Friday, 5 August 2016

దూర్వ గణపతి వ్రతం

దూర్వ గణపతి వ్రతం





శుద్ధచతుర్ధి శ్రవణ మాసం నాడు దూర్వ చతుర్ధి వ్రతం చేస్తారు.గణపతిని దూర్వ యుగ్మ దళాలతో పూజించడం వల్ల సంకటాలు చెదిరిపోయి శుభం చేకూరుతుంది.గ‌రిక అంటే ఆయ‌న‌కు చాలా ఇష్టం. అందుచేత గ‌రిక తో పూజించేందుకు ప్ర‌య‌త్నించాలి. 21 సార్లు గ‌రిక‌తో పూజిస్తే గ‌ణ నాధుడు ఎంతో సంతోషిస్తాడు. క‌నీసం 5 సార్లు అయినా పూజిస్తే మేలు. లేదంటే అక్షిత‌ల‌తో పూజించుకోవ‌చ్చు. అయితే అక్షిత‌లు క‌ల‌ప‌టంలో ప‌సుపు ను నీటితో క‌న్నా ఆవునేతితో క‌లిపితే మంచిద‌న్న మాట ఉంది. ఏమైనా షోడ‌శ ఉప‌చారాల‌తో గ‌ణ నాధుడ్ని పూజించి ఆ త‌ర్వాత ఏ కార్య‌క్ర‌మ‌మైనా సంక‌ల్పిస్తే శుభం క‌లుగుతుంది.

No comments:

Post a Comment