Wednesday, 9 November 2016

స్మార్త వైష్ణవ ఏకాదశి




ఈ ఏకాదశిని  స్మార్త వైష్ణవ ఏకాదశి లేదా యోగిని ఏకాదశి అని అంటారు. దీనికి సంబంధించిన గాథను కృష్ణభగవానుడు ధర్మరాజుకు వివరించారు. 


అలకాపురిని పాలించే కుబేరుడి వద్ద హేమమాలి అనే ఉద్యానవన సిబ్బంది వుండేవాడు. ప్రతిరోజు మానస సరోవరానికి వెళ్లి అక్కడ పుష్పాలను సేకరించి కుబేరునికి ఇచ్చేవాడు. కుబేరుడు ఆ పుష్పాలతో మహాశివున్ని పూజించేవాడు. ఒక రోజు పుష్పాలను తీసుకువస్తున్న హేమమాలి తన ఇంటికి వెళతాడు. సమయం గడుస్తున్నా అతను రాకపోవడంతో పూజకు ఆలస్యం అవుతోందని కుబేరుడు హేమమాలి ఎక్కడ వున్నాడో తీసుకురావాలని సిబ్బందిని ఆదేశించాడు. హేమమాలికి ఈ విషయం తెలియడంతో వెంటనే కుబేరుని వద్దకు చేరుకొని క్షమాపణలు చెబుతాడు. అయితే ఆగ్రహంతో వున్న కుబేరుడు అతడు కుష్టువ్యాధితో బాధపడాలని శపిస్తాడు. వెంటనే హేమమాలి భూలోకంలో పడిపోతాడు. భయంకరమైన వ్యాధితో అడవుల్లో తిరుగుతూ హిమాలయాల్లోని మార్కండేయ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. విధి నిర్వహణలో అలసత్వాన్ని ప్రదర్శించినందుకుఎలా శాపానికి గురైంది వివరిస్తాడు. తనకు శాపవిముక్తి కలిగించాలని వేడుకుంటాడు. దీంతో మహర్షి ఆషాఢంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున దీక్ష వుండాలని సూచిస్తాడు. హేమమాలి భక్తితో, శ్రద్ధగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల అతని శాపం తొలగి పూర్వరూపానికి చేరుకుంటాడు. అందుకనే ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించడం మనకు వున్న అనేక పాపాలను తొలగించుకోవచ్చని కృష్ణభగవాన్‌ ఉపదేశంలో పేర్కొంటాడు.

No comments:

Post a Comment