Friday, 5 August 2016

శరీర సమతుల్యానికి అర్ధ చంద్రాసనం

శరీర సమతుల్యానికి అర్ధ చంద్రాసనం

అర్ధ అంటే సగం అని అర్థం. ఆసనం అంటే యోగాలో చేయు పరిక్రియ. అర్ధచంద్రాసనం వలన శరీరం సమతుల్యంగా ఉంటుంది.
ఆసనం వేయు పద్ధతి
చదునైన నేలపై నిలబడాలి. మొదట పాదాలను దగ్గరకు చేర్చాలి. పాదాలు ఒకదానికొకటి ఆనుకుని ఉండేలా చూడాలి.(సౌధాన్లో నిలబడడం)
రెండు కాళ్ళను ఒకదానికొకటి దూరం జరపాలి. అంటే విశ్రామ్‌లో నిలబడడమన్న మాట.
కుడి చేయిని భూమికి సమాంతరంగా పక్కకు చాచాలి.
అరచేయి ఆకాశానికి అభిముఖంగా ఉండేలా తిప్పాలి.
అలాగే చేయిని నిటారుగా ఉంచుతూనే పైకి లేపాలి.
భుజాలు తలను తాకుతూ చేయి ఆకాశాన్ని చూపుతున్నట్లు ఉండాలి.
అలాగే మెల్లగా నడుము నుంచి తలవరకు ఎడమవైపుకు వంచాలి.
అలాగే చెయ్యిని కూడా శరీరంతోపాటు వంచాలి. ప్రస్తుతం అర్ధచంద్రాకారం ఏర్పడుతుంది.
తిరిగి ఆసనం వేసిన రీతిలోనే మెల్లగా మొదటి స్థానానికి రావాలి.

ఇదేవిధంగా
ఎడమ చేయిని భూమికి సమాంతరంగా పక్కకు చాచాలి.
అరచేయి ఆకాశానికి అభిముఖంగా ఉండేలా తిప్పాలి.
అలాగే చేయిని నిటారుగా ఉంచుతూనే పైకి లేపాలి.
భుజాలు తలను తాకుతూ చేయి ఆకాశాన్ని చూపుతున్నట్లు ఉండాలి.
అలాగే మెల్లగా నడుము నుంచి తలవరకు కుడివైపుకు వంచాలి.
అలాగే చెయ్యిని కూడా శరీరంతోపాటు వంచాలి. ప్రస్తుతం అర్ధచంద్రాకారం ఏర్పడుతుంది.
తిరిగి ఆసనం వేసిన రీతిలోనే మెల్లగా మొదటి స్థానానికి రావాలి.
ఉపయోగాలు
ఈ ఆసనాన్ని వేయడం వలన శరీరానికి సమతుల్యత ఏర్పడుతుంది. ఉదరం, ఛాతీ భాగాలకు సంబంధించిన వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

No comments:

Post a Comment