Friday, 1 December 2023

కార్తికమాస విధులలో ధాత్రీ వృక్ష విశిష్టత

 


ధాత్రీ ఛాయేతు య: కుర్యాత్‌ దీప దానం విశేషత:

పిండ దానం చ యో భక్త్యా నర: కుర్యాత్‌ విశుద్ధధీ:

ముక్తిం ప్రయాంతి పితర: ప్రసాదాన్‌ మాధవస్యతు

అనగా కార్తికమాసంలో ప్రతీ రోజూ సూర్యోదయమునకు ముందే ధాత్రీ వృక్ష మూలమున దీపమును ఉంచవలెను. అలాగే మధ్యాహ్న సమయమున ధాత్రీ వృక్ష ఛాయలో పితరులకు పిండదానము చేసినచో మాధవుని దయతో పితృదేవతలు ముక్తిని పొందుతారు.

ధాత్రీ ఫల విలిప్తాంగ: ధాత్రీ ఫల విభూషిత:

ధాత్రీ ఫల కృతాహర: నరో నారాయణోభవేత్‌

ధాత్రీ ఛాయాం సమాశ్రిత్య యోర్చయేత్‌ చక్రధారిణం

పుష్పే పుష్పే అశ్వమేధస్య ఫలం ప్రాప్నోతి మానవ:


ధాత్రీ ఫల రసమును శరీరానికి రాసుకుని స్నానమాచరించి ధాత్రీఫల మాలను ధరించి ధాత్రీఫలమునే ఆహారముగా తీసుకొను నరుడు నారాయణుడగును. ధాత్రీ వృక్షఛాయలో శ్రీహరిని పుష్పములతో లేదా తులసీ దళములతో పూజించిన ప్రతీ పుష్పమున, ప్రతీ తులసీ దళము వలన అశ్వమేధ ఫలము లభించును. ఈ మాసమున ధాత్రీ వృక్షఛాయలో రాధాదామోదరులను పాయసము, చిత్రాన్నములతో పూజించి హోమం చేసి, బ్రాహ్మణులకు భోజనం ముందు వడ్డించి పిదప బంధువులతో కలిసి భుజించవలయును.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment