నాగ పంచమి వ్రతం
నాగ పంచమి రోజు పసుపుతో కలిపిన చందనం తో ఐదు నాగులని లిఖించాలి.పిండితో కాని ఏదైనా లోహం తో చేసిన జంట నాగులని ఒక ప్లేట్ లో ఉంచాలి.దూర్వాలు,పువ్వులు,అక్షతలు తో పూజించాలి.
"అనంతం వాసుకిం శేషం
పద్మనాభం చ కంభళo
తధా కర్కోటకం నామ
నాగామశ్వం తదాష్టమం
ధృతరాష్ట్రం శంఖపాలం
కాళీయం తక్షకం తథా"
అని ప్రార్దించాలి.
నాగులని పూజించి, గోధుమతో చేసిన పాయశాన్ని నైవేద్యముగా పెడతారు. నాగ పంచమి రోజు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రికి భోజనము చేస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతలను పూజించినవారికి " విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః, న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్ "ఈ మంత్రాన్ని చదువుతూ పుట్టలో పాలు పొయ్యాలి. నాగ పంచమి రోజున పూజ చేసిన వారికి విష భాధలు ఉండవు. సర్ప స్తోత్రాన్ని ప్రతిరోజు మరియు నాగ పంచమి రోజున చదివిన వారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి బాధలు లేక రోగాలు రావు. వంశము అభివృద్ధి అవుతుంది. సంతానోత్పత్తి కలుగుతుంది. కార్యసిద్ధి జరుగుతుంది. అన్ని కార్యములు సవ్యంగా నెరవేరతాయి. కాలసర్ప దోషాలు, నాగ దోషాలు ఉన్నా తొలగిపోతాయి.ఈరోజు ఇనపమూకుడులోఆహారపదార్దాలు వండరాదు.
No comments:
Post a Comment