Friday 20 November 2020

తుంగభద్రా నది పుష్కరాలు ఈనెల 20వతారీఖు నుండి

 



తుంగభద్రా నది పుష్కరాలు ఈనెల 20వతారీఖు నుండి ప్రారంభమవుచున్న దృష్ట్యా శాస్త్ర విహితంగా పుష్కరాలలో ఎలా వ్యవహిరించాలి, ఎలా స్నాన దానాది సత్క్ర్మలు ఆచరించాలి అన్న దానిపై మన ఋషులు అనేకమైన ధర్మాలను ఉపదేశించారు. అనంతమైన ఆ ధర్మాలలో కొన్నిటినైనా మనము తెలుసుకొని ఆచరిస్తేనే ఆ తీర్థస్నానం సఫలమవుతుంది. అశాస్త్రీయ్యంగా ఆచరించిన ఏ పుణ్యకార్యమైనా సత్ఫలితాన్ని ఇవ్వకపోగా విరుద్ధమైన పలితాలను మనం పొందే అవకాశమున్నది.

తీర్థయాత్రలయందు పాటించవలసాన ధర్మాలు:👍💐
మన ధర్మశాస్త్రాలు తీర్థయాత్రా కాలంలో పాటించవలసిన ధర్మాలను ఋషిప్రోక్తంగా శాస్త్రోక్త విధిగా తెలియజేశాయి. వాటిని పాటించి మనం సనాతన ధర్మ అనుయూయులుగా తరించడం మన కర్తవ్యం.
తీర్థయాత్రలకు బయలుదేరుముందు పఠించవలసిన శ్లోకాలు:
1)
||శ్లోకం||
యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళాం|
తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం!!
2)
ఆపదామప హర్తారం ధాతారం సర్వ సంపదాం!
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం!!
3)
తదేవలగ్నం సుధినం తధైవ తారాబలం చంద్రబలం తధైవ!
విద్యాబలం దైవబలం తధైవ లక్ష్మీపతే తేఁఘ్రియుగం స్మరామి!!
4)
యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పాత్రో ధనుర్ధరః!
తత్ర శ్రీ విజయోర్భూతు ధ్రువానితిర్మతిర్మమ!!
5)
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే! శరణ్యే త్రయంబికే దేవీ నారాయణీ నమోస్తుతే!!
ఈ శ్లోకాలు చదువుకొని తీర్థయాత్రలకు బయలుదేరితే ఎటువంటి విఘ్నాలు కలగకుండా నిర్విఘ్నంగా యాత్ర పరిపూర్ణమవుతుంది. (యాత్రలప్పుడు మాత్రమే కాదు, ప్రతినిత్యము ఉదయం ఇంట్లోనుంచి విద్యా, ఉద్యోగ, వ్యాపారేతర కార్యక్రమాలకై బయలుదేరేటప్పుడు చదువుకొని ఇంటినుండి బయలుదేరినా అంతటా జయం కలుగుతుంది).
మరికొని ధర్మాలు:
*ధర్మమార్గంలో సంపాదించిన ధనంతోనే తీర్థయాత్రలు చేయవలెనని శాస్త్రం నిర్ధేశించింది.
*ఇంటినుండి బయలుదేరునప్పుడు ఇలవేల్పును, కులదేవతలను గ్రామదేవతల అనుమతి తీసుకొని, తల్లిదండ్రుల పెద్దల అనుమతి తీసుకొని బయలుదేరాలి(శ్రీరామచంద్ర స్వామి వారు అరణ్యవాసానికి బయలుదేరునప్పుడు కూడా అయోధ్యానగరి దేవత అనుమతి తీసుకొనే బయలుదేరి సనాతన ధర్మాచరణ విషయంలో ఆచరించవలసిన ఆదర్శాన్ని మనకు చూపించారు.
*తీర్థయాత్రలయందు అసత్య భాషణము, దంబ భాషణము చేయరాదు. బ్రహ్మచర్యవ్రతులై క్షేత్రాలను సేవించాలి.
*యాత్రలకు బయలుదేరి వెళ్ళి మరల ఇంటికి తిరిగివచ్చునంతవరకును కూడా తలనీలాలు సమర్పించే విషయంలో తప్ప, అన్యప్రదేశాలలో క్షౌరాది కర్మలు చేసుకొనరాదు.
*తీర్థాలయందు సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి, అవకాశం లేని సమయంలో భగవన్నామాన్ని తలుస్తూ చేయవలెను.
*పుష్కరిణులయందును, నదులయందును, సరోవరాలయందును, సముద్రాలయందును, సబ్బులు, షాంపూలు ఉపయోగించి స్నానమాచరించడం మహాపరాధం. అంతేకాక వాటియందు మల,మూత్ర,వీర్య విసర్జనం చేయడం చాలా పెద్ద దోషం.
*అంతేకాకుండా చీరలు-జాకెట్లు, పంచెలు-ఉత్తరీయాలు వంటివాటిని నదీదేవతలకు సమర్పించదలుచుకొంటే మానసికంగా నదీమతల్లికి అర్పిస్తూ దగ్గరలోని ముత్తయిదువులకో, బ్రాహ్మణోత్తములకో, లేక అభాగ్యులకో ఇవ్వడం వలన పుణ్యము మరియు పురుషార్థము సిద్ధిస్తాయి.
*స్త్రీలు జడముడి విడతీసుకొని క్రిందభాగమున ముడి వేసుకొని మాత్రమే స్నానం చేయాలి. జుట్టు విరబూసుకొని నిత్యజీవితంలోనే ఉండరాదు. అటువంటిది పుణ్యతీర్థాలలో, క్షేత్రాలలో అసలు ఉండకూడదు. దంపతులు వెళ్ళినప్పుడు ఇరువురు కూడా ఉత్తరీయ్యానికి చీరకు కలిపి ముడివేసుకొని సంకల్ప స్నానం చేయాలి. స్త్రీలు ముఖానికి, పాదాలకు పసుపు రాసుకొని స్నానం చేయాలి.
*వీలయినంతవరకు అల్ప భాషణము చేస్తూ, మనస్సునందు ఎల్లప్పుడు భగవన్నామము జపిస్తూ ఉండాలి.
*తీర్థస్థాలాలలోను, క్షేత్రాలలోను మనం ఆచరించిన జప, తప, స్నాన, హోమ, అనుష్ఠాన, ధర్మాచరణ, దానాదుల పుణ్యము ఒకటికి వందలరెట్లు, వేలరెట్లు కలుగుతుంది. అదేవిధంగా మనం ఆచరించిన ఏ పాపమైనా కూడా అంతే పలితము కలుగుతుంది. కావున జాగరూకులమై వర్తించాలి.
*పుణ్య తీర్థాలయందు గతించిన తల్లిదండ్రులకు పెద్దలకు పిండప్రధాన, తర్పణాదులు తప్పకుండా చేయవలెను. వారి ఆశీస్సులే మనకు మన కుటుంబాలకీ శ్రీరామరక్ష.
కావున మన ధర్మశాస్త్రం చెప్పిన విధంగా నడుచుకొని మనం సనాతన ధర్మానికి వారసులమని గర్వంగా చాటుదాము.
మన పుణ్య క్షేత్రాలను, తీర్థాలను కాపాడుకొందాం. మన భావితరాలకు కూడా ఆ క్షేత్రాలు, తీర్థాలు దర్శించి తరించాలి కదా! వాటిని పరిరక్షించుకొందాము.
💧 జిల్లా వ్యాప్తంగా 23 పుష్కర ఘాట్లు ఏర్పాటు ....
💧 కర్నూలు అసెంబ్లీ నియోజవర్గం పుష్కర ఘాట్లు....
1. మాసామసీద్ ( పంప్ హౌస్) పుష్కర్ ఘాట్ , కర్నూలు టౌన్ .
2. సంకల్‌భాగ్‌ పుష్కర్ ఘాట్ . కర్నూలు టౌన్ .
3. నాగసాయి ఆలయం పుష్కర్ ఘాట్, కోత్తపేట కర్నూలు టౌన్.
4. రాంబోట్ల ఆలయం పుష్కర్ ఘాట్, కర్నూల్ టౌన్.
5. రాఘవేంద్ర మఠం పుష్కర్ ఘాట్, కర్నూలు టౌన్.
6. సాయిబాబా ఆలయం పుష్కర్ ఘాట్, కర్నూలు టౌన్.
7. నగరేశ్వర స్వామి పుష్కర్ ఘాట్, కర్నూల్ టౌన్.
