Friday, 1 December 2023

నందీశ్వరావతారము – విశిష్టత




🙏మనం ఏ శివాలయానికి వెళ్ళినా, పరమేశ్వరుని కంటే,ముందుగానే మనం నందిని దర్శిస్తాము. పరమేశ్వరుడును నంది కొమ్ముల మధ్య నుండి దర్శిస్తూ, ఆ నందీశ్వరుని యొక్క వషభ భాగాలను నిమురుతూ ఉంటాము. అలా కొమ్ముల మధ్య నుండి దర్శించడంవల్ల, ఏకాగ్రత కలిగి, నిశ్చలమైన మనస్సుతో శివుడును దర్శించ గలుగుతాము. అలాచేయడం వల్ల కైలాస ప్రాప్తి సిద్దిస్తుందని శివపురాణంతెలియచేస్తోంది

ఆ విధంగా నందిని ఎందుకు దర్శించాలి శివానుగ్రచహం ఎలాకలిగిందిఅనేవిషయాలు తెలుసుకోవాలంటే, 

శిలాదుడనే మహర్షి, ధర్మాత్ముడు. తన పితరుల ఆదేశంతో, అయోనిజుడు, సువ్రతుడు, మృత్యువు లేని పుత్రుని కొరకు ఇంద్రుని గురించి గొప్ప తపస్సు చేసాడు. కొంత కాలానికి ఇంద్రుడు ప్రత్యక్షమై, శిలాదుడు కోరికతెలుసుకొని, అటువంటి పుత్రుని ప్రసాదించుటకు తాను అసమర్థుడునని, సర్వేశ్వరుడు, మహాశక్తి సంపన్నుడు శివుని ఆరాధించవలసింది”గా సూచించాడు. అప్పుడు శిలాదుడు పరమేశ్వరుని అను గ్రహం కొరకు, ఘోరమైన తపస్సు చేయగా, శివుడు ప్రత్యక్షమై, మహా సమాధి లోనున్నశిలాదుడను తట్టి లేపి, మేల్కొల్ప గానే, శిలాదుడు శివుని దర్శించి, సాష్టాంగ ప్రణా మము చేసి, స్థుతించాడు. అప్పుడు శివుడు ”తపస్వీ! శిలానందా! నీ తపస్సుకు సంతోషిం చాను. ఏ వరం కావాలో కోరుకో” అనగానే, ”ప్రభూ! పరమేశ్వరా! మీ వంటి అయో నిజుడు, మత్యువు లేని పుత్రుని పొందాలని. ప్రసాదించమని కోరుతు న్నాను.” అన్నాడు.

శిలాదుడు కోరిక విన్న పరమేశ్వరుడు సంతోషించి- ”శిలానందా! పూర్వం బ్రహ్మ, మహర్షులు, గొప్పగొప్ప దేవతలు, తపస్సు ద్వారా, నేనుఅవతారాన్నిధరించాలని ఆరా ధించారు. కనుక మునీంద్రా! నేను ఈ సకల జగత్తుకు జనకుడను. అట్టి నాకు, నీవు తండ్రివగుదువు. నేను నీకు అయోనిజుడునగు పుత్రునగుదును. అప్పుడు నన్ను నందీశ్వ రుడు అని పిలవబడతాను.” అని శివుడు వరమిచ్చి, అదృశ్యమయ్యాడు.

తర్వాత మహర్షి శిలాదుడు తన ఆశ్రమా నికి వెళ్ళి, అక్కడున్న మహర్షులు, పితరులకు, తెలియచేసి, యజ్ఞవేత్తలతో సంప్రదించి, యజ్ఞము చేయుటకు సిద్ధపరచగా, శంభుని ఆజ్ఞతో, యజ్ఞం ప్రారంభం అవ్వకుండానే, శిలాదుడు శరీరం నుండి నందీశ్వరుడు” ఉత్పన్నమయ్యాడు.అక్కడున్న మునులంద రూ శిలాదుడును ప్రశంసించారు.

శిలాద మహర్షి- ”ప్రళయ కాలీన సూర్యుని వంటివారు, అగ్ని సమాన ప్రతిభా శాలి, త్రినేత్రుని ప్రకాశవంతమైన జటామ కుటధారి, త్రిశూలాది ఆయుధాలు ధరించి ఉన్న ఆ బాలుని చూసి, సంతోషించి, ”బాల కా! నందీ! నువ్వు సాక్షాత్తు పరమేశ్వరుని అంశతో జన్మించినవాడవు. అయోనిజుడువు. నీవు నంది అనేపేరుతోప్రకటితమవుతావు.”అంటూఆశీర్వదించాడు. యజ్ఞక్షేత్రమునుండిఆశ్రమానికి తీసుకు రాగా, నంది మానవ రూపాన్ని ధరించాడు.

నందికి ఐదో సంవత్సరం. వచ్చేసరికి సకల శాస్త్రాలను, వేదాలను ఆధ్యయనం చేయించా డు. ఏడవ సంవత్సరం వచ్చేసరికి శివుని ఆజ్ఞ మేరకు మిత్రుడు- వరుణుడు అనే ఇద్దరు పేరున్న ఋషులు శిలాద ముని ఆశ్రమానికి వచ్చి, ఆ నందిని చూసి, ”మహాత్మా! శిలాదా! నీ కుమారుడు నంది సకలశాస్త్ర పారంగ తుడు, విద్వాంసుడు అయినప్పటికి ఇతని ఆయువు చాలా స్వల్పం. ఇతనికి ఇక ఒక సంవత్సరం ఆయుర్దాయం మాత్రమే ఉంది.”

అని పలుకగా, పుత్ర వాత్సల్యుడగు శిలాదుడు నందిని గుండెలకు హత్తుకొని విచారిస్తుంటే, నంది తండ్రితో ”నాయనా! దేవతలు, దానవులు, యముడు, కాలుడు, మృత్యు దేవత నన్ను సంహరింప దలచినప్పటికి, ఈ బాల్యావస్థలో నాకు మృత్యువు కలగదు. అయినా నేను శివాంశ సంభూతుడను. నేను మహాదేవుడు శంకరుడుని ఆరాధిస్తాను. దీర్ఘాయువును పొందుతాను. చింతించ కండి!” అని తండ్రిని ఓదార్చి, తపస్సుకు వెళ్ళి, ఏకాగ్రతతో, రుద్ర మంత్రా న్ని జపిస్తూ ఉండేవాడు. కొద్ది సంవత్సరాలు గడిచేసరికి, దయాసాగరుడు, పరమేశ్వరుడు సంతో షించి, ఉమాసహతుడై, ప్రత్యక్షమై, ”నందీ! నీ తపస్సుకు మెచ్చాను. నీ వద్దకు ఆ ఇరువురు ఋషులను నేనే పంపాను. నీవు అమరుడవు. అజరుడవు. నువ్వు నాకు పార్వతికి ఇష్టమైన వాడవు. నీమీద మాకున్న కృప వల్ల జరా- జన్మ- మృత్యువులు ప్రభావం ఏమీ ఉండదు. అపుడు ఉమాదేవి మాట్లా డుతూ ”నాథా! మీరు నందీశ్వరుడుకు గణా ధ్యక్ష పదవిని ప్రసాదించండి. ఇతడు మనకు పుత్రుడే సుమా.” అనగానే నంది ”శంకరా! మీ కృప ఎల్లప్పుడూ నాపై ఉండేలా, నేను నిరం తరంమిమ్ములను దర్శించేటట్లు అనుగ్రహం చండి” అన్నాడు.

శివుడు ”వత్సా! నందా! భక్తులునిన్నుదర్శించకుండానా దర్శనం పొందినా ప్రయోజనం ఏమి ఉండదు. అందుకు నన్నువీక్షించాలంటే నువ్వు వృషభ రూపంలో నా ముందు ఉండి నన్ను స్మరిస్తూన్నప్పుడు, నీ కొమ్ముల ద్వారా మాత్రమే నన్ను వీక్షించిన వారికి కైలాస ప్రాప్తి సిద్దిస్తుంది.” అని వర మిచ్చి ఉమాసహతుడైన శంకరుడు నందిని కైలాసం తీసుకెళ్లి గణములతో ఇకనుండి ఈ నంది మీకు అందరికీ అధ్యక్షుడు. మీరందరూ అతనిని ఆదరించి, గౌరవించండి. అదే మా ఉభయులకు ఆనందం.” అని చెప్పాడు.

అప్ప టినుండి ప్రతీ శివాలయంలో నందీశ్వ రుడు కొలువైఉన్నాడు.నందీశ్వరుడు చరి త్ర చదివిన వారికి, విన్న వారికి శివానుగ్రహం కలు గుతుంది అని శివ పురాణం తెలియచేస్తోంది.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment