Wednesday 25 November 2020

శివుడు విగ్రహరూపంలో దర్శనమిచ్చే క్షేత్రం




శివుడుకి భూమండలం మీద విగ్రహరూపంలో ఉండే ఆలయాలు చాలా అరుదు. అందరూ శివలింగం రూపంలోనే ఆయన్ను పూజిస్తారు కదా!! ఒకేవేళ శివుడు విగ్రహరూపంలో దర్శనమిచ్చే క్షేత్రాన్ని దర్శిస్తే ఎంతో పుణ్యం చేసుకున్నవారిగా భావిస్తారు. ఇప్పుడు అటువంటి శివుని విగ్రహాన్నే దర్శించుకోబోతున్నాం. ఇక్కడ శివుడు విగ్రహరూపంలోనే కాదు తలకిందులుగా తపస్సు చేస్తూ భక్తులచేత పూజించబడుతున్నారు. ఇదెక్కడుందో ? అక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం పదండి ...!
ఈ క్షేత్రం ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాలలో ఒకటైన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమగోదావరి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో ఈ దేవాలయం ఉన్నది. పంచారామ క్షేత్రాలలో ఒకటైన భీమవరం కు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం కలదు. ఆంధ్ర ప్రదేశ్ - పంచరామ క్షేత్రాలు !


యనమదుర్రు గ్రామంలో గల దేవాలయం - శ్రీ శక్తీశ్వరస్వామి ఆలయం. దీనిని తూర్పుచాళుక్యుల కాలంలో నిర్మించారు. ఈ దేవాలయం పురాతనమైనది మరియు అత్యంత విలక్షణమైన శివలింగాన్ని కలిగి ఉంటుంది.
స్థలపురాణం
యమధర్మరాజు గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఆయన జీవులను, కాలం చెల్లిన ప్రాణులను నరకానికి తీసుకెళుతుంటాడు. ఒకానొక దశలో యముడు ఈ పనిపై విరక్తి చెంది, శివుడికి మోక్షం ప్రసాదించమని వేడుకుంటాడు. ప్రత్యక్షమైన శివుడు ఒకానొక రాక్షసుడి ద్వారా యముడు పేరుమీద ఏర్పడే క్షేత్రంలో శివాలయం వెలుస్తుందని, తద్వారా యముడు, హరుడు లయకారులన్న భయం పోయి ఆరోగ్యప్రదాతలన్న పేరు వస్తుందని వరం ఇస్తాడు. ఆ ప్రకారమే ఇక్కడ ఆలయం వెలిసిందని, గుడిలో దీర్ఘరోగాలు నయమవుతాయని స్థలపురాణంలో పేర్కొనబడింది
విశిష్టత
యనమదుర్రు గ్రామంలో ఉన్న శక్తీశ్వరాలయం విశిష్టమైనది. శీర్షాసనంలో అపురూపమైన భంగిమలో శివుడు శివలింగంపై దర్శనమిస్తాడు. శక్తి పీఠం లో శివుడు, పార్వతీదేవి మరియు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఒకే పానవట్టం మీద ఉండటం ఇక్కడి ప్రత్యేకత. అమ్మవారు మూడు నెలల పసికందు అయిన బాల సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఒడిలో లాలిస్తున్నట్లు కొలువై ఉండడమూ విశేషమే.
శివుడు తలక్రిందులుగా దర్శనం ఇవ్వటానికి ప్రధాన కారణం ...


యమధర్మ రాజు తపస్సు. ఆ సమయంలో శివుడు తలక్రిందులుగా తపస్సుచేస్తూ .. పార్వతీదేవి బాల కుమారస్వామిని ఒడిలో లాలిస్తూ ఉన్నారు. యముడు ఉన్నపళంగా లోకకల్యాణం కోసం ప్రత్యక్షం కావాలని వేడుకుంటాడు. యముడి కోరికను మన్నించి శివుడు, పార్వతీ యదా స్థితిలో ప్రత్యక్షమయ్యారని స్థానిక కధనం. వంద సంవత్సరాల కిందట ఈ దేవాలయం ఒక తవ్వకాలలో బయటపడింది. ఇది త్రేతాయుగం నాటిదని చెబుతారు. ఈ తవ్వాకాలలో శివుని విగ్రహం, 3 నెలల బాల సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ని లాలిస్తున్న అమ్మవారి విగ్రహం బయటపడ్డాయి.
యనమదుర్రు శ్రీ శక్తీశ్వరస్వామి ఆలయం ఎలా చేరుకోవాలి ?
వాయు మార్గం : ఆలయానికి చేరువలో 90 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి దేశీయ విమానాశ్రయం ఉన్నది. ఇక్కడికి నుండి క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి యనమదుర్రు చేరుకోవచ్చు.
రైలు మార్గం : ఆలయానికి సమీపాన 5 కిలోమీటర్ల దూరంలో భీమవరం రైల్వే స్టేషన్ కలదు. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటూరు, బెంగళూరు, చెన్నై, కోల్కత్తా తదితర ప్రాంతాల నుండి వచ్చే రైళ్ళు ఇక్కడ ఆగుతాయి.
రోడ్డు మార్గం : 4 కి.మీ ల దూరంలో ఉన్న భీమవరం సమీప బస్ స్టాండ్. ఇక్కడికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి బస్సులు వస్తుంటాయి.

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment