మార్గశిర మాసంలో వచ్చే గురువారం/లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మివార వ్రతము లేదా మార్గశిర గురువార వ్రతం అంటారు.
సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసం నాడు ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్టము. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు.
మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించుటవల్ల రుణ సమస్యలు తొలగి, శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం.
మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇళ్ళు శుభ్రం చేసి, తలస్నానం చేయవలెను. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు, తలకు నూనే రాసుకొనుట, దువ్వుకోనుట చేయరాదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహంను పూజకు సిద్ధం చేసుకోవలెను.
గణపతి పూజ అనంతరం, లక్ష్మీ అమ్మవారికి అధాంగ, షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి. నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి.
ఈ వ్రతంలో
1వ గురువారం నాడు పులగం..
2 వ గురువారం నాడు అట్లు, తిమ్మనం..
3 వ గురువారం నాడు అప్పాలు, పరమాన్నము..
4 వ గురువారం నాడు చిత్రాన్నం, గారెలు..
5 వ గురువారం నాడు పూర్ణం బూరెలు నైవేద్యంగా సమర్పించాలి.
మార్గశిర లక్ష్మీ పూజ, కథ చదువుకొని అక్షతలను శిరస్సున ధరించాలి. ఇలా నియమనిష్టలతో వ్రతాన్ని ఆచరించినవారికి ఆయురారోగ్య ఐశ్వర్యములతో పాటు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణవచనం.

No comments:
Post a Comment