గౌరీ దేవి పాటలు
శ్రీ గౌరీ మహాత్మ్యం
శ్రీమించు మా తల్లి శివునీ అర్ధాంగీ
మహిమలూ గల తల్లి మంగళాగౌరీ
మా పసుపు కుంకుమా చల్లగా ఉండ
మా ఐదువతమ్ము చల్లగా ఉండ
కన్నె పేరంటాళ్ళ కళ్యాణ రేఖ
ఇల్లాళ్ళ నొసటాను సౌభాగ్య రేఖ
మా అమ్మ మా తల్లి మంగళా గౌరీ
శ్రీ కరి వర దాయిని సర్సిజవదనా
సామజగమనా సదయా మాం పాలయ
శ్రావణ మాసాన మంగళా వారాన
మా యింట వెలసిన మంగళా గౌరీ...
భక్తితో తోరమ్ము ముంజేత గట్టీ
చిత్తశుద్ధిగ నిన్ను సేవించుకొన్న
ఆపదలలో మునిగి అల్లాడువారు
అంబ నీ దయ వల్ల గడచి బ్రతికేరు
ఆలికీ మగనికీ యెడబాటులైన
అంబ నీ కృప వల్ల ఏకమౌతారు
ఏ నోము మానినా నీ నోము మానము
ఏ వ్రతము తప్పినా నీ వ్రతము తప్పము
2
అంబా మంగళ గౌరీ జగదంబా దేవీ శ్రీభవానీ
దరి చేరిన వారిని బ్రోవ ఇల నీ సరి వేలుపు లేరే
ఇది నీ పరివారమే దేవదేవీ కనుపాపగ పాపను కాపాడవే
భవతాపము తీరే వెరవు వరయోగులు కోరే తెరవు
నగరాజ కుమారీ నీవె కావా శరణం భవ మాం పాహి పురాణి
గుణసుందరి కథ
శ్రీ తులసీ ప్రియ తులసీ జయము నీయవే జయము నీయవే
సతతము నిను సేవింతుము సత్కృప గనవే సత్కృప గనవే
లక్ష్మీ పార్వతి వాణీ అంశల వెలసీ
భక్తజనుల పాలించే మహిమ నలరుచు...
కొల్లగ శాఖలు వేసి...పెల్లుగ దళములు విరిసీ
శుభకర పరిమళములతో పెరటి వేల్పువై వెలసి
దళమున కొక విష్ణువు గా విష్ణుతులసివే..
శ్రీకృష్ణ తులసివే...జయ హారతి గైకొనవే...
మంగళ శోభావతివై...
శ్రీ గౌరీ మహాత్మ్యం
శ్రీమించు మా తల్లి శివునీ అర్ధాంగీ
మహిమలూ గల తల్లి మంగళాగౌరీ
మా పసుపు కుంకుమా చల్లగా ఉండ
మా ఐదువతమ్ము చల్లగా ఉండ
కన్నె పేరంటాళ్ళ కళ్యాణ రేఖ
ఇల్లాళ్ళ నొసటాను సౌభాగ్య రేఖ
మా అమ్మ మా తల్లి మంగళా గౌరీ
శ్రీ కరి వర దాయిని సర్సిజవదనా
సామజగమనా సదయా మాం పాలయ
శ్రావణ మాసాన మంగళా వారాన
మా యింట వెలసిన మంగళా గౌరీ...
భక్తితో తోరమ్ము ముంజేత గట్టీ
చిత్తశుద్ధిగ నిన్ను సేవించుకొన్న
ఆపదలలో మునిగి అల్లాడువారు
అంబ నీ దయ వల్ల గడచి బ్రతికేరు
ఆలికీ మగనికీ యెడబాటులైన
అంబ నీ కృప వల్ల ఏకమౌతారు
ఏ నోము మానినా నీ నోము మానము
ఏ వ్రతము తప్పినా నీ వ్రతము తప్పము
2
అంబా మంగళ గౌరీ జగదంబా దేవీ శ్రీభవానీ
దరి చేరిన వారిని బ్రోవ ఇల నీ సరి వేలుపు లేరే
ఇది నీ పరివారమే దేవదేవీ కనుపాపగ పాపను కాపాడవే
భవతాపము తీరే వెరవు వరయోగులు కోరే తెరవు
నగరాజ కుమారీ నీవె కావా శరణం భవ మాం పాహి పురాణి
గుణసుందరి కథ
శ్రీ తులసీ ప్రియ తులసీ జయము నీయవే జయము నీయవే
సతతము నిను సేవింతుము సత్కృప గనవే సత్కృప గనవే
లక్ష్మీ పార్వతి వాణీ అంశల వెలసీ
భక్తజనుల పాలించే మహిమ నలరుచు...
కొల్లగ శాఖలు వేసి...పెల్లుగ దళములు విరిసీ
శుభకర పరిమళములతో పెరటి వేల్పువై వెలసి
దళమున కొక విష్ణువు గా విష్ణుతులసివే..
శ్రీకృష్ణ తులసివే...జయ హారతి గైకొనవే...
మంగళ శోభావతివై...
No comments:
Post a Comment