శని వారము : ( స్థిర వాసరః )
శని వారము హోరా సమయములు :
సూర్యోదయము ఉదయం గం.6-00 నిర్ణయము
మేరకు క్రింది తెలిపిన కాలాలు సూచింప బడినవి
హెచ్చు, తగ్గు కాలాలున్నపుడు సవరించు కోవాలి.
గ్రహము : హోరా సమయం/ పగలు / రాత్రి :
1. శని హోర : ఉదయం గం.6-00 నుండి గం.7-00
మధ్యాహ్నం గ.1-00 నుండి గ.2-00
రాత్రి గ.8-00 నుండి గ.9-00
తెల్లవారుజాము 3-00 నుండి 4-00
2.గురు హోర : ఉదయం గం.7-00 నుండి గ.8-00
మధ్యాహ్నం గ.2-00 నుండి గ.3-00
రాత్రి గం.9-00 నుండి గం.10-00
తెల్లవారు జాము గ.4-00 నుండి 5-00
3.కుజ హోర : ఉదయం గం.8-00 నుండి గం.9-00
మధ్యాహ్నం గం.3-00 నుండి గ.4-00
రాత్రి గం.10-00 నుండి గం.11-00
తెల్లవారుజాము గ.5-00 నుండి 6-00
4. రవి హోర : ఉదయం గం.9-00 నుండి గ.10-00
సాయంత్రం గం.4-00 నుండి గ.5-00
రాత్రి గం.11-00 నుండి గం.12-00
5. శుక్ర హోర : ఉదయం గం.10-00 నుండి 11-00
సాయంత్రం గం.5-00 నుండి గ.6-00
రాత్రి గం.12-00 నుండి గం.01-00
6. బుధ హోర : ఉదయం గ.11-00 నుండి .12-00
సాయంకాలం గం.6-00 నుండి గ.7-00
రాత్రి గం.01-00 నుండి గం.2-00
7.చంద్ర హోర : మధ్యాహ్నం గ.12-00 నుండి 1-00
రాత్రి గం.7-00 నుండి గం.8-00
తెల్లవారుజాము గ.2-00 నుండి 3-00
శని వారం రోజులో వున్న పగలు, రాత్రి హోరలు.
శుభ గ్రహ హోరలు శుభ ఫలితములను,
పాప గ్రహ హోరలు పాప ఫలితములను ఇస్తాయి.
ప్రయాణాలకు, శుభకార్యాలకు హారాసమయాలు
చూచుకొని ప్రారంభిస్తే విజయవంత మవుతాయి.
జన్మ లగ్న, జన్మ నక్షత్ర ననుసరించి శుభ అశుభ
గ్రహములను ఎవరికి వారు నిర్ణయించు కోవాలి.
జ్యోతిశ్శాస్త్రంలో ఆద్యుడైన పరాశర మహర్షి తన
మొదటి గ్రంథమునకు బృహత్పరాశర హోరాశాస్త్రం
అని నామకరణం చేశారు కావున జ్యోతిశ్శాస్త్రంలో
హోరకు గల ప్రాధాన్యతను గుర్తించ వలసి యున్నది
సర్వే జనాః సుఖినో భవంతు,
No comments:
Post a Comment