Thursday, 4 August 2016

స్వర్ణ గౌరీ వ్రతం

స్వర్ణ గౌరీ వ్రతం 

 

స్వర్ణ గౌరీ వ్రతం
శ్రావణ మాసం వచ్చిందంటేచాలు ... నోములు - వ్రతాలతో చాలా వరకూ ఇళ్లన్నీ కళ కళలాడుతూ కనిపిస్తుంటాయి. మాసంలో వివాహిత స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో 'స్వర్ణ గౌరీ నోము' నోచుకుంటూ వుంటారు. సిరిసంపదలు ... ఆయురారోగ్యాలు పొందడానికి గాను, 'శ్రావణ శుక్ల తదియ' రోజున నోమును నోచుకుంటారు. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేయాలి. పసుపు కుంకుమలతో అలంకరించిన పీఠంపై గౌరీదేవి చిత్రపటాన్ని వుంచి 16 ముడులుగల తోరం ధరించి షోడశోపచార పూజ చేయాలి. తరువాత కథ చదువుకుని అక్షింతలు తలపై వేసుకోవాలి.
ఇక నోముకి కారణమైన కథ విషయానికి వస్తే, పూర్వం ఒక రాజు వేటకి వెళ్ళిన సందర్భంలో నదీ తీరాన కొందరు ఏదో పూజ చేస్తున్నట్టుగా కనిపించడంతో, విషయమేమిటని వాళ్లని అడుగుతాడు. 'స్వర్ణగౌరీ నోము' నోచుకుంటున్నట్టుగా వాళ్లు చెప్పడంతో, విధి విధానాలు తెలుసుకుని ఇంటికి తిరిగివస్తాడు. ఇద్దరు భార్యలకి నోము గురించి చెప్పి, ఆచరించ వలసిందిగా కోరతాడు.

విషయాన్ని కొట్టిపారేసిన పెద్దరాణి రాజుకి దూరమవుతుంది. చిన్నరాణికి ఆశించినవి లభిస్తాయి. తన తప్పు తెలుసుకున్న పెద్దరాణి నోమును ఆచరించడంతో తిరిగి రాజు ఆదరణను పొందుతుంది. కథ పూర్తి అయిన తరువాత 16 రకాల పండ్లను ... 16 రకాల పిండి వంటలను గౌరీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. తమ తాహతుకి తగినట్టుగా బ్రాహ్మణులకు దానాలు చెయ్యాలి.
ఇలా 16 సంవత్సరములు చేశాక పార్వతీ పరమేశ్వరులకు వస్త్రాలను సమర్పించి, రోజున 16 రకాల వంటకాలను ... ఫలాలను 16 మంది ముత్తైదువులకు మూసివాయనమివ్వాలి. దాంతో ఉద్యాపన కార్యక్రమం పూర్తవుతుంది.
 

No comments:

Post a Comment