సంతకం చేసే విధానాన్ని బట్టి కలిగే శుభాశుభ ఫలితాలు
1) సంతకం ఇనిషియల్ తో వేయడం మంచిది. ఇనిషియల్ కు , పేరుకు మధ్య బిందువు పెట్టరాదు. సంతకాన్ని పైకి వెళ్లే విధంగా పెట్టాలి.
2) పైకి వెళ్లే విధంగా సంతకం చేయడం ద్వారా వృత్తిలో వృద్ధి కన్పిస్తుంది. చేపట్టిన ప్రతిపనిలోను విజయం లభిస్తుంది. మనస్సు సంతోషిస్తుంది. ఎటువంటి కార్యాన్నైనా ముగించగల మనస్సుకలవారై వుంటారు. దాంపత్యజీవనం సుఖంగా సాగుతుంది. శరీరంలో దృధత్వం, ముఖంలో వర్చస్సు కలుగుతుంది. పనిలో విజయం లభిస్తుంది.
3) నిచ్చెనలా సంతకం కుదరడం వల్ల క్రమంగా జీవితంలో ప్రగతి కలుగుతుంది. ఏ సమయంలోను పతనం సంభవించదు. పైకి వెళ్లిన సంతకం 4 లేదా 5 సెం. లు వరకూ వుండాలి. ఆ విధంగా సంతకం పెట్టడం వల్ల సమగ్ర ఫలితం వుంటుంది.
4) సరళరేఖలో (ఒకే వరుసలో) పెట్టే సంతకం వల్ల అభివృద్ధి వుండదు. హెచ్చు తగ్గులు సుఖ దుఃఖాలు సమంగా వుంటూ మధ్యమ ఫలితాలతో జీవనం గడుస్తుంది. అంటే మంచిచెడ్డలు సమపాళ్ళలో వుంటాయి.
5) కిందకి వెళ్లే విధంగా సంతకం చేస్తే మిక్కిలి దురదృష్టంతో కూడిన ఫలితాలు వుంటాయి. జీవితంలో ఓటమి చెంది విరక్తి చెందిన వారి సంతకాలను పరిశీలిస్తే ఈ వాస్తవం బోధపడుతుంది. పై భాగంలో ప్రారంభమై క్రమంగా కిందకి వెళ్ళే విధంగా సంతకం చెయ్యడం మంచిది కాదు.
పై విధంగా సంతకం చేస్తే నిందలు, కేసులు, ఖైదు, మానసిక రోగాలు, వృత్తిలో స్తంభన మొదలైన సమస్యలు కలుగుతూ ఆ మనిషిని పూర్తిగా పతనం లోకి నెడుతుంది.
పైకి వెళ్ళే సంతకం వల్ల అదృష్టం, కిందికి వెళ్ళే సంతకం వల్ల దురదృష్టం నేరుగా వెళ్లే సంతకం వల్ల మధ్యమఫలితాలు వుంటాయి. సంతకాన్ని మార్చేటప్పడు మానసికంగాను, శారీరకంగాను మార్పులు కన్పిస్తాయి. మంత్ర శాస్త్రంలో ప్రపంచంలోని అన్ని రంగాలలోను విజయం సాధించి పెట్టే సంజ్ఞలు పేర్కొన బడ్డాయి. పాప, పుణ్యాలు ప్రాతిపదికగా వీటిని సంతకం ద్వారా సంజ్ఞలుగా సూచించి విజయం సాధించవచ్చు. మంత్ర శక్తి గల అక్షరాలకు అనుగుణమైన సంఖ్యను నిర్ణయించి నామసంఖ్య శాస్ర పద్ధతిలో సంతకం చేస్తూ వుంటే విజయం తప్పక లభ్యమవుతుంది.
(ఒకటి సంఖ్య - అదృష్ట సంతకము)
1,10,19, 28 తేదిలలో జన్మించిన వారికి 1 అదృష్ట సంఖ్య అగును. ఈ జాతకులు సంతకం పెట్టునప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ విధంగా ఉన్నాయి. వీరి సంతకం ఎప్పుడు కూడా 100 నుండి 190 ల వాలులో ఉండాలి. సంతకంలోని మొదటి అక్షరం పెద్దగా ఉండాలి. సంతకం పొడవు 4 సెం.మీ నుండి 5.05 సెం.మీ లోపు ఉండాలి. ఈ విధమైన సంతకం అలవర్చుకున్న జాతకులు జీవితంలో అదృష్టాన్ని పొంది భోగభాగ్యాలను అనుభవిస్తారు. ఈ జాతకులకు పేరులో A,I,J, Q,Y వంటి అక్షరాలు ఉండునట్లు చూసుకోవాలి.
-----------------------------------------------------------------------
(రెండు సంఖ్య - అదృష్ట సంతకము)
2, 11, 20, 29 తేదీలలో జన్మించిన జాతకులు సంతకం చేసేటప్పుడు B, K.R వంటి అక్షరాలను పేరులో మొదటగాని, మధ్యలోగాని, చివరలోగాని ఉండేటట్లు చూసుకోవాలి. సంతకం కనీసం 60 నుండి 150 వాలులో పైపైకి ఎగబాకాలి. సంతకం చివరలో నెలవంక, పున్నమి చంద్రుడు కాంతి కిరణాల వంటి చిహ్నాల వంటివి పెట్టాలి. సంతకం పొడవు 4 సెం.మీ నుండి 6 సెం.మీ మధ్యలో ఉండాలి. కనీసం 4 సెం.మీ తక్కువ గాకుండా మరియు 6 సెం.మీ ఎక్కువ ఉండకుండా ఉండాలి.

