Saturday, 2 December 2023

శివాయ_విష్ణురూపాయ_శివరూపాయ_విష్ణవే

 



శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః 

శివ విష్ణులకు భేదం చూపకూడదు 

శివరూపుడే విష్ణువు విష్ణు రూపుడే శివుడు శివ హృదయం విష్ణువు విష్ణువు హృదయం శివుడు శివ కేశవులకి బేదం చూపించనంతవరకే ధనం ఆయుష్షు నిలిచి ఉంటాయి

విష్ణుసహస్రనామాలను భీష్ముడు ఉపదేశిస్తే శివ సహస్రనామాలను శ్రీకృష్ణ పరమాత్ముడే ఉపదేశించాడు శ్రీకృష్ణుని వివాహం చేసుకోవడానికి రుక్మిణీదేవి మహేశ్వరుని ప్రార్థించింది శ్రీ రామ జపాన్ని గౌరీదేవికి ఉపదేశించాడు శివుడు 

పురాణాలన్నీ హరికి హరుడికి భేదం లేదని చెబుతున్నాయి

శివుడే విష్ణువా     అవును 

స్కంధపురాణములో శివుడే విష్ణువే విష్ణువే శివుడు అన్న ఒక కథ కనిపిస్తుంది 

ఒకానొకప్పుడు అగస్త్యమహర్షి వైష్ణవ క్షేత్రమైన కుర్తాళంములో విష్ణుమూర్తిని దర్శించుకో పోతుండగా నుదుట శైవ చిహ్నమైన విభూతి రేఖను చూసి అక్కడ పూజారులు అగస్తులు వారిని దేవాలయం ప్రవేశించకుండా అడ్డుకుంటారు

శివ కేశవులకు భేదం లేదన్న సత్యం తెలిసినా అగస్త్యుడు రేఖలను తీసివేసి త్రిపుండ్రం ధరిస్తాడు అప్పుడు ఆయనను ఆలయంలోకి ప్రవేశించడానికి పూజారులు అనుమతిస్తారు.

అగస్తులు ఆలయంలోకి అడుగుపెట్టగానే శ్రీమహావిష్ణువు అగస్యుని యొక్క తపశక్తి లోకానికి చాటటానికి శివలింగముగా మారిపోతాడు

శివ కేశవులకు భేదం లేదని శ్రీ మహావిష్ణువు స్వయంగా చాటిన శ్రీ విష్ణు ఆలయం, ఆనాటి నుండి శివాలయముగా భక్తుల నీరాజనాలు అందుకుంటుంది 

పరమేశ్వరునికి....ఈశ్వరునికి నూలు బట్టలతో పూజ చేస్తే ప్రీతీ అదే వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణకి శ్రీ మహావిష్ణువుకి పట్టు వస్త్రాలతో పూజ చేస్తే ప్రీతి.

ఓం నమః శివాయ - ఓం నమో నారాయణాయ

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment