Monday, 16 November 2020

కార్తీక శుక్ల ద్వితీయ - భాతృ విదియ .

 


 




తోడబుట్టిన సోదరీ సోదరులలో
కుటుంబ ఆప్యాయతలను పెంచే
పర్వదినమే భగినీ హస్త భోజనం.
▫
సోదరీ - సోదరుల ఆప్యాయతలకు ,
అనుబంధాలకు అద్దం పట్టే
ఒక సంప్రదాయమే భగినీ హస్త భోజనం.
తోడబుట్టిన సోదరి గృహంనందు
సోదరి స్వయంగా వడ్డించిన
భోజనం చేయడం వల్ల
సోదరునికి క్షేమంతో పాటుగా ,
సుఖ సంతోషాలు కలుగుతాయని
యమధర్మరాజు శాసనం చేస్తాడు.
మన పురాణాల్లోని
వ్రత ఆచారాలలో భాగంగా ,
యమధర్మరాజుకు
తోడబుట్టిన సోదరి యమునా దేవి.
యమున వివాహమై వెళ్ళాక
తన సోదరుడిని తన ఇంటికి ఎన్నో సార్లు
రమ్మని ఆహ్వానించినా ,
తన వృత్తి ధర్మంలో భాగంగా
ఎక్కువ శ్రమ వల్ల సమయాభావం
లేని కారణంగా యమధర్మరాజు
సోదరి గృహానికి వెళ్ళలేక పోయాడు.
చివరికి సోదరి మీద ఆప్యాయతలతో
సపరివారంగా కార్తీక మాస విదియ రోజున
యమున ఇంటికి వెళ్తాడు.
తన తోడబుట్టిన సోదరుడు వచ్చాడని
యమున సంతోషంగా పిండి వంటలతో
భోజనం పెట్టి స్వయంగా వడ్డించి తృప్తి పరుస్తుంది.
చాలా రోజుల తర్వాత సోదరీ సోదరులు
కలుసుకోవటంతో ఇరువురూ సంతోషపడుతున్న సమయంలో ,
సోదరి ఇంట భోజనం చేయడం వల్ల
తృప్తి కలిగిన యమ ధర్మరాజు
తన సోదరి యమునను ఏదైనా వరాన్ని
కోరుకొమ్మని అడుగగా ,
అపుడు యమున తెలుపుతూ..
సోదరా యమా !
చిన్నతనం నుండి నా సంతోషంలోనూ ,
నా భాధల్లోనూ నీవు పంచుకొని
నన్ను ఎల్లవేళలా ఆశీర్వదిస్తూ ,
నా ఆనందాన్ని కోరుకునే సోదరుడివి.
సోదరుని క్షేమమే సోదరికి వరం కాబట్టి ,
కార్తీక శుధ్ధ విదియనాడు
లోకంలో ఎక్కడైనా సరే ,
తన సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేసిన
సోదరులందరికీ ఆయుఃరారోగ్యాలు
ప్రసాదించమని కోరుకొంటుంది .
సోదరి యమున నిస్వార్ధమైన కోరికకు
యమధర్మరాజు సంతోషించి ,
" అస్యాం నిజ గృహే యమునా !
న భోక్తవ్యమతో బుద్ధి:
యత్నే న భగినీ హస్తాత్ భోక్తవ్యం
పుష్టి వర్ధనం " అని తెలుపుతూ ,
ఇలా వేడుక జరుపుకున్న వారికి
అపమృత్యు దోషం లేకుండా ఉంటుందని ,
తోడబుట్టిన సోదరుణ్ణి ఆదరించే సోదరి
నిత్య సుమంగళిగా , సౌభాగ్యవతిగా
ఉంటుందని వరాలిస్తాడు.
ఇటువంటి వ్రతం ఆచరించని
మహిళలకు వైధవ్యం కలుగుతుందని ,
అదేవిధంగా సోదరి ఆహ్వానించినా వెళ్లని
పురుషులకు నరకలోక ప్రాప్తి ,
అపమృత్యు దోషం కలుగుతుందని
శాసనం చేస్తాడు.
ఏ పురుషులకైనా తోడబుట్టిన సోదరి
లేనప్పుడు యమునా నది వద్ద
పసుపు కుంకుమలు సమర్పించి ,
యమునలో స్నానం చేసినవారికి
అపమృత్యు దోషాలను తొలగుతాయని
తెలుపుతాడు. అనంతరం...
సోదరిని పుట్టింటికి రమ్మని
పసుపు కుంకుమలు , వస్త్ర , వాయనాలు
స్వీకరించేందుకు యమధర్మరాజు
ఆహ్వానం పలుకుతాడు.
ఇలా కార్తీక విదియ రోజున
భాతృ పూజనం సదాచారం కాగలిగి ,
కుటుంబాల్లో ఆప్యాయతలను పెంచి ,
పుట్టింటి మమకారాలు , అండదండలు ,
మహిళల్లో మానసిక పునరుత్తేజానికి ,
పరిపుష్టిని , ఉత్సాహన్ని కలిగించే పర్వదినమే భగినీ హస్త భోజనం.
ఇలా ప్రతీ సంవత్సరం
కార్తీక శుద్ధ విదియ రోజున
తోడబుట్టిన సోదరున్ని ఆహ్వానించి
స్వయంగా భోజనం వడ్డించిన మహిళలు
చిరకాలం పుణ్యస్త్రీలుగా వర్ధిల్లగలరని
యుగయుగాలుగా ఈ వ్రతం ఆచరింపబడుతుంది.
▫
ప్రేగు తెంచుకొన్న బంధాలతో పాటూ ,
ప్రేమలను పెంచుకున్న అనుబంధాలూ శాశ్వతమే.
ప్రతీ సోదరుడు తన తోడబుట్టిన వారి కోసం
ప్రతీ క్షణం ఆత్మీయతలు పంచేందుకు
పరితపిస్తూనే వుంటాడు.
ఒకే తల్లి గర్భాలయం నుండి వెలుబడ్డాక
తోడబుట్టిన వారితో కలిసి సాగించిన
ప్రతీ క్షణాలను మధురానుభూతులుగా
తలుచుకొంటూ ,
తోడబుట్టిన వారి భాద్యతలను పంచుకొనే
ప్రతీ సోదరుడూ తండ్రితో సమానమే .
▫
తోడబుట్టిన సోదరులను
ఆహ్వానించి స్వయంగా వడ్డించి
ప్రేమా ఆప్యాయతలు పంచే
సోదరీమణులకు
భగినీ హస్త భోజన పర్వదిన శుభాకాంక్షలు.



ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371






No comments:

Post a Comment