💧 కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం పుష్కర ఘాట్లు..
8. గంగమ్మ పుష్కర్ ఘాట్, గుండ్రేవుల గ్రామం.
9 . సుంకేసుల బ్యారేజ్ పుష్కర్ ఘాట్, సుంకేశుల గ్రామం.
10. గంగమ్మ ఆలయం పుష్కర్ ఘాట్ పంచలింగల గ్రామం.
11. మునగాలపాడు గ్రామం పుష్కర్ ఘాట్ (రోడ్ బ్రిడ్జ్ డౌన్ స్ట్రీమ్)
12. గోందిపర్ల శివాలయం దగ్గర పుష్కర్ ఘాట్.
మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం పుష్కర ఘాట్లు
13. NAP పంప్ హౌస్ సమీపంలో పుష్కర ఘాట్ మంత్రాలయం మఠం.
14. సంత మార్కెట్ దగ్గర పుష్కర మాట్ మంత్రాలయం మఠం.
15. వినాయక పుష్కర ఘాట్ మంత్రాలయం
16. రామలింగేశ్వర స్వామి ఆలయం పుష్కర్ ఘాట్. రాంపురం గ్రామం, మంత్రాలయం
17. రామలింగేశ్వర స్వామి ఆలయం పుష్కర్ ఘాట్ . మైలిగనూర్ గ్రామం, కౌతాళం .
18. రైల్వే బ్రిడ్జి సమీపంలో పుష్కర్ ఘాట్, కాచపురం గ్రామం , మంత్రాలయం.
19. VVIP - I పుష్కర్ ఘాట్,(మఠం వెనుక వైపు) రాఘవేంద్ర స్వామి ఆలయం, మంత్రాలయం.
20. VVIP - II పుష్కర్ ఘాట్ , (మఠం వెనుక వైపు) రాఘవేంద్ర స్వామి ఆలయం, మంత్రాలయం.
💧 ఎమ్మిగనూర్ అసెంబ్లీ నియోజకవర్గం పుష్కర ఘాట్లు.
21. నాగులదిన్నె వంతెన సమీపంలో పుష్కర్ ఘాట్, నాగులదిన్నె గ్రామం, నందవరం మండలం.
22. రామలింగేశ్వర ఆలయం వద్ద పుష్కర్ ఘాట్, గురుజాల గ్రామం, నందవరం మండలం.
💧 నందికోట్కూర్ అసెంబ్లీ నియోజకవర్గం పుష్కర ఘాట్లు.
23 . సంగమేశ్వరం వద్ద పుష్కర్‌ఘాట్ - కోత్తపల్లి .
💧 తుంగభద్ర పుష్కరాల సంధర్బంగా కర్నూలు పట్టణంలో పుష్కర ఘాట్ల వద్ద ఏర్పాటు చేయబడిన పార్కింగ్ స్ధలాలు.....
1) పంప్ హౌస్ పుష్కర్ ఘాట్ కు వెళ్ళు వారు.
సంజీవని హాస్పిటల్ ప్రక్కన మరియు వసంత రెసిడెన్సి ప్రక్కన పొలాలలో వాహనాలు పార్కింగ్ చేయాలి.
VIP ల వాహనాలను ఘాట్ కు కుడి ప్రక్కన వాహనాలను పార్కింగ్ చేయాలి.
2) మునగాలపాడు దగ్గర పుష్కర ఘాట్ కు వెళ్ళేవారు...
తిప్పమ్మ కొట్టం దగ్గర పార్కింగ్ చేయాలి.
3) నాగసాయి టెంపుల్ పుష్కర ఘాట్, సాయిబాబా టెంపుల్ పుష్కర ఘాట్లకు వెళ్ళేవారు....
ఒల్డ్ సాయిబాబా టాకీసు దగ్గర వాహనాలను పార్గింగ్ చేయాలి.
4) సంకల్ భాగ్ పుష్కర ఘాట్ కు వెళ్ళే వారు...
STBC కళాశాలలో వావాహనాలను పార్కింగ్ చేయాలి.
5) నగరేశ్వర పుష్కర ఘాట్ , రాఘవేంధ్ర మఠం ఘాట్, రాంబోట్ల పుష్కర ఘాట్లకు వెళ్ళేవారు.
మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వాహనాలను పార్కింగ్ చేయవలెను.
రాంబోట్ల పుష్కర ఘాట్ కు వచ్చే టూ వీలర్స్ లను జమ్మిచెట్టు వద్ద పార్కింగ్ చేయవలెను.

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment