Monday, 8 August 2016

దిక్కులకు అధిపతులు ఎవరు..? వారి బలాలేంటి?

దిక్కులకు అధిపతులు ఎవరు..? వారి బలాలేంటి?


దిక్కులు - దిక్పాలకులు
తూర్పు - ఇంద్రుడు
పడమర - వరుణుడు
దక్షిణం - యముడు
ఉత్తరం - కుబేరుడు
ఈశాన్యం - ఈశ్వరుడు
వాయవ్యం - వాయుదేవుడు
నైరుతి - నిరృతి (రాక్షసుడు)
ఆగ్నేయం - అగ్నిదేవుడు

ఆయా దిక్కులకు గల సహజ బలం ఎలా ఉంటుందంటే..?
ఉత్తరం : ఐశ్వర్య, భోగ భాగ్య కారకుడు. సకల సంపత్కరుడు. ధనాధిపతి. కుబేరుడు.
ఈశాన్యం: ఈశాన్య దిక్పతి. మృత్యుంజయుడు. సకల శుభకారకుడు. వంశోద్ధీపకుడు - శివుడు.
తూర్పు : క్షత్రియ సంభవుడు. దర్పం కీర్తి కారకుడు. రాజస గుణాధిక్యత కలవాడు. ఇంద్రుడు.
వాయవ్యం : అస్తిరత్వం ఎక్కువ. చంచలబుద్ధి. స్థాన భ్రష్ఠత్వం కలిగించే గుణం కలవాడు వాయుడు.
పశ్చిమం: పాశంతో బంధించి, పురుషులకు తక్కువ సామర్థ్యాన్ని ఇచ్చేవాడు. వరుణుడు.
ఆగ్నేయం : దురహంకారి. సర్వదగ్ధ సమర్థుడు. ధన లేమి కారకుడు రోగ కారకుడు కూడా అగ్నే.
దక్షిణం: మృత్యు కారకుడు. వినాశకుడు. దరిద్ర కారకుడు. సమపర్తి. ధనహీనుడు యముడు.
నైరుతి: నర వాహనుడు. రాక్షసుడు. పీడాకారకుడు. రక్తపాన మత్తుడు. హింసాకారకుడు నైర్పతి. పై ఎనిమిది దిక్కుల్లో తొలి మూడు దిక్పాలకులు శుభ కారకులు. అదే వరుస క్రమంలో ఒకరినిమించి మరొకరు (4 నుంచి 8) వరకు అశుభ కారకులు.

No comments:

Post a Comment