Friday, 6 October 2023

నీ జాతకం నీకు అనువుగా మార్చుకో

 



నీ జాతకం నీకు అనువుగా మార్చుకో !!

.....

ఒక పేద గృహస్థు ఉండేవాడు .

అతని వద్ద ఒక బక్కచిక్కిన ఆవు ఉండేది.

.

ఆ ఆవు చక్కగా పాలు ఇస్తూ వుండేది ,దాని పాలు కాసిని తాగి, కాసిని అమ్ముకొని ఏదోవిధంగా జీవనం సాగిస్తూ ఉండేవాడు .

,

దానికి కాస్త మేత కొని వేయాలన్నా అతని వద్ద సరిపడా డబ్బు ఉండేది కాదు. 

.

తన దరిద్రం తీరే మార్గం కనపడటం లేదు అతనికి .

.

తన జాతకమెలా ఉందో తెలుసుకోవాలని ఒక జ్యోతిష్యుడి వద్దకు వెళ్లాడు.

.

ఆ జ్యోతిష్యుడు చాలా తీవ్రంగా జాతక పరిశీలన చేసి ,

...

"నాయనా నీ జీవితమంతా ఒకే ఆవు దానిమీద వచ్చే ఆదాయముతో బ్రతుకుతావు అని ఉంది" .

.

బ్రహ్మ రాసిన రాతను మార్చలేము కదా ! నీ జీవితమంతా అలా గడపాల్సిందే .

.

అతడు ఉస్సూరుమని నిట్టూరుస్తూ ఇల్లు చేరుకున్నాడు .

.

అయినా ఏ మూలో ఆశ మిణుకు మిణుకు మంటున్నది. ,

.

కొన్ని రోజులాగి ఇంకొక జ్యోతిష్యుడి వద్దకు వెళ్ళాడు .

.

ఆయనకూడా అదే చెప్పాడు .

.

అయ్యా !నా దరిద్రం తీరే మార్గంలేదా అని అడిగాడు ఈ పేదగృహస్థు.

.

ఈ రెండవ జ్యోతిష్యుడు జాతకం తో పాటు కొన్ని నివారణోపాయాలు ,పరిహారాలు సూచిస్తాడు అని పేరున్నది.

.

ఆయన వెంటనే అతన్ని నీ ఇష్టదైవానికి పూజ చేసి నీ దగ్గరున్న ఆవును రేపు సంతలో అమ్మేసేయి వచ్చిన డబ్బులతో నీకు కావలసినవి కొనుక్కో అని చెప్పాడు.

.

ఇతనిక ఏమీ ఆలోచించకుండా ఆ ఆవును సంతలో అమ్మేసి దాని మీద వచ్చిన డబ్బు పెట్టి మొట్టమొదటి సారి ఇంట్లోకి కావలసిన అన్ని వస్తువులు కొని కొంత డబ్బు జేబులో పెట్టుకొని బయలుదేరాడు

.

దారిలో ఒకచోట ఎవరో ఒక ధనికుడు గోదానాలు చేస్తున్నాడు .ఇతను వెళ్ళగా ఇతనికి కూడా ఒక ఆవు దానంగా లభించింది.

.

చాలా సంతోషంగా ఆవును,సరుకులను ,జేబులో డబ్బుతోను ఇల్లుచేరి భార్యకు ఈ సంగతి చెప్పి ఆ రాత్రికి హాయిగా పడుకొని ,తెల్లవారుతూనే ఈ సంగతి చెప్పటానికి జ్యోతిష్యుడి వద్దకు వెళ్ళాడు.

.

ఆయన అది విని మరల ఈ ఆవును కూడా అమ్మేయి అని సలహా ఇచ్చాడు.

.

అదేమిటి స్వామీ అని అనకుండా ఇదికూడా అమ్మేశాడు.మరల సొమ్ము భద్రంగా ఇంటికి తెచ్చుకున్నాడు.

.

ఈ సారి దూరపు బంధువొకరు ఇతని దరిద్రాన్ని చూసి జాలిపడి ఒక  ఆవును ఇచ్చిపోదామని వచ్చాడు .

.

సరే ఆ ఆవును తీసుకున్నాడు .

..

మరల దానిని కూడా అమ్మి డబ్బులు జేబులోపెట్టుకొని వచ్చాడు.

.

అప్పుడు గానీ అతనికి అర్ధము కాలేదు తన  జీవితములో ఎప్పటికీ ఒక ఆవు!, దాని మీది సంపాదన!ఇదే తన జాతకము " బ్రహ్మరాత "అని. 

.

దానిని తనకు అనువుగా మలచిన  జ్యోతిష్యుడి తెలివితేటలకు సంతోషించి ఆయనను ఘనంగా సన్మానించాడు.

.

అలా అతనికి జీవితమంతా ఏదోవిధంగా ఒక ఆవు మాత్రమే దొరుకుతున్నది దానిని అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడతను.

.

జ్యోతిష్యం చాలామందికి తెలుసు

.

 కానీ ! 

.

ఎలా అన్వయం చేసి చెప్పాలో కొందరికే తెలుసు.

(సర్వేజనాః సుఖినో భవంతు)
(సమస్త సన్మంగళాని భవంతు)
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment