Thursday 17 November 2016

శివ పూజ రహస్యములు



సువాసన లేనివి అయిన , సుగంధం వాసన కలిగిన పది పుష్పముల చే శివ లింగముని పూజించిన .. అది సత సహస్రములు అయిన మాలలతో పూజ చేసినటువంటి అనంత మైన పుణ్యఫలము లభించును అని శివ దర్మ సంగ్రహము అను దాని లో చెప్పబడినది .
శివుని యొక్క పటము కి లేదా శివలింగానికి కాని ఒక్క పుష్పము ని రోజు సమర్పణ చేస్తే 80 లక్షల కోట్ల సంవత్సరముల వరకు దుర్గతి సంభవించదు అని వేదవిదులచే చెప్పబడుచున్నది .
ఎవరు అయిన వ్యక్తీ తానూ స్వయము గా పెంచి పోషించి పూయింపజేసిన చెట్ల యొక్క పూలతో భక్తీ శ్రద్దలతో శివుని ని పూజించిన అట్టి వారు శివసాయుజ్యము తప్పక పొందుతారు.
చెట్టు యొక్క పుష్పములు , ఆకుల తో శివునికి సమర్పణ చేసిన ఆ చెట్టు కోడా పరమ పదము పొందును.
ఎ వ్యక్తీ అయిన ఐదు పుష్పములతో శివుని పూజించిన చొ అట్టి వారికి పది అశ్వమేధ లు చేసిన ఫలితము లభించును.
ఎవరు అయిన ఎనిమిది పుష్పములతో పరమ శివుని పూజ చేసిన వారు కైలాసమునకు వెళ్లుతారు .
శివ పూజ – మాసముల వారి పుష్పములు
1) చైత్ర మాసము నందు నృత్యము , గితములతో శివుని సేవించాలి , దర్బ పూవ్వులతో పూజ చేసిన అట్టి వారికి పలు విధములు అయిన సువర్ణములు లభించును .
2) వైశాఖ మాసము నందు శివునికి ఆవు నేయ్యి తో అభిషేకము చేయించి ,, తెల్లని వర్ణము (రంగు) కలిగిన మందార పుష్పములతో పూజ చేసిన వారికి అశ్వమేధ యాగము చేసినటువంటి ఫలము కలుగును .
3) జేష్ట్య మాసము నందు ఎల్ల వేళల యందు శివుని ని పెరుగుతో అభిషేకించి తామర పువ్వులతో పూజ చేసిన వారికి ఉత్తమ పరమ పదములు పొందును .
4) ఆషాడ మాసము నందు బహుళ చతుర్దశి తిదియ రోజు స్నానము చేసి శుచిగా తాయారు అయ్యి కొంచు అయిన గుగ్గిలము తో ధూపము ఇంటి అంత , దేవుని మందిరములో కుడా వేసి తోదిమలతో కూడి ఉన్న పుష్పములను మాల చేసి శివునికి వేసి అర్చించిన వారు బ్రహ్మ లోకమును అధిగమించి పరమ పదము పొందుతారు .
5) శ్రావణ మాసము నందు ఒంటి పూట మాత్రమె భోజనము చేసి , గన్నేరు పూలతో శివుని ని అర్చించిన వారికి వెయ్యి గోవులను దానము చేసినటువంటి ఫలము పొందును .
6) భాద్ర పద మాసము నందు ఉత్తరేణి పువ్వులతో శివుని ని అర్చన చేసిన వారు హంస ద్వాజము తో కూడిన విమానమునండు పుణ్య పదమునకు వేల్లతారు.
7) అశ్వాయుజ మాసమున శివునికి జిల్లేడు పూలతో పూజించిన వారు మయూర ధ్వజము తో కూడిన విమానము నందు శివ పదమునకు చేరుదురు .
8) కార్తిక మాసము నందు శివుని ని క్షీరము తో (పాల ) అభి శేకము చేసి , జాజి పువ్వులతో పూజ చేసిన వారు నిరంజనమైన శివ పదమును దర్సించుదురు.
9) మార్గశిర మాసము నందు పొగడ పూలతో శివుని ని పూజించిన వారు శివుడు ఎక్కడ ఉండునో అక్కడికి చేరుతారు .
10) పుష్య మాసము నందు ఉమ్మెత్త పువ్వులతో శివునికి పూజిస్తారో అట్టివారు పరమ పదముని పొందుతారు .
11) మాఘ మాసము నందు శివునికి బిల్వదలములతో పూజిస్తారో వారు లెతయైన సూర్య – చంద్రులు గల విమానము నందు వెళ్ళెదరు .
12) ఫాల్గుణ మాసము నందు శివునికి సుగంధ జలములతో అభిషేకము చేసి తుమ్మ పువ్వులతో పూజ చేసిన వారికి ఇంద్రుని అర్ద సింహాసనము పొందుతారు .
ప్రతిదినము శివునికి ఒక జిల్లేడు పుష్పములతో శివుని ని పూజించిన వారికి పది సువర్ణ ముద్రికలను దానము చేసినంత ఫలము కలుగును.

No comments:

Post a Comment