ఐశ్వర్యాభివృద్ధి కోసం కుబేర పూజను చేస్తే ఐశ్వర్యం, అభివృద్ధి ఒకేసారి దక్కుతుంది. ధనానికి మరో అధిపతి కుబేరుడు. ఉత్తరం దిక్కు వైపు ప్రతినిధి అయిన కుబేరుడు భూ మండలంలోని ఆగర్భంలో ఉన్న సమస్త నిధి నిక్షేపాలకూ యజమానుడు. పురాణ చరిత్రలలో తెలిపినట్టు అతి శ్రీమంతుడు అనిపించుకున్న వెంకటేశ్వరస్వామి కూడా కుబేరుని వద్ద తీసుకొన్న అప్పుకు వడ్డీ మాత్రమే చెల్లిస్తూ ఉన్నాడు.
అయితే లక్ష్మిదేవి పూజను దేశమంతటా వివిధ రకాలుగా ఆచరిస్తున్నారు. లక్ష్మి కుబేర పూజను ఒకేసారి కలిపి నెరవేర్చినపుడు వారిరువురి నుంచి దొరికే ఆశీర్వాదం, శ్రేయస్సు, పేదరికం, దారిద్య్రాలు దూరం అవుతాయి.
లక్ష్మి కుబేరుల ఆరాధనను సులభంగా ఆచరించడానికి సామాన్య మంత్రాలను ఈ కింద ఇవ్వడమైంది. కుబేర, లక్ష్మీ మంత్రాలు వేరు వేరుగా దొరుకుతాయి. వాటిని పూజా గదిలో దేవుని ముందు ఎర్ర రంగులోని వస్త్రంపై ఉంచి దీప-ధూపాలతో పూజించాలి. ఓపికను బట్టి సాధ్యమైతే నిత్య నైవేద్యం కోసం ఏదైనా తీపి లేదా, తేనె, లేదా నెయ్యి చక్కెరను సమర్పించవచ్చు. శంఖం దొరికితే దాన్ని దేవుని పీఠం ముందు ఉంచి షోడ షోపచారాలతో పూజించడంవల్ల అష్టై శ్వర్యాలు సిద్ధించును.
లక్ష్మీ మంత్రం:
ఓం శ్రీ హ్రీం క్రీం లక్ష్మీ దేవ్యై నమ:
కుబేర మంత్రం:
యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనాధిపతయే ధనధాన్య“సమృద్ధియే మేహి దాపయ స్వాహా
పై రెండు మంత్రాలనూ రోజుకు కనీసం 108 సార్లు చొప్పున 9 నెలలు జపిస్తే సిరుల పంట పండుతుంది.
మూల మంత్రం :
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరదవరద సర్వజనమే వశమానాయ స్వాహాః
ee యంత్రంను అర్చించు వారు యంత్రమును రాగి రేకుపై కాని కాగితంపై కాని రాసి పటము కట్టించి యథా శక్తిగా ఉదయాస్తమయములందు షోడశోపచార పూజలు చేయుచున్న అన్ని విఘ్నములు తొలగి విజయము ఐశ్వర్య వృద్ధి సంతతి గౌరవమును కూడా పొందగలరు.ధ్యానం, మూల మంత్రంఅనునిత్యం అనుసరించు సాధకుడు పొందలేని ఫలితమే లేదు.
విధి విధానంగా తయారు చేసిన లక్ష్మి కుబేర యంత్రం కొరకు సంప్రదించగలరు.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
plz like , share , follow and subscribe
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
No comments:
Post a Comment