Saturday, 6 August 2016

నాగ పంచమి, నాగులచవితి ఎందుకు ఆచరిస్తారు ?


నాగ పంచమి, నాగులచవితి ఎందుకు ఆచరిస్తారు ?


వైజ్ఞానిక విశ్లేషణ, మన సాంప్రదాయంలోని, విశిష్ట సద్భావన.
సనాతన మన భారత దేశం వ్యవసాయ ప్రధాన దేశం. దక్షిణ భారత దేశంలో
ఆషాఢం తో గ్రీష్మం సమాప్తమై, శ్రావణంతో వర్ష ఋతువు ప్రారంభమౌతుంది.
వర్షాలు విస్తారంగా పడతాయి. కృషీవలుల వ్యవసాయ కార్య క్రమములు,
తీవ్ర తరమౌతాయి. అంతవరకు,చల్లదనముకొరకు, పుట్టలలో దాగున్న సర్పసంతతి,తమ ఆహారాన్వేషణకొరకు బయటకువచ్చి, పొలాలలో, సంచరించు
ఎలుకలు, కప్పలకొరకు విచచచలవిడిగా సంచరించ ప్రారం భిస్తాయి.
అర్ధరాత్రి, అపరాత్రి, పొలాలలో సంచరించు, కృషీవలులకు వానివలన ప్రాణ హాని కలుగవచ్చును. ఇటువంటి ప్రమాదములనప ను నివారిచుటకొరకు,
విజ్ఞులై మనపెద్దలు, ఈ శ్రావణ మాసంలో నువ్వులు, బెల్లం, చలిమిడి (బియ్యంపిండితోచేసిన తీపి పదార్థం) పాలతో కలిపి చేలగట్టులయందున్న పుట్టలలో సమర్పించమని చెప్పినారు.ఈ కార్య క్రమములో ఆధ్యాత్మికతనుకూడా
జోడించుటవలన,జనులకు భక్తి, భయము ఏర్పడినాయి.
పాములు పాలుతాగవనునది జగమెరిగినసత్యము. మరి పుట్టలలో పాలు, ఇతరపదార్థములు ఎందుకువేయుచున్నారనగా ఆపిండిపదార్థములు, నూవులు, బెల్లం ఇత్యాదులను తినుటకు, చిన్నక్రిములు, చీమలు, వాటిని తినుటకు, కప్పలుమరియు ఎలుకలు ఆపుట్టల బొరియలలో ప్రవేసించునుగదా, సర్ప సంతతికి బొరియలనుండి బయటికిరాకుండగనే, వాటిస్థానమందు, తమ ఆహారము
లభించుటవలన,ప్రశాంతముగా తమ ఆహారమునారగించున వగుచున్నవి.
ఇందువలన వాటికి ప్రాణహాని, వాటివలన జనుల ప్రాణ హాని, రెండూ నివారింప
బడినవి.ఎలుకలను సర్పములారగించుటవలన, రైతులకు పంట హానికూడా కొంత
తగ్గును.
అందువలన నిజమై న పుట్టలయందు పాలుపోయుటవలన ప్రయోజనమున్నదికాని, రాతి ప్రతిమలకు పాలుపోయుటవలన కేవలంసాంకేతికమే కాని ప్రయోజనము నెరవేరదు. దేవస్థాములందు ఇట్టుల చేయుటవలన, క్రిమి కీటకాదుల కొరకు, కప్పలు, ఎలుకలు, వాటి నారగించుటకు.సర్ప సంతతి ఆలయములలో ప్రవేసించవచ్చును.
సర్పములవలన మనుష్యులకు జరుగు హానికన్నా, మనుష్యలవలన సర్ప సంతతికి ఎక్కువ కీడు జరుగుచున్నది.మనిషికి కరుస్తుందని భయము, మరి వాటికో మనుష్యులనుండి తప్పించుకొని పారిపోవుటయే ప్రాణ సంకటము.
సమస్త సర్ప సంతతి తమ నెలవులందు, నిర్భయముగా జీవిచుగాక.
అందుకే ఇలాప్రార్థిస్తారు.చలిమిడి,నూవువులతో, బెల్లంతో చేసిన పదార్థములు సమర్పణ చేయుచూ
'' తోకతొక్కితే తొలగిపో, నడుంతొక్కితే నావాడనుకో, పడగతొక్కితే పారిపో"
యజుర్వేద మంత్రం.
'' ఓం నమోఁ- స్తు సర్పేభ్యో యేకేచ పృధివి మను,
యే అంతరిక్షే యే దివి తేభ్యః సర్పేభ్యో నమః ll
భూమి మీద దివ్యలోకమున, ఈ రెంటి మధ్యగల అంతరిక్షమందున్న సర్పముకు
మరలా మరలా నమస్కారము.
'' ఓం యశ స్కరం బలవంతం ప్రభుత్వం తమేవవ రాజాధిపతిర్భభూవ l
సంకీర్ణ నాగాశ్వపతి ర్నరాణాం సుమాంగల్యం సతతం దీర్ఘమాయుః ll

శుభంభవతు.

No comments:

Post a Comment