Thursday, 14 December 2023

కనకధార స్తోత్రం చదివేవాళ్ళకు కొన్ని సూచనలు:

 

               


🙏🌹🕉🙏🌹🕉🙏🌹🕉🙏

లక్ష్మీదేవి అదృష్టానికి, శుభానికి సూచికగా చెబుతారు. 

🕉 సిరి ఉంటే అనుకున్నది సాధించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఆ మహాలక్ష్మీ కటాక్షం ప్రతి ఒక్కరికీ లభించాలని లేదు. ఎవరైనా ఎటువంటి రంగంలో ఉన్నా వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా...

శ్రీ ఆది శంకరాచార్యులవారు 

ఆశువుగా 'కనకధారా స్తోత్రం' చెప్పారు. 

🕉 కనకధారా స్తోత్రాన్ని రోజూ రెండు సార్లు పఠించినంతనే నిరుపేదలైనా కుబేరులుగా మారతారు. 

అటువంటి కనకధారా స్తోత్రం పఠించే వారు కొన్ని సూచనలను పాఠించాలి.

🔯కనకధారా స్తోత్రాన్ని ఉత్తర ముఖంగా ఉండి పఠించాలి.

🕉మహాలక్ష్మీదేవి పటాన్ని కానీ మహాలక్ష్మీ యంత్రాన్ని కానీ ఎదురుగా పెట్టుకుని పారాయణ చేయాలి

🔯ప్రతి రోజూ ఉదయం 6:00 నుండి 7:00 గంటల మధ్య, సాయంత్రం 6:00 నుండి 7:00 గంటల మధ్య పారాయణ చేయాలి.

🔯 కనకధారా స్తోత్రాన్ని పూర్ణిమ తిథి లేదా పౌర్ణమి రోజున ఉపదేశం పొందాలి.

🕉 కనకధారా స్తోత్ర పారాయణకు వయసు లింగ భేదాలు లేవు.

🕉ఎటువంటి కారణంతో అయినా పూజ చేసే సమయాలలో నలుపు, ఎరుపు రంగు వస్త్రాలను ధరించి పూజించకూడదు.

🌹ఎరుపు రంగు వస్త్రాలను ధరించి కనకధారా స్తోత్రాన్ని పారాయణ చేయకూడదు.

🕉పట్టువస్త్రం లేదా ఎరుపు, నలుపు లేని వస్త్రాలను ధరించి శ్రీ కనకధారా స్తోత్రాన్ని పఠించి కులదేవతకు పూజ చేస్తే ఋణ బాధలు ఉండవు, లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం పొందుతారు.

🕉మగవాళ్ళు ప్రతి రోజూ శ్రీ కనకధారా స్తోత్రాన్ని పఠిస్తే అసలు అప్పులపాలు కారు...స్వస్తీ


సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment