Thursday 19 November 2020

కార్తీక శుద్ధ పంచమి- పంచమి తీర్థం.

 




తిరుచానూరు పుణ్యక్షేత్రంలోని
పద్మ సరోవరం నందు
శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారి
ఆవిర్భావ మహోత్సవ దినోత్సవం.

శ్రీ వైకుంఠంలో
స్వయనా తన తండ్రి భృగు మహర్షి విచ్చేసి
తన నివాసస్థానమైన శ్రీ మహావిష్ణువు యొక్క
వక్షస్థలంపై తన్నడం జరిగినా ,
తన భర్త భృగువుకు సపర్యలు చేయడంతో
అది లోకకళ్యాణం కొరకే అని గుర్తించని
శ్రీ మహాలక్ష్మి దేవి భూలోకానికి విచ్చేసి
కరవీరపురం నందు స్థిరపడుతుంది.
ఇది తెలుసుకొన్న శ్రీ మహావిష్ణువు
భూలోకానికి విచ్చేసి 12 సంవత్సరాల పాటు
తపస్సు చేసిన ఫలితంగా ...
తిరుచానూరు క్షేత్రంలో
సువర్ణ ముఖీ నదీ తీరంలో
పద్మ సరస్సులో అనేక పద్మాల మధ్యలో
సహస్రాధిక సువర్ణ కమలం నుండి
కార్తీక శుద్ధ పంచమి ,
ఉత్తరాషాఢ నక్షత్రం పుణ్య తిథి రోజున
ఆవిర్భావం జరుగుతుంది.
ఈరోజే తిరుమల నుండి శ్రీనివాసుడు
అమ్మవారిని తిరిగి చేరుకున్న రోజు ఇదే.
ఈనాడే శ్రీ మహావిష్ణువు ,
శ్రీ మహాలక్ష్మి దేవి కలిసిన రోజు సందర్భంగా...
తన ధర్మపత్నికి చేనేత పట్టు వస్త్రాలను
తీసుకొని వచ్చి ప్రేమతో ఇచ్చిన రోజు ఇదే.
ఇరువురు కలయికతో పరమ కరుణా దృష్టితో
పారవశ్యంతో ఉత్సాహంగా వుండే రోజు ఇదే.
అనాదిగా పద్మశాలీ బహుత్తములందరూ
తన పుట్టింటి ఆడపడుచుయైన
శ్రీ పద్మావతీ దేవి అమ్మవారికి
యావత్ దేశవ్యాప్తంగా
ఆడపడుచు లాంఛనాలు జరిపేది ఈనాడే.
కాలక్రమేణా ఆలయ సౌకర్యం కొరకు
గజ వాహన సేవల్లో గానీ ,
సింహ వాహన సేవల్లో గానీ మార్పు చేసి
పద్మశాలీయులకు పుట్టింటి లాంఛనాల
ఏర్పాట్లు ప్రతీ యేటా చేస్తున్నారు.
ఈరోజు అమ్మవారిని సాయం సంధ్యవేళలో
అష్టోత్తర నామావళితో పాటూ ,
శ్రీ సూక్త పారాయణం చేయడం వల్ల
శ్రీ మహాలక్ష్మి దేవి సంతృప్తిరాలై
పతీ సమేతంగా వరాలను ఇచ్చే
పరమ పావనమైన రోజే
ఈనాటి కార్తీక శుద్ధ పంచమి.
ఈనాటి నుండి అమ్మవారు వుండే చోటే
అయ్యవారు వుంటున్నారని
శ్రీవారి బ్రహ్మోత్సవాలను కూడా
తిరుచానూరులోనే నిర్వహించేవారని
చరిత్ర చెబుతోంది.
అంతే కాకుండా... తిరుమల గిరులన్నీ
అరణ్యంతో నిండి ఉంటూ ,
క్రూరమృగాలు అధికంగా వున్న కారణంగా
ఎటువంటి వసతులు లేకపోవడంతో
శ్రీవారి బ్రహ్మోత్సవాలను
తిరుచానూరులో నిర్వహించే వారని తెలుస్తోంది.
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి
ఆలయానికి ఎదురుగా
అప్పట్లో వరదరాజస్వామి ఆలయం ఉండేది.
ఆ ఆలయంలోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలను
నిర్వహించేవారని, అయితే ముందుగా
తిరుమల ఆలయంలో ధ్వజారోహణం,
ధ్వజావరోహణం మాత్రమే చేసి,
వాహన సేవలన్నీ ఇక్కడే నిర్వహించేవారు.
అయితే వెయ్యేళ్ల కిందట
శ్రీమద్ భగవద్రామానుజాచార్యులవారు
తిరుమల క్షేత్రాన్ని శ్రీవారిని దర్శించుకుని,
శ్రీవారి బ్రహ్మోత్సవాలను
తిరుమల క్షేత్రంలోనే జరిపించాలని చెప్పడంతో
ఆనాటి నుంచి తిరుమలలోనే
బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు
శాసనాలు తెలుపుతున్నాయి.
ఆనాటి నుండి తిరుమల విచ్చేయు భక్తులు
తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తరువాత
తిరుచానూరు పుణ్య క్షేత్రంలో కొలువై ఉన్న
శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే
ఆ యాత్రకు ఫలం లభించదని ప్రతీతి
ఈనాటి కార్తిక పంచమీ తీర్థం విశిష్టతలో భాగంగా , కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు
పద్మ సరోవరం(పుష్కరిణి)లో
పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా
పంచమీతీర్థం (చక్రస్నానం) నిర్వహిస్తారు.
పంచమీతీర్థం రోజున పుష్కరిణిలో
నిర్వహించే చక్రస్నానం ఆచరించేందుకు
లక్షలాది మంది భక్తులు తరలివస్తారు.
చక్రస్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగి
సర్వ శుభాలు కలుగుతాయని అమ్మవారి ఆజ్ఞ.
ఈనాడే తన పట్టపురాణి పద్మావతి దేవికి
నిర్వహించే పవిత్రమైన చక్రస్నానానికి
తిరుమల నుంచి శ్రీనివాసుడు
చేనేత పట్టు వస్త్రాలను , సుమంగళి సారెను
స్వయంగా తీసుకొని రావడం
ఆనవాయితీగా వస్తోంది.

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371





No comments:

Post a Comment