Thursday, 1 October 2020

అక్టోబర్ 2020 ద్వాదశ రాశుల వారికి మాసఫలాలు



మేషరాశి (Aries) వారికి :- 

ఈ నెలలో ఆశాజనకంగా ఉంటుంది, మానసిక ఒత్తిడిలు, చికాకులు తగ్గును. అధికారులతో సామరస్యంగా ఉండగలరు. సంతృప్తికర పరిస్థితులు ఏర్పడును.స్నేహబంధాలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యూహాత్మకంగా పనులను చక్కబెట్టుకుంటారు. వ్యాపారములు వృద్ధి చెందును. ఆశించిన ధనాదాయం లభించును. కోర్టు కేసులు అనుకూలంగా ముగియును. నూతన మిత్ర వర్గం ఏర్పడును. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొను అవకాశములు అధికం. పారమార్ధిక చింతన అధికమగును. ఉద్యోగ జీవులకు విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవలసిన సమయం ఏర్పడును. ప్రభుత్వ సంబంధ ఉద్యోగం ఆశిస్తున్న వారికి ఈ మాసంలో ద్వితీయ లేదా తృతీయ వారాలలో కష్టాలు తీరును. విద్యార్ధులకు చక్కని భవిష్యత్ లభించును. ఈ మాసంలో 23, 24 తేదీలలో ప్రయనములందు జాగ్రత్తగా ఉండవలెను. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు  కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

వృషభరాశి ( Taurus) వారికి :- 

ఈ నెలలో ఆర్ధికనష్టాన్ని కొంత వరకు తీర్చుకోగలుగుతారు. విమర్శలు చేయడం తగ్గిస్తారు. బుద్ధి బలంతో పనులను చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది. పితృ వర్గీయులతో స్వల్ప పేచీలు కలుగుతాయి. ఉద్యోగ జీవనం సాఫీగా కొనసాగును. సంతన లేమీ దంపతులకు సంతాన ప్రయత్నాలు విజయం పొందును. ధన ఆదాయం అవసరములకు సరిపోతుంది. కుటుంబ పరమైన ఖర్చులు అధికం అగును. గృహంలో శుభ కార్యములు నిర్వహించెదరు. నూతన పరిచయాలు అంత మంచిది కాదు. సంతానానికి సంతోషాన్ని కలుగచేయుదురు. నూతన కార్యములకు రూపకల్పన చేయుదురు. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక వ్యక్తిగత వ్యవహార సమస్య తీరి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సోదర వర్గం మధ్య సఖ్యత పెరుగుతుంది. వ్యవసాయం మీద ఆధారపడిన వారికి ఈ మాసంలో తీవ్ర ప్రతికూలత ఎదురగును. పెంపుడు జంతువుల విషయంలో జాగ్రత్త అవసరం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

 మిధునరాశి ( Gemini) వారికి :- 

ఈ నెలలో ఆర్భాటాలకు, ఆడంబరాలకు దూరంగా ఉండటం ఉత్తమం. ఎదుటివారితో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకునే సూచనలున్నాయి. ఉద్యోగ, వ్యాపారాలలో రాజకీయంగా హామీలు పొందలేరు. న్యాయలావాదేవీలలో నత్త నడకగా సాగుతాయి. భాగస్వామ్య నిర్ణయాలు వాయిదాపడే సూచనలున్నాయి. గౌరవానికి భంగం ఏర్పడుతుంది. దైనందిన విషయాల పట్ల ఆసక్తి పోతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమగును. చేపట్టిన కార్యక్రమాలలో అడ్డంకులు, స్తబ్ధత నిరాశ కలుగచేస్తాయి. మిశ్రమ ఫలితాలు ఏర్పడును. ఆలోచనలు నిలకడగా ఉండవు. అవకాశాలు చివరి నిమిషంలో చేజారిపోవును. వ్యయం కూడా అదుపు తప్పుతుంది. ఆత్మీయుల ప్రవర్తన మానసికంగా తీవ్ర ఇబ్బందులు కలుగచేస్తుంది. మొత్తం మీద ఈ మాసం అంత ఆశించిన ఫలితాలను ఇవ్వదు. జీవన విధానంలో నూతన మార్పులకు ప్రయత్నించకండి. ఆర్ధికంగా భారి పెట్టుబడులు పెట్టకుండా ఉండుట మంచిది. అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పావురాలకు  దాన్యపు గింజలను, నీళ్ళను వాటికి అందివ్వండి ఎంతో మేలు కలుగుతుంది

కర్కాటకరాశి ( Cancer) వారికి :- 

ఈ నెలలో ఖర్చులు పెరుగును. ప్రవర్తనలో వ్యత్రిరేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. బ్యాంకు లావాదేవీలు సజావుగా సాగాకపోవచ్చును. అపనిందలు పెరుగును. పై అధికారులతో సంయవనంగా ఉండలేరు. తరచూ ప్రయాణాల వలన అలసటలుంటాయి. ఆశించిన విధంగా దైవం నుండి సహకారం లభిస్తుంది. చర్చలు, సమావేశాల్లో పాల్గొంటారు. సంఘ గౌరవం లభిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. విద్యార్ధుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ మాసంలో అవివాహితులు రావిచెట్టునకు 11 ప్రదక్షిణలు చేసి పడమర దిశ వైపు వివాహ ప్రయత్నాలు చేయడం వలన కలసి వచ్చును. స్త్రీ లకు నూతన వస్తు - ఆభరణాలు లభించు సూచనలు ఉన్నవి. ఈ మాసంలో శుభ వార్తలు వినుట వలన కోల్పోయిన మనోధ్యైర్యం తిరిగి పొందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకుపశుఉలకు త్రాగడానికి నీళ్ళను ,ఆహారాన్ని ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 

సింహరాశి (Leo) వారికి :-

ఈ నెలలో కుటుంబ నిర్ణయాలలో తరచూ వాయిదాలు పడుతుంటాయి. మర్మత్తుల కొరకు అధిక ధన వ్యయం అవును. అనవసరమైన హామీలను ఇవ్వరు. హామీల వలన గౌరవ ప్రశంసలు దక్కుతాయి. స్వంత నిర్ణయాల వలననే విజయం చేకూరుతుంది. కెరియర్, ఆరోగ్యం, ఉన్నతిలో ఊహించని విజయాలను పొందుతారు. వైవాహిక జీవనంలో సమస్యలు తొలగుతాయి. జీవిత భాగస్వామితో సంతోష జీవనం. ధనాదాయం బాగుండును. జీవన మార్గంలో ఆశించిన మార్పులు ఏర్పడతాయి. నూతన ఆలోచనలు ఆచరణలోకి తీసుకురావడం వలన శుభ ఫలితాలు ఏర్పడును. శ్రమ అధికం అయినా పట్టుదలతో పని చేస్తారు. స్థాన చలన , ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఫలిస్తాయి. 27 తేది నుండి 30 తేదీల మధ్య జాగ్రత్తగా ఉండాలి. అనుకూలమైన శుభాల కొరకు  పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను,నీళ్ళను వాటికి అందివ్వండి ఎంతో మేలు కలుగుతుంది.

కన్యారాశి ( Virgo) వారికి :-

ఈ నెలలో గృహ నిర్మాణ పనులపై ఆశక్తి పెరుగును. ఆవేశాన్ని తగ్గించు కుంటే మంచిది తద్వార కీర్తి ప్రతిష్టతలకు కొదవ ఉండదు. మీ లోపల చలాకీ తనం, కళా కాంతులు పెరుగును. నీచమైన వ్యక్తులను గమనించి వారిని దూరం చేస్తారు. వైద్య సేవలకు ధనవ్యయం చేస్తారు. వాహన సంబంధిత సమస్యలు. వృత్తి జీవనంలోని వారికి అవమానకరమైన పరిస్థితులు. అకాల భోజనం వలన సమస్యలు. వ్యతిరేక ఫలితాలు ఎదుర్కొంటారు. ఆర్ధికంగా ధనాదాయం తగ్గుతుంది. ఉద్యోగ జీవనంలో ఆకస్మిక నష్టములు ఏర్పడును. ఉద్యోగ జీవనంలో ఇబ్బందుల వలన ఋణ బాధలు ఎదుర్కొంటారు. ఈ మాసంలో ప్రయత్నాలు కలసి రావు. ఈ నెలలో 3 నుండి 5 తేది వరకు 30 నుండి నవంబర్ 1 వరకు ఈ తేదీలలో ఇబ్బందులు అధికమగును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు వికలాంగులకు సేవ చేయండి శుభం కలుగుతుంది. 

తులారాశి ( Libra) వారికి :- 

ఈ నెలలో ఉద్యోగంలో నూతన వెసులు బాట్లు కల్గుతాయి. వాగ్ధాన భంగములు ఉండవు. సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. యుక్తితో చేసే పనులకు విజయప్రాప్తి కలుగుతుంది. ఋణాలు మంజూరు అవుతాయి. కళత్ర సౌఖ్యం లభిస్తుంది. మానసిక, శారీరక ప్రశాంతత పొందుతారు. స్నేహ పూర్వకంగా మాట్లాడడం వలన ఉత్తమ ఫలితాలు ఉంటాయి. ఆత్మీయుల వలన నూతన ప్రయత్నాలు లాభించును. విమర్శల నుండి బయట పడతారు. పెద్దల అనుభవం ఉపయోగపడుతుంది. ప్రధమ వారంలో సంతాన సంబంధ లాభములు ఏర్పడును. సంతానానికి ఉద్యోగ లాభం ఏర్పడును. గత కాలపు సమస్యల నుండి కొంత ఉపశమనం లభించును. కుటుంబ సంబంధాలు కొంత మెరుగవును. ఫైనాన్సు వ్యాపారం చేయువారికి ఈ మాసం అంతగా కలసిరాదు. పెద్ద మొత్తంలో ధనాన్ని నష్టపోవుదురు. మాస ద్వితీయార్ధంలో కోర్టు, విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ఆశించిన గుర్తింపు పొందుతారు. ఈ నెల 5 తేది నుండి 8 వ తేదీలలో జాగ్రత్తలు అవసరం. అర్దాష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు కుక్కలకు రొట్టెలు ,బిస్కేట్స్  ఇవ్వండి.

వృశ్చికరాశి ( Scorpio) వారికి :-

ఈ నెలలో రుణభారం చాలా వరకు తగ్గును. స్వంత వారితో స్వల్ప విభేదాలున్నాయి జాగ్రత్త వహించాలి. సమయస్పూర్తితో కెరియర్ ను అభివృద్ధి దిశవైపు నడిపిస్తూ ఎవరికీ సంజాయిషీలు, క్షమాపణలు లేకుండా నేట్టుకువస్తారు. ధనాదాయం సామాన్యం. ప్రధమ అర్ధ భాగంలో ఇష్టమైన వ్యక్తులతో దూర ప్రయాణములు చేస్తారు. కుటుంబ అవసరాలకు ఆశించిన విధంగా ధనం సర్దుబాటు చేయగలుగుతారు. పుత్ర సంతానం వలన చక్కటి సౌఖ్యత ఏర్పడును. ద్వితీయ అర్ధ భాగం నుండి అనగా 13, 14, 15, 16 తేదీలలో భాగస్వామ్య వ్యాపారములలో నష్టం ఏర్పడు సూచనలు అధికంగా గోచరిస్తున్నాయి. చిన్న చిన్న విషయాలలో ఇరుగు పొరుగు వారితో తగాదాల వలన చికాకులు ఏర్పడును. ఉద్యోగ జీవనంలో ఆకస్మిక సమస్యలు. 17,18 తేదీలలో గౌరవ హాని. మాసాంతంలో ఉద్యోగ ఒత్తిడి వలన శ్రమ అధికం అగును. వివాహ సంబంధ ప్రయత్నాలలో ఒక అశుభ వార్త వినవలసి రావచ్చును. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పేదల కొరకు మీ చేతనైన సహాయం చేయండి శుభం కలుగుతుంది. 

ధనుస్సురాశి ( Sagittarius) వారికి :- ఈ నెలలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ప్రోత్సహకరంగా ఉంటుంది. ఉద్యోగ బదలీ ప్రయత్నాలకు అనుకూలం. కుటుంబ చికాకులుంటాయి. మిత్రభేదాలను జాగ్రత్తగా గమనించుకోవాలి. పోటీ పరీక్షలలో శుభసూచకాలున్నాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరమని గ్రహించండి. సంతాన సంబంధమైన విషయాలలో ఊహించని నష్టం. గర్భిణిలు చాలా జాగ్రత్తగా ఉండవలెను. ధనాదాయం సామాన్యంగానే ఉండును. ప్రధమ వారంలో ప్రారంభించు వ్యాపారములు విజయవంతం అగును. ద్వితీయ వారంలో ఉద్యోగ జీవనంలో సమస్యలు తొలగి ఉన్నతి ఏర్పడు సూచన. అందరి మన్ననలూ పొందుతారు. నూతన గృహ లేదా వాహన ప్రయత్నములు ఫలించును. చివరి వారంలో మానసికంగా కృంగదీయు ఆలోచనలు అధికంగా ఏర్పడును. ప్రేమకలాపముల వలన తీవ్ర ఇబ్బందులు. ఇంట్లో పెద్ద వయస్సు గల వారికి ఆరోగ్య సమస్యలు కొనసాగును. గోచారరిత్య ఏలినాటి శని 'చివరి భాగం'లో ఉన్నారు కాబట్టి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు  కాకులకు పశు, పక్ష్యాదులకు త్రాగడానికి వీలుగా నీళ్ళను.ఆహారాన్ని ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) వారికి :-

ఈ నెలలో ఖర్చులు పెరుగును, కుటుంబ నిర్ణయాలు గట్టేక్కును. కపట స్వభావులు తారసపడతారు జాగ్రత్త వహించండి. లోభత్వం పెరగడం వలన ముఖ్య కార్యక్రమాలు వాయిదా పడతాయి. భాగస్వామ్య నిర్ణయాలు సరిదిద్దుకుంటాయి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృద్ధులకు ఆరోగ్యం సహకరించును. కుటుంబ జీవనంలో శుభకార్యములు నిర్వహించుట, ఉల్లాసంగా బంధువులతో, మిత్రులతో కలయికలు జరుగును. ఉద్యోగ జీవనంలో కార్యానుకూలత లభించును. స్నేహితుల వాహనం వలన ఇబ్బందులు ఎదురగును. జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యుల సహకారం వలన కుటుంబ సమస్యలు తొలగును. చివరి వారంలో వృత్తి వ్యాపారములు సులువుగా ఆశించిన విధంగా కొనసాగును. మాసాంతంలో సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగును. ఉత్తరాషాడ నక్షత్ర జాతకులకు నిల్వధనం ఏర్పడును. చక్కటి ఉద్యోగ స్థిరత్వం లభించును. గోచారరిత్య ఏలినాటి శని 'రెండవ భాగం' లో ఉన్నారు కాబట్టి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు చేపలకు ,ఇతర జలచరాలకు ఆహారం  వేయండి గ్రహ బాధలు తొలగుతాయి.

 కుంభరాశి ( Aquarius) వారికి :- వఈ నెలలో సంతానం వలన అధిక ఉత్సాహం కల్గుతుంది. వాగ్దానాలు చేయడం తగ్గిస్తారు. ఏలినాటి శని ప్రభావం వలన కోపం పెరుగును. ఖర్చులను అదుపు చేయలేరు. ఉద్యోగ, వ్యాపారాలలో యుక్తిని ఉపయోగించి పావులను కదపలేరు. మిత్రభేదాలున్నాయి జాగ్రత్త వహించండి. తోబుట్టువులచే నిందలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆర్ధిక పరమైన అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సంఘర్షణ సంబంధిత చికాకులు మాత్రం కొనసాగుతాయి. సొంత మనుష్యుల నిరాదరణ మానసికంగా బాధించును. ఈ మాసంలో దూర ప్రాంత , పరదేశ స్థిర నివాస ప్రయత్నాలు కష్టం మీద ఫలించును. రెండవ వారంలో శరీరమునకు కార్య భారం వలన అలసట ఏర్పడును. ఉద్యోగ జీవనలో ఒత్తిడి ఎదుర్కొంటారు. ఆలోచనలు ముందుకు సాగవు. నూతన వ్యాపారాలు అంతగా రాణించవు. చివరి వారంలో మిత్రులే శత్రువులగుదురు. మీకు అపఖ్యాతిని ఆపాదించడానికి ప్రయత్నిస్తారు. వ్యక్తిగత విషయాలు అన్నింటిని మిత్రులతో ప్రస్తావించుట అంత మంచిది కాదు అని గ్రహించండి. ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు అవులకు దానా ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మీనరాశి ( Pices) వారికి :- 

ఈ నెలలో అవివాహితులకు ఊరట లభిస్తుంది. ఆధిపత్య దోరని వలన లేదా తెలివైన సంభాషణలతో పనులను పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తతో ఉండాలి, దేనిలోనూ అశ్రద్ధ తగదు. కొన్ని ముఖ్యమైన కార్యక్రామాలను వాయిదా వేస్తారు లేదా అనుకోకుండా పడతాయి. కొన్ని విషయాలలో మీ సాహసమైన నిర్ణయాల వలన కీర్తి పెరుగుతుంది. అనుకూలమైన కాలం. ప్రతీ కార్యం దైవ ఆశీస్సులతో విజయం పొందును. కుటుంబ కలహాలు తొలగి బంధువులు, స్నేహితుల తోడ్పాటు లభించుట వలన కష్టములు నుండి బయటపడుదురు. ఆశించిన విధంగా ధన ప్రాప్తి పొందుతారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అన్ని రంగముల వారికి ఈ మాసం అనుకూల ఫలితాలను కలుగజేస్తుంది. మీ చేతి మీద పుణ్యకార్యములు నిర్వహిస్తారు. ఈ నెల 16 వ తేది నుండి 18 వ తేదీ వరకు నిధానమే ప్రధానం అని భావించుకుని వ్యవహరించాలి. అనుకూలమైన శుభ ఫలితాల  పావురాలకు బెల్లం పట్టించిన దాన్యపు గింజలను , త్రాగడానికి నీళ్ళను వాటికి ఏర్పాటు చేయండి.

సర్వ్  జనా సుఖినో భవంతు

శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం

Ph. no: 9666602371 

No comments:

Post a Comment