నాగపూజ, నాగశాంతి ఎలా చేయాలి..!?
"అపుత్రాః పుత్రశోకం చకూరుపః పుత్ర జాయతే"
ఆభర్తా పతిహీనం చ పతి సంగ వివర్జితాః
భర్తృత్యక్తా భవేద్రోగా జీవనం దుర్భరం భవేత్
సర్పదోషా భవేర్యస్తు కష్టశోక భయావహమ్"
నాగదోషం ఉన్న జాతకులకు అశాంతి కలిగంచే పరిస్థితులు ఏర్పడతాయి. సంతానం కలుగకపోవడంతో
పాటు ఆర్థిక సమస్యలు, వివాహంలో జాప్యం, అంగవిహీనులైన సంతతి జన్మించడం,
పుత్రశోకం, వైవాహిక జీవితంలో ఆటంకాలు నాగదోషము వల్లనే ఏర్పడుతాయని పురాణాలు
చెబుతున్నాయి.నాగదోష నివారణకు శుభతిథులను ఎంచుకుంటే ఇలాంటి దుష్ఫలితాలను నుంచి బయటపడవచ్చునని
జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. నాగులకు శుక్లచవితి, శుక్లపంచమి తిథులు,
శుక్రవారము, ఆదివారము విశిష్టమని వారు సూచిస్తున్నారు.అయితే
పౌర్ణమి, దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులు, కృష్ణపక్షము నాగపూజకు అనువైన
శుభదినాలు కావు. నాగ శాంతి, పూజలు వీలైనంతవరకు శుక్లపక్షములో చవితి, పంచమి
రోజుల్లో కానీ అంతకు పూర్వదినములలోగాని నిర్వర్తించడం ద్వారా ఆ గృహమున
అరిష్టములు తొలగి వంశవృద్ధి, ఆరోగ్యాభివృద్ధి, ప్రశాంతత కలుగుతుంది.
పడగను ఒక ప్లేట్ లో ఉంచి ఆవు పాల తో అభిశేకించి రాహు కేతు సుబ్రమణ్య అష్టోత్తరాలతో పూజించి తర్వాత ఆ పడగను
గుడిలో హుండి లో వేయడం లేదా బ్రామ్హణుడికి దానం ఇవ్వడం చెయ్యాలి.
రానున్న శ్రావణ పంచమి ఈ పూజకు అన్ని విధాల శ్రేయస్కరం.
No comments:
Post a Comment