🙏డిసెంబర్ 12 కార్తీక అమావాస్య🙏
కార్తీక బహుళ అమావాస్యతో కార్తీకమాసంముగిసిపోతుంది కనుక, ఈ రోజున దైవారాధనలో మరింత సేపు గడపడానికి ప్రయత్నించాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలనమాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ రోజునతెల్లవారుజామునే కార్తీకస్నానం చేసి ఇంట్లో తులసికోట వద్ద దీపం వెలిగించాలి. తరువాత శివాలయానికి గానీ, విష్ణాలయానికి గానీ వెళ్ళి ఆవునేతితో రెండు దీపాలను ఆలయం వద్ద వెలిగించి స్వామి దర్శనం చేసుకోవాలి. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఆవునేతి దీపాలు వెలిగించి మహాలక్ష్మినిఆరాధించినట్లయితే లక్ష్మీకటాక్షం తప్పక కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.
కార్తీక అమావాస్య రోజున పితృకార్యాలను నిర్వహిస్తే శుభఫలితాలుచేకూరుతాయనిపండితులుచెబుతున్నారు. కార్తీకమాసంలో తులసితో శ్రీమహావిష్ణువును, బిల్వదళాలతో శివుడినీ, కుంకుమ పూజతో అమ్మవారిని సేవించడం వలన కలిగే ఫలితాలు విశేషమైనవని. అలాగే ఈ మాసంలో వచ్చే అమావాస్య రోజున పితృకార్యాలను నిర్వహించే వారికి వంశాభివృద్ధి చేకూరుతుందని శాస్త్ర వచనం.
ఈ రోజున పితృకార్యాలు నిర్వహించడం వలన వాళ్లు సంతోషించి సంతృప్తిని చెందుతారని పండితులు అంటున్నారు. పితృదేవతల ఆశీస్సులను కోరుకునేవాళ్లు ఈ రోజున పూజలు, తర్పణాలు ఇవ్వడం మంచిది.

No comments:
Post a Comment