పద్మపురాణంలో కార్తిక మాహాత్మ్యమున ”కార్తికే ద్విదలం త్యజేత్” అనగా రెండు పలుకులుగా వచ్చు పప్పులను వదిలివేయాలని చెప్పబడింది. కంది, మినప, పెసర, శనగపప్పులను అలాగే ఆవాలు, మెంతులు కార్తికమాస వ్రతమాచారించే వారికి నిషిద్ధం. ”ద్విదలం తిల తైలంచ తధాన్యం అతి దూషితమ్” అనగా పప్పు, నువ్వుల నూనె కార్తికమాసమున నిషేధం.
కార్తికే వర్జయేత్ తద్వత్ ద్విదలం బహుబీజకం
మాషా ముద్గ మ సూరాశ్చ చనకాశ్చ కుళుత్ధకా:
నిష్పావరాజ మాషాశ్చ ఆఢక్య: ద్విదలం స్మృతమ్
మినుములు, పెసలు, ఎర్రకందిపప్పు, శెనగలు, ఉలవలు, అలసందలు, రాజమాషములు, కందిపప్పు ద్విదలములైన వీటిని కార్తిమాసమున విడిచిపెట్టవలెనని శ్లోకార్థం.
కార్తికే వర్జయేత్ తైలం కార్తికే వర్జయేత్ మధు
కార్తికే వర్జయేత్ కాంస్యం కార్తికే శుక్ల సంధితం
కార్తికే స్త్రీ సంగమం దుష్ట భోజనం శయ్యాయామ్
శయనం దుష్టై: భాషణం పరిత్యజేత్
అనగా కార్తికమాస వ్రతమును ఆచరించువారు నూనె వాడుక, మద్యపానము, కంచుపాత్రలలో భోజన ము చేయరాదు. అంతేకాకుండా చద్దన్నం, ఉప్పు వేసిన కూర తినరాదు. దాంపత్యజీవనమునకు దూరంగా ఉంటూ, పరుపు, మంచము పైన నిద్రించక నేలపైనే ని ద్రించవలెను
No comments:
Post a Comment