Wednesday, 13 December 2023

రాశి ఫలితాలు

 



డిసెంబరు 14,2023

బృహస్పతివాసరే (గురువారము

మేషరాశి

మేషరాశి వారికి ఈ రోజు మీకు గత ఆర్థిక పరిస్థితి కంటే అనుకూలంగా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విలువైన వస్తువులు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లు అనుకున్న పనులు దక్కించుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు పదవులు లభిస్తాయి. శివపార్వతుల అర్థనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం, దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థంగా ఉన్నది. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలతో ఒడిదుడుకులు తొలగుతాయి. ఎదుటివారిని మీ వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరం. కళారంగం వారికి శ్రమానంతరం ఫలితం ఉంటుంది. మానసిక అశాంతి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మిథున రాశి

మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు అనుకూలంగా ఉన్నాయి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నత పదవులు లభిస్తాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. బ్రాహ్మణులకు గానీ, ముత్తయిదువలకు గానీ తాంబూలం, శనగలను దానమివ్వడం మంచిది. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి నేటి దిన ఫలాలు మధ్యస్థం నుండి అనుకూలం. ఆప్తులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు దగ్గరకు వస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. గృహ, వాహన కొనుగోలు యోగం ఉంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు లభిస్తాయి. రాజకీ కీయవర్గాలకు పదవీయోగం. శ్రమ మరింత పెరుగుతుంది. శివపార్వతులు అర్థనారీశ్వరుని రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణామూర్తిని చూడడం మరియు దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

సింహరాశి

సింహరాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. గతం నుంచి వేధిస్తున్న ఒక సమస్య నుంచి గటెట్టక్కుతారు. ఆదాయం మెరుగ్గా ఉన్నా ఖర్చులు కూడా అధికం. ఇతరులకు చేయూతనందించి ప్రశంసలు పొందుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. పారిశ్రామిక రంగాలవారికి విదేశీ పర్యటనలు. వృథా ఖర్చులుండును. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం, దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

కన్యారాశి

కన్యారాశి వారికి ఈరోజు మీకు మధ్యస్థంగా ఉన్నది. పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం. ఇంటి నిర్మానాలు చేపట్టే వీలుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వ్యాపారంలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయ నాయకులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది. దూరప్రయాణాలు చేస్తారు. మానసిక ఆందోళన ఉంటుంది. శుభఫలితాలు పొందడం కోసం శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

తులా రాశి

తులారాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఒక సమాచారం నిరుద్యోగులకు సంతోషం కలిగిస్తుంది. వస్తులాభాలు, జీవితాశయం నెరవేరుతుంది. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాలవు. శివపార్వతుల అర్ధనారీశ్వర రూపానికి ప్రతీక అయినటువంటి దక్షిణమూర్తిని చూడడం, స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభఫలితాలు కలుగుతాయి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి నేటి రాశి ఫలాలు అంత అనుకూలంగా లేవు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విద్యార్థులకు కొంత అనుకూల పరిస్థితి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు. కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. శ్రమ కొంత పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

ధనూ రాశి

ధనూరాశి వారికి నేటి దిన ఫలాలు మధ్యస్థముగా ఉన్నవి. అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. నూతన వ్యక్తుల పరిచయం. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. గృహ నిర్మాణ యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. దుబారా ఖర్చులు ఉంటాయి. ఇంటా బయటా సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం బృహస్పతి అనుగ్రహం కోసం శనగలు దానమివ్వాలి. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికరంగాల వారికి విదేశీ పర్యటనలు. మీ సత్తా చాటుకుని మంచి గుర్తింపు పొందుతారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారి సహకరిస్తారు. జీవిత భాగస్వామితో వివాదాల సర్దుబాటు. దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించడం చేత సమస్యలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి.

కుంభ రాశి

కుంభరాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. సోదరులు, సోదరీమణులతో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు. బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. మనశ్శాంతి లోపిస్తుంది. ఈరోజు మరింత శుభఫలితాలు పొందడం కోసం దత్తాత్రేయుని పూజించాలి. శ్రీగురుచరిత్ర పఠించడం దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కొత్తగా రుణాలు కూడా చేయాల్సి వస్తుంది. కొన్ని వ్యవహారాలలో రాజీ తప్పదు. భూవివాదాలు, కోర్టు కేసులు కొంత చికాకు పరుస్తాయి. కాంట్రాక్టర్లకు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. రాజకీయ నాయకులకు పనిభారం పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. శనగలతో చేసిన ప్రసాదాన్ని నివేదన చేసి అది ప్రసాదంగా పంచిపెట్టాలి.

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment