Saturday, 12 November 2016

వారఫలం ( 14 - 21 నవంబర్ 2016)



మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
గురు, శుక్రవారాల్లో రాబడి కోసం చేసే యత్నాలు ఫలించకపోవచ్చు. సన్నిహితులే సాయం చేసేందుకు వెనుకాడుతారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. మానసికంగా కుదుటపడుతారు. ఆదాయ వ్యయాలు అంచనాలకు భిన్నంగా ఉంటాయి.చెల్లింపులు వాయిదా వేసుకుంటారు దూరపు బంధువుల ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. పనులు ప్రారంభంలో ఆటంకాలెదుర్కొంటారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులెదుర్కొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. దైవకార్యం, వనసమారాధనల్లో పాల్గొంటారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. వాణిజ్య ఒప్పంద చర్చలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం. అధికారుల తీరును గమనించి మెలగండి.

వృషభం
కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
సామరస్యంగా వ్యవహరించండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. శుభకార్యంలో చురుకుగా వ్యవహరిస్తారు. బంధువులకు మీ రాకతో సంతోషానిస్తుంది. ఖర్చులు విపరీతం. పొదువు మూలక ధనం ముందుగానే గ్రహిస్తారురాజీమార్గంలోనే సమస్యలు పరిష్కారమవుతాయి. శనివారం నాడు లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. మీ ఆధిపత్యం అన్ని చోట్ల పనిచేయకపోవచ్చు. కుటుంబీకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. దంపతుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి.ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి కొత్త పథకాలు చేపడుతారు. క్రీడాకారులు విజయం సాధిస్తారు. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ధనయోగం. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోవాలి.

మిథునం
మృగశిర 3, 4 పాదాలు. ఆర్ధ్రం, పునర్వుసు 1, 2, 3 పాదాలు.
మీ సలహా ఎదుటి వారికి లాభిస్తుంది. విమర్శలు పట్టుదలను పెంచుతారు. అనుకున్నది సాధించే వరకు శ్రమించరు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సహం ఉంటుంది. శ్రమాధిక్యతతో పనులు పూర్తి చేస్తారు.ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. శుభకార్యాల్లో విలువైన కానుకలు చదివించుకుంటారు. ఆది, సోమవారాల్లో ప్రముఖుల ఇంటర్వ్యూలు అనుకూలించదు. మీ శ్రీమతి పట్ల అనునయంగా మెలగండి.ఉద్యోగస్తులకు కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. జూదాలకు దూరంగా ఉండాలి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. చిన్న విషయమే వివాదంగా మారే ఆస్కారం ఉంది. పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. భాగస్వామిక చర్చలు పురోగతిన సాగుతాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది.

కర్కాటకం
మంగళ, బుధవారాల్లో ఊహించని ఖర్చులుంటాయి. ధనంమితంగా వ్యయం చేయండి. పనులు నెమ్మదించినా అనుకున్న విధంగా పూర్తి కాగలవు. దంపతుల మధ్య అన్యోన్యత లోపిస్తుంది.పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. మనస్థిమితం ఉండదు. వ్యవహారాల్లో ప్రతికూలతలెదుర్కొంటారు. మీ ప్రతిపాదనలకు ఏమంత గుర్తింపు ఉండదు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. సన్నిహితుల కలయికతో కుదుటపడుతారు. హోల్‌సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వనసమారాధన, దైవ, సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నోటీసులు, కీలక పత్రాలు అందుకుంటారు. సంతానం కదలికలపై దృష్టిసారించండి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి.


సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. గృహంలో సందడి నెలకొంటుంది. పరిచయాలు, ప్రైవేట్ సంస్థల్లో పొదుపు క్షేమం కాదు. ఖర్చులు విపరీతం. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు. ఆది, గురువారాల్లో పనులు సాగక విసుగు చెందుతారు. వ్యాపకాలు పెంపొందుతాయి. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. పొదుపు పథకాలపై దృష్టిసారిస్తారు.విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. మీపై శకునాల ప్రభావం అధికం. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు పురోభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెద్దమొత్తం సరకు నిల్వలో జాగ్రత్త. దళారులను విశ్వసించవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. వాహనం ఇతరులకివ్వడం క్షేమం కాదు. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం.

కన్య
ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు.
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మంగళ, శనివారాల్లో దుబారా ఖర్చులు అధికం. అనేక పనులతో సతమతమవుతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ఉన్నత పదవులు స్వీకరిస్తారు. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. పరిచయాలు బలపడతాయి. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. ఉద్యోగ బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఓర్పు ప్రధానం.వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. విద్యార్థులు పోటీల్లో రాణిస్తారు. ప్రయాణం సజావుగా సాగుతుంది. ఉద్యోగయత్నంలో నిరుత్సాహం వీడండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. స్టాకిస్టులు, హోల్‌సేల్ వ్యాపారులకు ఆశాజనకం.


తుల
చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు.
పట్టుదలతో అనుకున్న లక్ష్యం సాధిస్తారు. పదువుల స్వీకరణకు అనుకూలం. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.ఉద్యోగ బాధ్యతల్లో ఆటంకాలు తొలగుతాయి. సహోద్యోగులతో వేడుకల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ముఖ్య సమాచారం అందుతుంది. అవకాశాలు కలిసివస్తాయి. గురు, శుక్రవారాల్లో ఖర్చులు అధికం. ప్రయోజనకరం. పొదుపు పథకాలు పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు క్షేమం కాదు. పనులు వేగవంతమవుతాయి. టెండర్లు, లీజు, ఏజెన్సీలకు అనుకూలం. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు చికాకులు అధికం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. మీ శ్రీమతి వైఖరి బాధిస్తుంది. ఓర్పుతో వ్యవహరించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. వృత్తుల వారికి పురోభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి.
వృశ్చికం
విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఒత్తిడి, మొహమ్మాటాలకు పోవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. శుభకార్యాన్ని ఆడంబరంగా నిర్వహిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి.కార్యక్రమాలు వాయిదా పడతాయి. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలు సరిదిద్దుకుంటారు. అధికారులు, సహోద్యోగులతో జాగ్రత్త. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉన్నత పదవులు, దైవదీక్షలు స్వీకరిస్తారు.నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. దళారులను విశ్వసించవద్దు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.


ధనస్సు
మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం.
అయినవారి వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. విమర్శలు, అభియోగాలు ఎదుర్కొంటారు. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఆహ్వానాలు, నోటీసులు అందుకుంటారు.ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషించాలి. యత్నాలకు పరిస్థితులు అనుకూలించక నిరుత్సాహం చెందుతారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. సంతానం భవిష్యత్‌పై శ్రద్ధ వహించండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులు వ్యాపారాల విస్తరణలకు అనుకూలం. వైద్య సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. సంస్మరణ, సాహిత్య సభల్లో పాల్గొంటారు.ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం.

మకరం
ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు.
కార్యాన్ని ఆడంబరంగా నిర్వహిస్తారు. మీ ఆర్థికస్థితిపై ఇతరుల అపోహపడే ఆస్కారం ఉంది. ఆత్మీయులకు సహాయం చేస్తారు.ప్రముఖులతో పరిచయాలు ఉన్నతికి దోహదపడుతాయి. పదవులు నుంచి తప్పుకుంటారు. మనసు కుదుటపడుతుంది. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. విలువైన వస్తువుల, నగదు జాగ్రత్త. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీ పథకాలు సత్ఫలితాలనిస్తాయి. చిరు వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు.

కుంభం
ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3, పాదాలు.
స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచనలుంటాయి. శుభకార్యాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. బంధుమిత్రుల ఆదరణ సంతృప్తినిస్తుంది. అయితే వారితో ఉల్లాసంగా గడుపుతారు.ఒక వ్యవహారంలో ధనం అందుతుంది. ఖర్చులు భారమనిపించవు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. చేపట్టిన పనుల్లో ఆటంకాలెదుర్కొంటారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. మీ ఆగ్రహావేశాల అదుపులో ఉంచుకోండి. ఇతరుల బాధ్యతలు చేపట్టి అవస్థలు ఎదుర్కొంటారు.అధికారులకు ధన ప్రలోభం తగదు. వ్యాపారాల్లో నష్టాలు భర్తీ చేసుకుంటారు. పెద్ద సంస్థలతో భాగస్వామ్యం అనుకూలిస్తుంది. వనసమారాధనల్లో పాల్గొంటారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు, ప్రతిఫం లభిస్తాయి.

మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఎదుటివారికి మీ సమర్థతపై నమ్మకం కలుగుతుంది. ఖర్చులు విపరీతం. విలాసాలకు బాగా వ్యయం చేస్తారు.పదవులు, కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. వ్యవహార దక్షతతో రాణిస్తారు. మంగళ, బుధవారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. ఆహ్వానాలు అందుకుంటారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. సోదరీ సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులు, సంస్థల స్థాపనలకు అనుకూలం. నిరుద్యోగులకు మెరుగైన అవకాశం లభిస్తుంది.ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. ఆలయాలు, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. ఆందోళనలు కలిగించే సంఘటనలెదురవుతాయి.

No comments:

Post a Comment