అన్నవరం వీర వెంకట సత్యనారాయణస్వామి త్రిమూర్తి రూపం. భక్త సులభుడిగా, కోర్కెలు నెరవేర్చే సత్యదేవుడిగా ఆయనపై అందరికీ అచంచల విశ్వాసం. ఏదైనా పని తలపెట్టినప్పుడు సత్యనారాయణ వ్రతం ఆచరిస్తే అనితర సాధ్యమైన మనోబలం సొంతమవుతుందని చెబుతారు కార్తికమాసంలో త్రిమూర్తుల అభేదానుభవాన్నిచ్చే మీసాలరాయుని దర్శనం చాలా మంచిదని నమ్మకం. అన్నవరం రత్నగిరి ప్రదక్షిణ అత్యంత ప్రసిద్ధమైంది. అశేష భక్తకోటి కార్తిక పౌర్ణమినాడు గిరి ప్రదక్షిణ చేసి తరిస్తుంది. ఇలా చేయడం వల్ల కొండపై వెలసిన దేవతామూర్తుల శక్తిని పొందగలుగుతామని చెబుతారు. కొండంతా నిండిన అనేక ఔషధ వృక్షాలు సాధకుడికి ఆరోగ్యభాగ్యాన్నీ ఇస్తాయి. శారీరక వ్యాయామంతో పాటు మానసిక ఉల్లాసం, శక్తి, జ్ఞానం, ఆనందం ప్రదక్షిణతో లభిస్తాయి. అన్నవరం గిరి ప్రదక్షిణ అశ్వమేధ]యాగ ఫలాన్నిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.
మేరువు కుమారులైన భద్రుడు, రత్నాకరుడు మహావిష్ణువు అనుగ్రహంతో భద్రగిరి, రత్నగిరిగా మారినట్లు పురాణ కథనం. శ్రీమన్నారాయణుడు భద్రగిరిపై శ్రీరామచంద్రుడిగా, రత్నగిరిపై సత్యనారాయణ స్వామిగా అవతరించినట్లు చెబుతారు. సత్యదేవుని కొలువు సర్వదేవతా నిలయం. దిగువన స్వామి యంత్రం ఉంది. నలు దిక్కులా పంచాయతన దేవతలు కొలువుదీరారు. ఆగ్నేయాన గణపతి, నైరుతిలో సూర్యభగవానుడు, వాయువ్య దిశలో బాలాత్రిపుర సుందరీ అమ్మవారు, ఈశాన్యాన ఈశ్వరుడు కొలువై ఉన్నారు. ఈ నేపథ్యంలో పంపాతీరాన సత్యదేవుని గిరి ప్రదక్షిణం త్రిమూర్తులకు చేసే ప్రదక్షిణగా చెబుతారు. సాక్షాత్తు ఆత్మ ప్రదక్షిణేనని భావిస్తారు.
రత్నగిరి తొలి పావంచా నుంచి రత్నగిరి, సత్యగిరి చుడుతూ పంపా తీరం మీదుగా తొలి పావంచా వద్ద ముగిస్తే అదే ప్రదక్షిణ అవుతుంది.ఈ గిరి ప్రదక్షిణలో కొండపై ఉన్న ఉప ఆలయాల్లో కొలువైన క్షేత్ర రక్షకులు వనదుర్గ, కనకదుర్గ అమ్మవార్లు, క్షేత్రపాలకులు సీతారాములను ప్రదక్షిణం చేసిన ఆనందమూ భక్తులకు కలుగుతుంది. పావన పంపా సరోవరాన్ని, శిరసెత్తి చూసే గిరులు తరుల సౌందర్యాన్ని ఆస్వాదించినట్టు అవుతుంది. భూప్రదక్షిణ చేసినంత తృప్తి కలుగుతుంది. ముమ్మూర్తుల మేళవింపుగా దర్శనమిచ్చే రమా సత్యనారాయణుని స్వరూపం, ప్రదక్షిణ చేసిన సాధకుడిలో ఆత్మనిష్ఠను పెంపొందిస్తుంది. గిరి చుట్టూ తిరిగే హృదయం.. సత్యదేవుని నిలయం అవుతుంది!
.....................
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల
కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
facebook group :
(20+) Vidhatha Astro Numerology | Facebook
YouTube
Printerest
Twitter
Instagram
Blog
whatsapp group
Follow this link to join my WhatsApp group:
టెలిగ్రామ్
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
............
No comments:
Post a Comment