోతీసి 'కొత్త తెలంగాణా చరిత్ర' బృంద సభ్యులైన రామోజుహరగోపాల్‌, కట్టా శ్రీనివా్‌సకు పంపాడు

✡️వారొచ్చి పరిశీలించి విగ్రహం భక్త రామదాసుదేనని చెబుతున్నారు. చక్కని మీసకట్టు, అప్పుడే స్నానం చేసినట్టు తల వెనుక జారుముడి వేసుకున్న గోష్పాద శిఖ, అంజలి ముద్ర, నడుము పక్కన కత్తి, కుడి.. ఎడమ భుజాల మీద శంఖు చక్ర ముద్రలతో కూడిన విగ్రహం వైష్ణవ భక్తుడిదని పేర్కొన్నారు. శిల్పం రాజోచిత ఆహార్యంతో లేనందున అక్కన్నదో లేదంటే మాదన్నదో అనుకునే అవకాశమే లేదన్నారు

💥వారి మేనల్లుడు, భద్రాచల రామాలయ నిర్మాత, నేలకొండపల్లి వాసి అయిన కంచర్ల గోపన్నది అవడానికే ఎక్కువ అవకాశాలున్నాయని చెప్పారు. ఈ పురాతన విగ్రహాన్ని శుక్రవారం రామదాసు ధ్యాన మందిరానికి తరలించారు. రామదాసు పదోతరం వారసుడైన కంచర్ల శ్రీనివాసరావు సమక్షంలో ఆ విగ్రహాన్ని ధ్యాన మందిరంలో ఉంచి క్షీరాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
ACCANKSHA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph: 9666602371

రామాయణమ్.2

ఎవరు గుణవంతుడు? 

ఎవరు గొప్పపరాక్రమము కలిగినవాడు?

ఎవరు ధర్మము తెలిసినవాడు?

ఎవరు కృతజ్ఞుడు?

ఎవరు సత్యమైన వాక్కులు మాత్రమే కలవాడు?

ఎవరి సంకల్పము అత్యంత దృఢమైనది?

ఎవరు మంచి నడవడి కలవాడు?

ఎవరు అన్ని ప్రాణులకు హితము గూర్చే వాడు?

ఎవరు విద్వాంసుడు?

ఎవరు ఎంతటి కార్యాన్నయినా సాధించేవాడు?

ఎవరు చూసే వారికి ఎల్లప్పుడు సంతోషము కలిగించేవాడు?

ఎవరు ధైర్యము గలవాడు?

ఎవరు కోపము జయించిన వాడు?

ఎవరు కోపించినప్పుడు దేవతలు సైతం గజగజ వణకుతారు?

ఎవరు అసూయలేనివాడు?

ఎవరు కాంతి కలవాడు?

ఇన్ని లక్షణాలు ఒకే మనిషిలో ఉండి ! ఆ మనిషి భూమిమీద ఎప్పుడయినా నడయాడినాడా?

అసలు అలాంటివాడు ఒకడుండటం సాధ్యమయ్యేపనేనా? అలాంటి వాడినెవరినయినా బ్రహ్మగారు సృష్టించారా? 

ఇన్ని ప్రశ్నలు ఒక్కసారిగా మహర్షిమనసులో ఉదయించాయి!

.ఆ ప్రశ్నలకు తనకు సమాధానం కావాలి!

సమాధానం ఇవ్వగల సమర్ధుడెవ్వరు?

ఆలోచించారు మహర్షి వాల్మీకి! ఆయన మనోఫలకం మీద అప్పుడు త్రిలోకసంచారి నారద మహర్షి కనపడ్డారు! అవును ఈయన అయితేనే నా ప్రశ్నలకు సమాధానమీయగలడు!

అన్నిలోకాలు తిరుగుతూ ఉంటారుకదా! నారదులవారు!

నా మనస్సు లో ఉన్నవ్యక్తి ఆయనకు ఎప్పుడయినా, ఎక్కడయినా తారసపడి ఉండవచ్చు!

.మహర్షి వాల్మీకి నారదుల వారిని ధ్యానించారు!

.నారద మహర్షి ప్రత్యక్షమయినారు ,ఆయనను వాల్మీకి ముని ఇలా అడుగుతున్నారు!

.తపఃస్వాధ్యాయనిరతం తపస్వీ వాగ్విదాం వరమ్

నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంఙ్గవమ్

.మహాతపఃశాలి ,నిరంతర వేదాధ్యయనమునందు అసక్తి కలవాడు ,వాక్కును తెలిసిన వారిలో శ్రేష్ఠుడు,మునులలో గొప్పవాడయిన  వాల్మీకి మహర్షి  ,నారదుని ప్రశ్నించెను!

.ముని ప్రశ్నకు నారదులవారు ఈవిధంగా సమాధానం చెపుతున్నారు!

తపః ...అనగా జ్ఞానము ! దేనిని గురించి జ్ఞానము ? బ్రహ్మము ను గురించిన జ్ఞానము ! బ్రహ్మము అంటే ఈ చరాచర సృష్టికి ఏది కారణమో అది! అన్నింటిలోనూ వ్యాపించి ఉన్నది అని అర్ధము!

.స్వాధ్యాయము.... అనగా వేదాధ్యయనం,  

 ఆ వేదాధ్యయనం ఎలా చేస్తున్నారు! మహర్షి ?  

పూర్తి అర్ధ జ్ఞానం కలిగేవరకు చదువుతూ ఉండటమే ! 

అంటే PHILOSOPHY OF SUBJECT తెలిసేవరకు అన్నమాట!

.( మన చదువులు పరీక్ష పాస్ అయ్యి డిగ్రీలు చేతికి వచ్చేవరకే ! ఆ తరువాత Subject మరచిపోతాం! 

కేవలం Visiting cards లో మన పేరు ప్రక్కన వేయించుకునేందుకు తప్ప, మన డిగ్రీలుఎందుకూ పనికి రాని విధంగా మనలను మనం తీర్చిదిద్దుకుంటున్నాం).

.వాగ్విదాంవర ..వాక్కు అనగా శబ్దము 

 అసలు శబ్దము ఎలా పుట్టింది? దాని లక్షణమేమిటి? వాక్కును ఎలా ప్రయోగించాలి? అన్నీ తెలవాలంటే  ,ఒక వ్యక్తి శిక్ష,వ్యాకరణము,ఛందస్సు,నిరుక్తము,జ్యోతిషము,కల్పము అనే వేదాంగాలు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి !

..(మనం చేసే లొడ లొడ శబ్దం కాదు ,మనం వాక్కు యొక్క స్వరూపమేమిటో తెలియకుండా నోటికి వచ్చింది అడ్డంగా మాట్లాడతాం).

.అలా అధ్యయనం చేసిన వారిలో శ్రేష్ఠుడు! వాల్మీకి మునిపుంగవుడు! 

అంతటి గొప్పవ్యక్తికి కలిగిన సందేహమది!

.సర్వేజనా సుఖినో భవంతు