Wednesday, 9 November 2016

బృహ్సస్పతి కృత వాయవ్యాఖ్య శివ స్తోత్రము

(కాశీ ఖండం – 17వ అధ్యాయం)
౧. జయ శంకర శాంత శశాంక రుచే రుచిరార్ధద సర్వద సర్వ శుచే!
శుచిదత్త గృహీత మహోపకృతే హృతభక్త జనోద్ధత తాప తతే!!
౨. తత సర్వ హృదంబర వరద నతే నటవృజి మహావన దాహకృతే!
కృత వివిధ చరిత్ర తనో సుతనో తనువిశిఖ విశోషణ ధైర్య నిధే!!
౩. నిధనాది వివర్జిత కృతనతికృత్ కృతివిహిత మనోరథ పన్నగభ్రుత్!
నగ భర్తృ సుతార్పిత వామవపుః స్వ వపుః పరిపూరిత సర్వ జగత్!!
౪. త్రిజగన్మయ రూప విరూప సుదృక్ దృగుదంచన కుంచన కృత హుత భుక్!
భవ భూతపతే ప్రమథైకపతే పతితేష్వపి దత్తకర ప్రసృతే!!
౫. ప్రసృతాఖిల భూతల సంవరణ ప్రణవధ్వని సౌధ సుధాంశు ధర!
ధరరాజ కుమారికయా పరయా పరితః పరితుష్ట నతోస్మి శివ!!
౬. శివ దేవ గిరీశ మహేశ విభో విభవప్రద గిరీష శివేశ మృడ!
మృడయోడు పతిధ్ర జగత్త్రితయం కృత యంత్రణ భక్తి విఘాత కృతాం!!
౭. న కృతాంతత ఏష బిభేమి హర ప్రహరాశు మహాఘమమోఘమతే!
న మతాంతర మన్యదవైమి శివం శివపాదనతేః ప్రణతోస్మి తతః!!
౮. వితతేత్ర జగత్యఖిలేఘ హరం హరతోషణమేవ పరం గుణవత్!
గుణహీనమహీన మహా వలయం ప్రళయాంతకమీశ నతోస్మి తతః!!
ఫలశ్రుతి:
ఈ స్తోత్రమును మూడేండ్లు త్రికాలములందు భక్తితో పఠించిననూ, శ్రవణము చేసిననూ వారి వాణి శుద్ధమగును. నిత్యమూ పఠించు వారు ఎంతటి గొప్ప కార్యమునైనను తెలివితేటలతో సాధింతురు. (వారణాశిలోని)బృహస్పతీశ్వర లింగ సమీపమునందు చదివిన యెడల నీచమగు ప్రవృత్తి తొలగును. గ్రహపీడలు నశించును. నిత్యమూ ప్రాతఃకాలమునందు చదువు వారికి అతి దారుణ బాధలు సైతము శాంతించును. బృహస్పతీశ్వర లింగమును పూజించి ఈ స్తోత్రమును చదివిన యెడల మనోరథములు సిద్ధించును.
వారణాశిలో బృహస్పతీశ్వర లింగం - ఆత్మావీరేశ్వర మందిరం ఎదురుగా(వీరేశ్వరునకు నైరుతి దిశగా), చంద్రేశ్వరునకు దక్షిణముగా కలదు.

No comments:

Post a Comment