కార్తీక మాసంలో క్రిష్ణ పక్షం యొక్క అష్టమి రోజున అహోయి అష్టమిని పండుగల జరుపుకుంటారు. అయితే ఇది మన దక్షిణ భారతదేశంలో కాదు.. ఉత్తర భారతదేశంలో. కార్వాచౌత్ ముగిసిన నాలుగు రోజుల తర్వాత అహోయి అష్టమిని జరుపుకుంటారు.
ఈ సంవత్సరం ఈ పండుగ నవంబర్ 8వ తేదీన ఆదివారం నాడు వచ్చింది. ఈ పవిత్రమైన రోజున చాలా మంది హిందువులు పార్వతీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సందర్భంగా చాలా మంది ఉపవాసం ఉంటారు.
ఈ పర్వదినాన చీకటి పడిన సమయంలో నక్షత్రాలను చూసిన తర్వాతే ఉపవాసాన్ని విడిచిపెడతారు. అంతవరకూ ఉపవాసం అలాగే కొనసాగిస్తారు. ఈ ఉపవాసం ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ సందర్భంగా అహోయి అష్టమి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి.. ఏ శుభ సమయంలో ఇది పాటించాలి.. అమ్మవారి ఆరాధాన ఎలా చేయాలి.. ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దీపావళికి ముందు.. ఈ అహోయి అష్టమి పండుగను తమ పిల్లల శ్రేయస్సు కోరుతూ తల్లలుంతా ఉపవాసం ఉంటారు. దీపాల పండుగ అయిన దీపావళి ప్రారంభానికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు.
రోజంతా ఉపవాసం.. ఈ అహోయి అష్టమి రోజున కార్వాచౌత్ వేళ ఎలా అయితే ఉదయాన్నే లేచి మట్టి కుండలో నీళ్లు పెట్టి అహోయి దేవతను ఆరాధిస్తారో.. ఈ సమయంలో కూడా అలానే అమ్మవారిని ఆరాధిస్తారు. అదే సమయంలో ఈరోజంతా ఏమి తినకుండా ఉపవాసం ఉంటారు. ఈ పూజ సమయంలో (పూరి, హల్వా, చనా మొదలైనవి) నైవేద్యంగా సమర్పిస్తారు. చీకటి పడిన తర్వాత నక్షత్రాలను చూసిన తర్వాతే ఉపవాసాన్ని విచ్ఛిన్నం చేస్తారు.
తేడా ఏంటంటే.. అహోయి అష్టమి మరియు కార్వాచౌత్ యొక్క ఉపవాసం మధ్య వ్యత్యాసం ఏంటంటే.. కార్వాచౌత్ రోజున చంద్రుడిని చూసిన అనంతరం ఉపవాసాన్ని ముగిస్తారు. అదే అహోయి అష్టమి రోజున మాత్రం నక్షత్రాలను చూసిన తర్వాతే ఉపవాసం ముగుస్తుంది.
శుభ ముహుర్తం.. అహోయి అష్టమి వ్రత తేదీ : నవంబర్ 8, 2020(ఆదివారం) అహోయి అష్టమి పూజా ముహుర్తం : సాయంత్రం 5:31 నుండి సాయంత్రం 6:50 గంటల వరకు అహోయి అష్టమి తేదీ ప్రారంభం : నవంబర్ 8, 2020 రోజున ఉదయం 7:29 గంటలకు అష్టమి ముగింపు : నవంబర్ 9, 2020 సాయంత్రం 6:50 గంటలకు
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
No comments:
Post a Comment