Wednesday, 13 December 2023

మార్గశిర మాసారంభం :

 


చంద్రుడు మృగశిర నక్షత్రానికి సమీపంలో చరించే మాసం మార్గశిరం. శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన ప్రకారం ఇది పరమాత్మ మాసం కాబట్టి ఈ నెలంతా శ్రీ మహావిష్ణువును పూజిస్తే అనంతమైన పుణ్యఫలం కలుగుతుందని శాస్త్ర ప్రవచనం.

ఈ మాసంలో ప్రతీక్షణం ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని పఠిస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మార్గశిరం లక్ష్మీదేవికి ఇష్టమేనని భక్తుల విశ్వాసం.

అందుకే రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గురువారం నాడు ‘మార్గశిర లక్ష్మీవార వ్రతం’ భక్తితో ఆచరిస్తారు.

వైష్ణవులకు అత్యంత పవిత్రమైన మాసం ఇది. ఈ నెలంతా తెలవారక ముందే తెలిమంచులోనే ఇళ్లముందు పేడకళ్లాపి చల్లి, రంగవల్లులు తీర్చి దిద్దుతూ గొబ్బెమ్మలు పెట్టే కన్నె పిల్లలతో వీధులన్నీ కళకళ లాడిపోతుంటాయి. మార్గశిర మాసానికున్న మరో ప్రత్యేకత.

మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు గంగాసాన్నం చేస్తే కోటి సూర్యగ్రహణ స్నాన ఫలితం లభిస్తుందన్నారు. తదియనాడు

ఉమామహేశ్వర వ్రతం, అనంత తృతీయ వ్రతాలను ఆచరిస్తారు. చవితినాడు వరద చతుర్థి, నక్త చతుర్థి పేరుతో వినాయకుడిని పూజిస్తారు.

పంచమినాడు చేసే నాగపంచమి వ్రతం, మర్నాడు సుబ్రహ్మణ్య షష్ఠి గురించి అందరికీ తెలిసిందే.

శుద్ధ సప్తమి నాడు సూర్యారాధన పేరుతో ఆ ప్రత్యక్ష నారాయణుడిని పూజిస్తారు.

మార్గశిర శుద్ధ అష్టమిని ‘కాలభైవాష్టమి’ గా వ్యవహరిస్తారు.

ఏకాదశి తిథిలన్నింటిలోకీ మార్గశిర శుద్ధ ఏకాదశిని అత్యంత పవిత్రంగా భావిస్తారు భక్తులు.

ఒకవేళ అప్పటికి ధనుర్మాసం కూడా వచ్చి ఉంటే అదే ముక్కోటి (వైకుంఠ ఏకాదశి) అవుతుంది.


సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment