Friday 20 November 2020

కార్తీక సప్తమి - భాను సప్తమి

 




రేపు భాను సప్తమి... ఈ సప్తమి తిథికి అధిపతి సూర్యుడు, ఆనాడు సూర్యుడు రథాకారంలో కనిపిస్తాడని జ్యోతిషశాస్త్రం చెబుతుంది. సకల జగతికీ చైతన్య కారకుడు సూర్యుడు. నిత్యం దర్శనమిచ్చే సూర్యుడు అందరికీ ప్రత్యక్షదైవం.
సప్తలోక ప్రకాశాయ సప్తసప్త రథాయచ|
సప్తద్వీప ప్రకాశాయ భాస్కరాయ నమోనమ:||
సప్తసంఖ్యకు, సూర్యునికీ అవినాభావ సంబంధం ఉంది. అతని జన్మ తిథి సప్తమి. అతని రథానికి గుర్రాలు ఏడు. తిరిగేది సప్త ద్వీపపర్యంతం. అతని కిరణాల్లోని కాంతి ఏడు రంగుల కలయిక. సూర్యుని నుండే దిక్కులు ఏర్పడుతున్నాయి. సూర్యోదయ దిశను తూర్పుగా తెలుసుకున్న తరువాతనే మిగతా దిశలను నిర్ణయిస్తాం.
అందుకే “దిశాంచ పతయేనమ:” అని శ్రుతి మంత్రం సూర్యుణ్ని వినుతించింది.
ఆరోగ్యప్రదాత ఆదిత్యుడు
సూర్యారాధనకు ముఖ్యమైన కారణం ఇతడు ఆరోగ్య ప్రదాత. సూర్యోడు ఉదయించే సమయానికి రోగ హరణశక్తీ, ఉష:కిరణాల వల్ల కలిగే వికసన శక్తి చేతనే సర్వజగతి చేతనత్వం పొందుతోంది. అందుకే..
సర్వదు:ఖోప శాంతాయ- సర్వ పాపహరాయచ|
సర్వ వ్యాధి వినాశాయ- భాస్కరాయ నమోనమ: అన్నారు.
అన్ని దు:ఖాలను శాంతింప చేసే వాడు, అన్ని పాపాలను హరించే వాడు, అన్ని వ్యాధులను నయంచేసే వాడు (ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు) అయిన భాస్కరునికి బీజాక్షరాలు ఉన్నాయని ఆదిశంకరాచార్యులు తెలి పారు. ప్రతి రోజూ సూర్యోదయం తోనే లేచి స్నానాదులనూ పూర్తి చేసుకునిసంధ్యా వందనంతో పాటుగా సూర్య నమస్కారాలు చేసి అర్ఘ్యప్రదానం ఇవ్వాలని వైదిక వాఙ్మయం చెబుతోంది. సూర్యుడిని ద్వాదశాత్మకుడు అంటారు.
మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్య గర్భ మరచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర అనేవి సూర్యుని 12 రూపాల పేర్లు.
వారాలలో తొలి రోజైన ఆదివారం, తిథుల్లో సప్తమి- సూర్యారాధనకు ప్రశస్తమని చెప్తారు. మన దేశంలో కోణార్క్ వద్దనున్న సూర్యదేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఆ ఆలయంలోని శిల్పకళానైపుణ్యం అలనాటి రాజుల కళాదృష్టిని, శిల్పుల కళాసృష్టిని చాటిచెబుతుంటాయి.
ఈరోజు ఆదిత్య హృదయం, సూర్యాష్టకం ని పఠించ డం చాలా మంచిది.


ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment