దీపావళి అయ్యిన తరువాత రెండో రోజున జరుపుకొనే అన్నా చెల్లెలా
పండుగ భాయ్ దూజ్ అనీ భగిని హస్త భోజనం అనీ అంటారు .
ఈ పండుగ సోదర సోదరీమణులు మధ్య ప్రేమకు గుర్తు, మరియు
వారి మధ్య రక్షణ మరియు ఆప్యాయతని బంధాన్ని బలోపేతం
చేయడానికి జరుపుకుంటారు. ఈ పండుగ రోజు సోదరీమణులు వారి
సోదరుల నుదురు మీద ఒక పవిత్రమైన తిలకము పెడతారు. సోదరులు
వారి జ్ఞాపకార్ధం బహుమతులు ఇస్తారు.భాయ్ దూజ్ పండుగ యొక్క
సారాంశం ఇది సోదర మరియు సోదరీమణులు మధ్య ప్రేమ బలోపేతం
చేయడానికి జరుపుకుంటారు . ఇది సోదరుడుకు సోదరి భోజనం
పెడుతుంది అప్పుడు సోదరుడు బహుమతులు ఇవ్వటం
జరుగుతుంది. సాంప్రదాయకంగ అన్న వివాహితులు అయిన చెల్లెలు
ఇంటికి వెళ్లి ఆమె మరియు భర్త యొక్క పరిస్థితులను తెలుసుకుంటారు.
వారు ఎలా వున్నారో తెలుసుకునే అవకాశం సోదరునికి ఇచ్చారు. ఈ
పండుగ ద్వారా సిస్టర్స్ కూడా వారి సోదరుల దీర్ఘకాల జీవితం మరియు
మంచి ఆరోగ్యానికి ప్రార్థన, మరియు శ్రేయస్సు కోరుకుంటారు. దీనికి ఒక
కదా వుంది. ఆ కద ఏంటి అంటే. యముడు యమునా సోదర
సోదరిమణులు. వారు కలసి పెరిగారు. యమున ఒక అందమైన
యువరాజును వివాహం చేసుకొని, తన
సోదరుడుకు దూరమయ్యింది. అతనిని చూడాలని ఎక్కువగా
అనిపించేది . యముడు కూడా తన సోదరిని చూడాలని అనుకునేవాడు.
కానీ కుదిరేది కాదు. అతనికి ఎప్పుడూ ఖాళీ దొరికేది కాదు. ఎందుకంటే
ఆటను నరకానికి అధిపతి కదా అందుకే. యమునా ఎప్పుడు తన
అన్నని తనని చూడటానికి రమ్మని పిలిచేది. ఇలా చెల్లి దగ్గరకు
వెళ్ళటానికి కుదరటంలేదు అనుకొని. ఒకరోజు వెళ్ళటానికి
ఒక రోజును నిర్ణయించుకున్నాడు. ఆమె సోదరుడు వస్తున్నాడు అతనిని
చూడచ్చు అని ఆనందం పట్టలేకపోయింది. యమున అతనికి గౌరవార్ధం
ఒక గొప్ప విందు భోజనం తయారు చేసింది.
ఇది దీపావళి తరువాత రెండు రోజులుకు వచ్చింది. ఆమె తన
ఇల్లంతా దీపములతో అలంకరించింది. ఆమె ఎంతో ప్రేమగా అన్ని
మిఠాయిలు మరియు ఆమె సోదరుడు ప్రేమించిన ఆ పదార్ధాలు సహా,
గొప్ప విందు తయారుచేసింది. ఆమె భర్త, అందమైన యువరాజు,
యమున కలసి ఎంతో గొప్పగా యముడుకు స్వాగతం ఇచ్చారు. అది
చూసి యముడు చాలా ఆనందం పొందాడు. యముడు కూడా తన
సోదరి ప్రేమ పూర్వక స్వాగతం ద్వారా సంతోషపడ్డారు. వారు చాలా
కాలము తరువాత చాలా సంతోషంగా వున్నట్టు చెప్పుకున్నారు వారు.
యముడు యమునతో నీకు బహుమతులు ఏమి తీసుకురాలేదు. నీకు
ఏమి కావాలి అని చెల్లెలిని అడిగాడు. ఆమె నాకు ఏమి వద్దు అన్నయ్య
అనింది. అప్పుడు యముడు అడుగమ్మా నేను నువ్వు ఏమి అడిగితే అది
నేను తప్పక తీర్చుతాను అన్నాడు.
వారు దేవతలు కదా వారు స్వార్ధంగా ఏమి కోరికలు అడగరు. యమున
నాకు ఒక కోరిక వుంది తీర్చుమన్నా అంది. అది ఏమిటంటే
అన్నదమ్ములు కార్తీక విదియ రోజు తన సోదరి ఇంటికి వెళ్లి సోదరిచేతి
వంట తింటారో వారికి అపమృత్యుదోషం కలగకుండా వరం ఇమ్మని
కోరినది. యముడు తధాస్తు అన్నాడు.
No comments:
Post a Comment