(మూడు సంఖ్య - అదృష్ట సంతకము)
3,12, 21, 30 తేదిలలో పుట్టిన జాతకులు అదృష్టం కొరకు సంతకం పెట్టునప్పుడు C.G.L.S అను అక్షరాలు ప్రారంభంలో ఉండునట్లు జాగ్రత్త పడాలి. సంతకం 3 సెం.మీ మించిన పొడవుతో పైపైకి సాగాలి. సంతకంలో షట్కోణం (ఆరు కోణాలున్న చంద్రుడు), కూడిక, గుణింతం వంటి గుర్తులను కలిగి ఉండుట శ్రేయస్కరం. సంతకంలో ప్రారంభాక్షరం కంటె చివరి అక్షరం ఉన్నతంగా ఉండాలి. ఈ జాతకుల సంతకంలో ఎట్టి పరిస్థితులలోను తీసివేత, తోక, సమానం, భాగాహారం వంటి గుర్తులు కన్పిస్తే అప్పలపాలు చేయును.

(నాలుగు సంఖ్య - అదృష్ట సంతకము)
4,13, 22, 31 తేదిలలో జన్మించిన జాతకులు అదృష్టం కొరకు సంతకంలోని మొదటి అక్షరం కుడివైపుకు వంచి వాలు గీత నుంచి ఏటవాలుగా రాయాలి. ఆపైన క్రమంగా పైపైకి వెళ్ళాలి. సంతకం 4 సెం.మీ నుండి 15 సెం.మీ పొడవుతో ఉండాలి. సగం సంతకం క్రింద ఒక చోట ఒక గీత గీయాలి. ఇటువంటి గీత వలన జాతకులకు దుష్ట గ్రహపీడల ప్రభావం అస్సలుండదు. వీరి పేరులో D,M, T వంటి అక్షరాలు ఉండునట్లు చూసుకోవాలి.

(ఐదు సంఖ్య - అదృష్ట సంతకము)
5, 14, 23 తేదీలలో జన్మించిన జాతకులు సంతకంలోని మొదటి అక్షరాన్ని గుండ్రంగా చుట్టి ఇనిషియల్కు, పేరుకు మధ్య ఖాళీ రాకుండా పైవైపుకు వెళ్ళే విధంగా సంతకం చెయ్యాలి. సంతకం యొక్క పొడవు 5 సెం.మీ ఉండాలి. వీరి సంతకంలో E,H,N,X వంటి అక్షరాలు వస్తే కుడివైపు వంపు వచ్చే విధంగా రాయాలి. సంతకం క్రిందభాగంలో ఎలాంటి గీతలు లేదా చుక్కలు ఉండరాదు. ఈ జాతకుల సంతకంలో రెండు మూడు పేర్లుంటే చేతిని తీయకుండా ఒకేసారి కలిపి సంతకం రాయాలి. వీరి సంతకంలో ఢమరుకం, రంపం, నక్షత్రం, గుర్రపుస్వారీ వంటి చిహ్నాలు ఉన్నటైతే మరింత శుభకరమైన ఫలితాలు కలుగును.

(ఆరు సంఖ్య-అదృష్ట సంతకము )
6, 15, 24 తేదిలలో జన్మించిన జాతకుల జాతకుల పేరులో U, V,W వంటి అక్షరాలు ఉన్నటైతే వాటిని పెద్దవిగా చేసి రాయాలి. A,I,J.F,LC వంటి అక్షరాలను కుడివైపుకు వంచి సంతకం చెయ్యాలి. వీరి యొక్కసంతకం 4.05 సెం.మీ నుండి 6.00 సెం.మీ వరకు పొడవుండాలి. G, J, Y వంటి సంతకం చివరలో ఉంటే వాటిని కింది వైపుకు వంచి మరల పైవైపుకు కొనసాగించాలి. సంతకం చివర్లో బిందువు ఉంటే అదృష్టం. సంతకం కింద చిన్న గీత ఉంటే దురదృష్టకరం.

( ఏడు సంఖ్య - అదృష్ట సంతకము )
7, 16, 25 తేదిలలో పుట్టిన జాతకులు సంతకంలో ఇనిషియల్ను కుడివైపుకు వంచి 6 సెం.మీ నుండి 15 సెం.మీ వాలుగా పైకి వెళ్ళే విధంగా ఉండాలి. వీరి సంతకంలో G, J,Y వంటి అక్షరాలు ఉన్నటైతే మొదట క్రిందికి పోనిచ్చి పిమ్మట పైకి రాయాలి. నిచ్చెనలా వాలు కోణంలో సంతకం పెట్టాలి. సంతకం పొడవు 4 సెం.మీ నుండి 6 సెం.మీ పొడవుతో ఉండాలి. సంతకం క్రింద గీతలు పెట్టినట్టైతే దురదృష్టం కలుగును. సంతకం మొదట్లో కంటె చివరలో ఉన్నతంగా ఉండాలి. వీరి పేరులో O,Z వంటి అక్షరాలు వుండునట్లు చూసుకోవాలి.

(ఎనిమిది సంఖ్య - అదృష్ట సంతకము)
8, 17, 26 తేదిలలో పుట్టిన జాతకుల సంతకంలో P.F వంటి అక్షరాలు ఉన్నటైతే వాటిని పైకి లేపిరాయాలి. సంతకం 0o 19° వాలులో ఉండాలి. సంతకం మధ్యలో మాత్రం 14° వాలు కోణం ఉండవలెను. వీరి సంతకంలో A,I,J వంటి అక్షరాలని పైవైపుగా రాయాలి. 'Y' నిమాత్రం కొంచెం క్రిందకు రాసి, ఆపైన పైకి తీసుకెళ్ళాలి. సంతకం చివర్లో బిందువులు లేదా గీతలు ఉండకూడదు. పనులలో ఆటంకాలు కలుగును.

(తొమ్మిది సంఖ్యా-అృష్ట సంతకము)
9, 18, 27 తేదిలలో పుట్టిన వారి సంతకంలో ఒకటి కన్నా ఎక్కువ పేర్లు ఉన్నట్టైతే వాటిని విడివిడిగా రాయాలి. విడిగా పేర్లను రాయటం వీలుకాకపోతే, ఇనిషియల్తో కలిపి ఒకే వరుసలో పైకి వెళ్ళే విధంగా సంతకం పెట్టాలి. సంతకం యొక్క పొడవు 3 సెం.మీ నుండి 5.6 సెం.మీ వరకు ఉండాలి. సంతకం 6° నుండి 15° వాలు కోణంలో ఉండునట్లు పెట్టవలెను. సంతకాన్ని ఎప్పుడు కూడా ఎడమనుండి కుడికి కిందివైపుకువాలుగా వెళ్ళే విధంగా పెట్టకూడదు. దారిద్ర్యం చుట్టు కొనును.
ఇది కేవలం ప్రాధమిక పరిజ్ఞానం మాత్రమే, వ్యక్తి యొక్క జన్మ సంఖ్య, విధి సంఖ్య ని బట్టి నియమాలు మారుతాయి, సంపూర్ణ శాస్త్రపరిజ్ఞానంతో చక్కటి అక్షరాలు, ఆకారాలతో చేసే సంతకం వ్యక్తికి అదృష్టాన్నిస్తుంది.
contact for signature setting:9000123129

No comments:
Post a Comment