Sunday, 6 November 2016

కార్తీకమాసంలో దీపం వెలిగింఛి కష్టాలు తొలగించుకొని ఐశ్వర్యం పొందండి..



దీపం పరబ్రహ్మ స్వరూపం,ఈశ్వరుడు తేజోమయ మూర్తి. ఆయన కాంతి సోకినప్పుడు మనలోని అజ్ఞానాంధకారాలు తొలగిపోతాయి. కార్తీకమాసంలో దీపానికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది… పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఈ మాసానికి కార్తీక మాసం అనే పేరు వచ్చింది. కార్తీకమాసం మొదటిరోజున దేవాలయాల్లో ఆకాశదీపం వేగించి, ధ్వజస్తంభానికి తాడుకట్టి, చిన్న పాత్రలో దీపం వెలిగించి పైకెత్తుతారు. దీపకాంతులు మనలోని ఆత్మజ్యోతిని ప్రకాశింపజేసి, ఆధ్యాత్మిక సాధన సజావుగా సాగేలా ప్రోత్సహిస్తాయి. దీపానికి అంతటికి శక్తి ఉంది. శివ కేశవులు ప్రీతి కోసం దీపదానం చేస్తారు. నదీ ప్రవాహాల్లో అరటి దొప్పల్లో ఉంచిన దీపాలను వెలిగించి వదులుతారు.
    1.ఆలయాల్లో ఆకాశదీపాన్ని వెలగించడం ఆచారం. ప్రమిదలో వత్తులు వేసి – నువ్వుల నూనె వేసి తాళ్ల సాయంతో దీపాలు వెలిగించమే ఆకాశదీపం.
      2.కార్తీక దీపాలను దేవాలయాలు, మఠాలయందు సూర్యోదయానికి ముందు, సాయం సంధ్యా సమయంలోనూ వెలిగించాలి.
      3.ఇంటముంగిట ఇంటిలోనూ తులసికోటీ వద్ద దీపాలను వెలగించాలి. దీపారాధన వల్ల కష్టాలు తొలగి ఐశ్వర్యం లభిస్తుంది.
      4.ఈ మాసం అంతా శివాలయాలలో ఆకాశ దీపాలు వెలిగించాలి. దీపదానం చేయాలి. నదీ ప్రవాహాలలో దీపాలు వెలిగించి వదలాలి. శివ కేశవుల ప్రీతి కోసం దీపదానం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment