ఒక వ్యక్తి జీవితములో ఎన్ని సమస్యలొచ్చినా వాటికి లొంగకుండా పోరాడే మానసిక బలము ఆత్మస్థైర్యమును ఇచ్చేవి కేవలము రెండు గ్రహములు..అవే సూర్య చంద్రులు..జాతకములో సూర్య చంద్రులకి బలమును పెంచడమంటే ఆత్మస్థైర్యాన్ని మానసిక బలాన్ని పెంచడము ఒక్కటేదారి...
మానసిక భయము వలన ఆత్మస్థైర్యము కోల్పోవడము వలననే చాలా మంది వారి జీవితములో ఎన్నోకోల్పోతున్నారు..
ఆ సూర్య చంద్రులకి బలాన్ని పెంచుకోవాలంటే ప్రతిరోజు కాలభైరవాష్టకమును మనస్సులో పఠించిన మంచిది..కేవలము కాలభైరవుడు ఒక్కడే మానసిక భయాందోళనలను నిర్మూలించగలిగేది...అతని యొక్క ఆరాని పొందాలంటే అతిచిన్న రెమెడీ ఒకటి ఉన్నది ..కాలభైరవుని మీద అనంత విశ్వాసముతో భక్తితో పాటించి చూడండి..మానసిక బలాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి..
సూర్యునికి .పరిహారముగా గోదుమలతో చేసిన చపాతీలను .
చంద్రునికి పరిహారముగా పాలను...
అంటే చపాతీలను ముక్కలుగా చేసి పాలతో కలిపి ప్రతి నెలలో వచ్చే అష్టమి రోజున వీధిలో ఉండే శునకములకు భక్తితో సమర్పించిన మంచి జరుగును..ఈ రెమెడీని ప్రతి యొక్కరు చేయవచ్చును..అద్భుతమైన మానసిక ఆత్మశక్తిని పొందుతారనడములో అతిశయోక్తి లేదు..

No comments:
Post a Comment