Tuesday, 5 December 2023

శివుడి వద్ద నంది, త్రిశూలం, పాము, రుద్రాక్ష, డమరుకం ఎందుకు? పరమార్థం ఏమిటి?🙏

 



ఆది పరాశక్తి , జగజ్జనని అయిన పార్వతీదేవికి భర్త అయ్యి శివుడు అర్ధనారీశ్వరుడైనాడు. గణపతి, అయ్యప్ప, కుమారస్వామి పుత్రులు గల శివుని దగ్గర ఉండే సన్నిహిత చిహ్నాలు, వాటికి ఈశ్వరుడికి గల సంబంధం గురించి కొంత తెలుసుకుందాం.

నంది (ఎద్దు):- శివునికి అతి దగ్గరలో ఉన్న ఆప్త మిత్రులలో ఒకటి. ఎందుకంటే నంది అన్ని శివాలయాల వెలుపల కనబడుతుంది. 

శివ భక్తులు తమ కోరికలను శివునికి విన్నవించమని నందీశ్వరుని చెవులవద్ద భాదలను నివారించమని స్వామివారికి చెప్పు అని గుసగుసగా చెప్పుకుంటారు. 

త్రిశూలము :- శంకరుడు ఎంచుకున్న ఆయుధం త్రిశూలము. శివుని ఒక చేతిలో త్రిశూలం ఉంటుంది. త్రిశూలములో ఉండే మూడు వాడి అయిన మొనలు ఉంటాయి అవి ఏమిటనగా కోరిక, చర్య , జ్ఞానం అనే మూడు శక్తులను సూచిస్తాయి.

నెలవంక చంద్రుడు :- శివుడిని తరచుగా తన 'జటా' ఒక అర్ధ చంద్రాకార చంద్రుని కళా రూపాలతో చిత్రీకరించారు. చంద్రుడు వృద్ది చెందటం మరియు తగ్గిపోవటం అనేది ప్రకృతి యొక్క అత్యంత శాశ్వతమైన చక్రాన్ని సూచిస్తుంది. హిందుమత క్యాలెండర్ ఈ ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది.

నీలిరంగుకంఠం :- శివునికి మరొక పేరు నీలకంఠుడు అని. శివుడు సముద్ర మదనం సమయంలో వచ్చిన విషాన్ని మింగడం జరిగింది. అప్పుడు పార్వతిదేవి శివుని కంఠంలో విషాన్ని ఆపివేయుట వలన కంఠం నీలం రంగులోకి మారినది. అప్పటి నుండి శివుడు నీలం రంగు కంఠం కలిగి ఉన్నాడు. 

రుద్రాక్ష :- శివుడు మెడ చుట్టూ రుద్రాక్ష హారమును ధరిస్తాడు. అంతే కాకుండా రుద్రాక్ష యొక్క తాయెత్తులు కలిగి ఉంటుంది. 'రుద్రాక్ష' అనే పదము 'రుద్ర' ( శివ యొక్క మరొక పేరు ) మరియు 'అక్ష్' అంటే కన్నీళ్లు నుండి వచ్చింది. ఒక కథ ప్రకారం శివుడు లోతైన ధ్యానం తర్వాత ఆయన కళ్ళు తెరిచిన సమయంలో ఆయన కనుల నుండి వచ్చిన కన్నీటి చుక్కలు భూమి మీద పడి అవి పవిత్ర రుద్రాక్ష చెట్టులోకి వెళ్లినాయి. 

పాము :- శివుడు ఆయన మెడ చుట్టూ మూడు సార్లు చుట్ట బడిన ఒక పామును ధరిస్తారు. పాము మూడు చుట్టలకు అర్ధం.భూత,

వర్తమాన,భవిష్యత్ కాలాలనుసూచిస్తాయి.

నాగదేవతను హిందువులు పూజించే పవిత్రమైన ప్రాణిగా తెలుస్తుంది.

మూడో కన్ను:- శివుని చిహ్నాలలో ఒకటిగా మూడో కన్నును చెప్పవచ్చు. ఆయన నుదుటిపైన మధ్య భాగంలో మూడో కన్ను ఉంటుంది. అయన చాలా కోపాని గురిఅయినప్పుడు చెడును నివారించాలనుకున్నప్పుడు మాత్రమే మూడో కన్ను తెరుచుకుంటుంది.అప్పటి నుండి మూడో కన్ను జ్ఞానం మరియు సర్వ వ్యాపకత్వం కోసం ఒక చిహ్నంగా మారింది. 

డమరుకం :- శివునితో సంబంధం కలిగిన ఒక చిన్న డ్రమ్ వంటి వాయిద్యం. శివ కళాత్మక అభివృద్ధి స్వాధీన సమయంలో డమరుకం యొక్క లయతో నాట్యం చేస్తారు. 

జటా :- అట్టకట్టుకొని పీచులాగా ఉన్న జుట్టు.సాధారణంగా శుభ్రంగా లేని సంకేతంగా కనిపిస్తుంది. 

కానీ శివ విషయంలో అతను ప్రాపంచిక ఆలోచనలకు మించినదిగా ఉంటుంది.శివుని అట్టకట్టుకొని జుట్టు లేదా 'జటా' అందం పవిత్రమైన ప్రామాణిక నిర్వచనాలకు మించి ఉన్నట్టు చూపిస్తుంది.

శివుడిని భక్తితో కోలిస్తే తనపై ఒక్క చెంబేడు నీళ్ళను మంచి మనస్సుతో పోసి పూజిస్తే భక్తుల కోరికలను కరునించేబోళాశంకరుడు.శివపంచాక్షరీ ఆపదకాలంలో శివ భక్తులకు ఒక రక్షణకవచంలా కాపాడుతుంది...

శివుని అనుమతి లేనిదే ప్రవేశం దొరకని క్షేత్రం "అరుణాచలం"-ఒక్క సారి అరుణాచలం లో ప్రవేశించిన తర్వాత.మౌనం పాటించండి (మాట్లాడితే మనసు శివుని మీద ఉండదు)

శివ నమ స్మరణ చేస్తూనే వుండండి (లేదంటే మన నాలుకకు హద్దు ఉండదు)

వీలైనంత వరకు మితాహారం పాటించండి (లేదంటే స్పృహ శివుని మీద ఉండదు)

సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చెయ్యండి (లేదంటే మనం మనతోనే ఉండలేము ... అక్కడ శివుని తో ఉండాలి)

మన దర్పం చూపకూడదు (అక్కడ శివుడే సుప్రీమ్ ... మనము జీరో)

దంపతులైన సరే దాంపత్య జీవితం అక్కడ గడపకూడదు (కోరికలు దగ్ధం చేసే అరుణాచలం లో.కోరికలనుతీర్చుకోకూడదు )

వీలైతే అన్నదానం చెయ్యండి (మోక్షానికి దగ్గరవుతారు ..... అది కూడా మోక్షం కావాలనుకునే వారు మాత్రమే )

ఎవ్వరిని దూషించకండి (అక్కడ శివ పార్వతులు సిద్ధుల రూపంలో... సాధారణ రూపంలో మన మధ్యలోనే వుంటారు )

తప్పదు కాబట్టి .. మీ హోటల్ రూమ్ లో తప్ప... అరుణాచల క్షేత్రంలో ఎక్కడా.. ఉమ్మి వెయ్యకండి, మూత్ర మల విసర్జన చెయ్యకండి

అరుణాచలం సాక్షాత్తూ శివుడు ప్రత్యక్షంగా సంచరించే గొప్ప క్షేత్రం

ఆయనకు అసౌకర్యం కలిగించేందుకు, మనం అరుణాచలం వెళ్లాల్సిన అవసరం ఉందంటారా ?

సాధారణ పుణ్య క్షేత్రంలా .... కేవలం దర్శనం నిమిత్తం అరుణాచలం రావద్దు ..

ఇది పరమ పావన ఆవిర్భావ అగ్ని లింగ క్షేత్రం ....

మనసా వాచా కర్మణానా శివ స్పృహ తో చేసేయాత్ర...

ఒక్క సారి అర్హత తో కూడిన అరుణాచల దర్శనం చెయ్యగలిగితే .ఇక మరొక జన్మ ఉండదు!

అయ్యా బాబోయ్... మాకు మళ్ళీ జన్మ కావాలి... మానవ సుఖాలన్నీ అనుభవించాలిఅనుకుంటే .మీ ఇష్ఠమ్ వచ్చినట్లు దర్శనం చేసుకోవచ్చు ... అరుణాచల శివుని... ఎందుకంటె అది కేవలం దర్శనం మాత్రమేఅవుతుంది

మన మరు జన్మలకు అడ్డం ఉండదు!మనిషి జీవితాన్ని రెండు భాగాలు గా విభజించదగిన సమయం- అరుణాచల ప్రవేశం.

ఇందులో శివ స్పృహ తో, నియమ నిష్టలతో గిరి ప్రదక్షిణ చెయ్యడం అనేది, కేవలం పుణ్య కార్యం మాత్రమే కాదు, జన్మకు సరిపడా గుర్తుంచుకోదగిన మహా ఘట్టం అవుతుంది.

గిరి ప్రదక్షిణతో మాత్రమే అరుణాచల యాత్ర సంపూర్ణం అవుతుందని మర్చిపోకూడదు.

అరుణాచలం లో ఉన్నంత సేపు మరియు గిరి ప్రదక్షిణ లో అను క్షణం అందరూ గిరి వైపు చూస్తూ శివ నమ స్మరణ చేస్తూనే ఉండాలి. అది కేవలం కొండ కాదు. ఆ కొండ కొండ మొత్తం యోగ నిద్ర లో శ్రీ దక్షిణామూర్తి స్వరూపం లో నంది, గౌరీ, గణేశా, కుమారస్వామి వార్లతో సజీవంగా కూర్చుని ఉన్న ఆ మహా శివుడే ఆ అరుణ గిరి(అరుణ గిరి వాడుక లో తిరువణ్ణామలై ఐనది- తిరు అరుణ మలై- తిరువణ్ణామలై గా మారింది )

గిరి ప్రదక్షిణ చేస్తున్న చాలా మందిని గమనించండి ! వారి వారి వ్యాపార కుటుంబ మరియు ఇతర అనుభవాల గురించి మాట్లడుకుంటూ, నవ్వుకుంటూ, ఏవి పడితే అవి తింటూ, ఒక విహార యాత్ర లాగా,  నడుస్తున్న ఆ17 కిలో మీటర్లు ఎలా టైం పాస్ చెయ్యాలి అనుకుంటూ, ఎన్ని లింగాలు పూర్తి అయ్యాయి, ఇంకా ఎంత దూరం వుంది, మరో గంటలో అయిపోతే హాయ్ గా పుణ్యం తో పాటు రూమ్ వెళ్లి, వెంటనే తిరుగు ప్రయాణం చేసి, రేపు వ్యాపారం లో లేదా వుద్యోగం లోఏమేంపనులుచేసుకోవాలి అనుకుంటూ .ఇదే స్పృహ తో గిరి ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళను ఎక్కువమందిలో గమనించవచ్చుఅతి కొద్దీ మంది మాత్రమే మౌనంగా, శివ నమ స్మరణతో తాదత్మ్యం చెందుతూ, ప్రదిక్షిణ చేస్తుండడం సులభంగా గమనించవచ్చు. 

తరువాతి యాత్రలో నైనా గిరి ప్రదక్షిణ చేసే విధానాన్ని మార్చుకుంటే ఆ యాత్ర ఫలం దక్కుతుందని మరవద్దుఅరుణాచలం లో... దక్షిణా మూర్తి గా... స్థూల రూపం లో కొలువైయున్న ఆ మహా శివుడు ప్రత్యక్షమైతే మనం ఆయన్ని ఏమి కోరుతారో ఆయనకి తెలియదు గాని... ఆయన మాత్రం ఒక్కటేకోరుతాడు .... భక్తి పేరు చెప్పి నా భక్తుల్ని ఇబ్బంది పెట్టినా .... మోసం చేసినా.శివుని రుద్ర రూపం మీరు చూస్తారు అని... అంటే నేను ఎంత కారుణ్య మూర్తి నో.అంతటికఠినాత్ముడను ... శిక్షల విషయం లో అని.... కనుక శివ దర్శనం కావాలి అంటే.... తొలుత శివ సమ్మతం సాధించండి ...

సర్వం శివోహం!

అత్యంత తేలికగా మోక్షం లభించే మార్గం చూపండి... మాహా ప్రభో... అని మన పూర్వ ఋషు మహర్షులు బ్రహ్మను, విష్ణువు, శివుని కోరినప్పుడు ... వారు చూపిన మార్గాలు కడు కష్టతరంగా భావించి, ఎంతో మంది ఋషులు తిరిగి,, తిరిగి జన్మిస్తూనే వున్నారు ....

కాశీ లో మరణం కన్నా... అర్హత తో కూడిన అరుణాచల యాత్ర మోక్షానికి సులభ మార్గమని తెలిసిన వేల మంది ఇప్పుడు అరుణాచలం లో వాన ప్రస్థాశ్రమాన్ని గడిపారని ... స్థాయిని, వేల కోట్లా ఆస్తులను వదిలి, ఇప్పటికీ అక్కడే గడుపుతూ వున్నారని,,, మనలో ఎంత మందికి తెలుసు?

అర్హత గల అరుణాచలేశ్వర యాత్ర చెయ్యగలిగితే, అది తప్పకుండ శివుని అనుగ్రహం !

🙏ఓం అరుణాచలేశ్వర యనమః!.


సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment