అంతరిక్షంలో
జరిగే అద్భుతమైన ఘట్టాలు చిరస్థాయిగా గుర్తుండిపోతాయి. అలాంటి అద్భుతమే
మరోకటి జరగడానికి సమయం ఆసన్నమైంది. జనవరి 1948 తర్వాత ఇలాంటి అద్భుతం
ఇప్పటి వరకూ జరగలేదు. ఇప్పుడు తప్పితే దాదాపు 2034 వరకు జరిగే అవకాశం లేదు.
21వ శతాబ్ధంలోనే ఎప్పుడూ జరగని, జరిగే అవకాశంలేని విధంగా చంద్రుడు భూమికి
అత్యంతసమీపానికి రానున్నాడు. అసాధారణమైన ఈ సంఘటన నవంబర్ 14న జరగనుంది.
ఆరోజున దాదాపు 14 శాతం పెద్దగా, 30 శాతం ప్రకాశవంతంగా చంద్రుడు
కనిపించనున్నాడు. వినీలాకాశంలో ఈ నెల 14న దాదాపు రెండు గంటలపాటు ఈ అద్భుతం
ఆవిషృతమవనుంది. చంద్రుడు పెద్దగా కనిపించడాన్ని ‘సూపర్‌మూన్’గా
పేర్కొంటారు. 14న జరగబోయే ఈ ఘటనలోచంద్రుడు ‘సూపర్‌మూన్’ కంటే ఇంకా పెద్దగా
కనిపించనున్నాడు. చంద్రుడు భూమికి అత్యంత సమీపానికి చేరుకోవడాన్ని
‘పెరిజీ’ అంటారు. ఇదే రోజును చంద్రుడు-భూమి-సూర్యుడు వరుసక్రమంలో ఉంటాయి.
సూర్యుడు, చంద్రుడు ఒకదానికొకటి వ్యతిరేక దిశలలో ఉండడం వల్ల చంద్రుడు మనకు
అతిపెద్దగా కనిపించనున్నాడు.
ఇలాంటి అద్బుతమైన ఘట్టాన్ని ఇప్పుడు చూడకపోతే 2034 నవంబర్ 14 వరకు వేచిచూడాల్సిందేనని ఖగోళశాస్త్రవేత్తలు చెబుతున్నారు.
No comments:
Post a Comment