Tuesday 8 November 2016

అక్షయనవమి వ్రతం



కార్తీకమాసంలోని శుక్లపక్షంలో శుద్ధనవమి రోజు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజును ‘కృతయుగ ప్రారంభ’ దినంగా భావిస్తారు. అంటే.. కలియుగం అంతమయిన తరువాత ఆరంభమయ్యే పుణ్యదినం. దీనిని ‘అక్షయనవమి’ అని కూడా పిలుస్తారు. 
ప్రతిఒక్కరు ఏ కాలంలోనైనా తమ కోర్కెలను నెరవేర్చుకోవడానికి శ్రీ సత్యానారాయణ వ్రతాన్ని నోచుకుంటారు. సత్యపురుషుడైన సత్యనారాయణ స్వామి ఆవిర్భవించడంతో కలియుగం అంతమయిందని భవిష్య పురాణంలో కూడా తెలపబడింది.

వ్రతవిధానం : 
సత్యనారాయణ వ్రతాన్ని ఏదైనా ఒక పుణ్యస్థలంలోగాని, కొత్తగా నిర్మించుకున్న స్వగృహాలలోగాని భక్తిశ్రద్ధలతో ఆచరించుకోవాలి. కొత్తగా పెళ్లయిన వధూవరులు ఇద్దరు కలిసి మరుసటిరోజు ఈ వ్రతాన్ని ఆచరించడం సర్వసాధారణమే. పూర్వకాలం నుండి ఆ ఆచారం నడుస్తోంది. 
వ్రతాన్ని ఆచరించే ప్రారంభకాలం శుభలగ్నమైతే మరింత మంచి ఫలితాలు చేకూరుతాయి. బంధుమిత్రులతోగాని, వీలైనంత ఎక్కువమందితోకలిసి, సద్గురువులను, ఆప్తులను ఆహ్వానించి.. వారి ఆశీస్సులతో ప్రారంభించాలి. ఈ వ్రతం ప్రారంభించే తిధి, నక్షత్రాలు.. తమ జన్మరాశి నుండి, జన్మనక్షత్రం నుండి లాభ, శుభస్థానాలలో వుండాలి. 


వ్రతకాలం :
సత్యనారాయణ వ్రతాన్ని పర్వకాలాల్లో (సూర్యుడు రాశిమారే సంక్రమణ దినం) చేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుంది. మేషసంక్రాంతి, వృశ్చిక సంక్రాంతి వంటిరోజులలోగాని లేదా పౌర్ణమి, ఏకాదశి తిథులలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే.. విశేష ఫలితాలు అందుతాయి. దేవాలయాలలోగాని, పుణ్యక్షేత్రాలలోగాని, నదీతీరంలోగాని, సాగర సంగమం వద్దగాని పూజాస్థలాన్ని ఏర్పాటు చేసుకుని ఆచరిస్తే.. వెయ్యింతలుగా ఫలితాలు లభిస్తాయి. 

పూజకు కావాల్సిన వస్తువులు :
ఏదైనా ఒక గుండ్రని చెంబు తీసుకుని ముందుగా శుభ్రం చేసుకోవాలి. చందనం, కుంకుమపసుపులతో దానిని బాగా అలంకరించుకోవాలి. తరువాత ఆ పాత్రలో గంగనీరూ, శుద్దోదకం, నవరత్నాలు వేసి.. దానిపై దర్భలు వుంచి నీరు పోయాలి. ఒక టెంకాయను పట్టువస్త్రాలతో చుట్టి, దానిపై మావిడ ఆకులు పేర్చి ఆ కలశంపై వుంచాలి. 
అయిదు రకాల పవిత్రమైన ఆకులు ఆ నీటిలో వుంచి.. అక్షతలు, నవధాన్యాలూ నారాయణమంత్రంతో వేసి.. అందులో సంప్రోక్షించాలి. దీపారాధన, అరటిపళ్లు, పసుపు, కుంకుమ, అక్షింతలు, చందనం మొదలైన వస్తువులన్నీ పూజకోసం సిద్ధం చేసుకుని వుంచుకోవాలి. 
శుభ్రంగా తలంటుస్నానం చేసి మంచి పట్టువస్త్రాలను ధరించుకోవాలి. తూర్పు లేదా ఉత్తరముఖంగా కూర్చొని, ఆచమనం చేసుకుని.. ఓంకారంతో ప్రాణాయామం చేయాలి. 


ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment