Wednesday, 10 August 2016

annamayya patalu 1 కట్టెదుర వైకుంఠము

annamayya patalu 1


కట్టెదుర వైకుంఠము

కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ
తెట్టలాయ మహిమలే తిరుమల కొండ

వేదములే శిలలై వెలసినది కొండ
యేదెస బుణ్యరాసులే యేరులైనది కొండ
గాదిలి బ్రహ్మాది లోకముల కొనలు కొండ
శ్రీదేవు డుండేటి శేషాద్రి కొండ
సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ
నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ
వుర్వి దపసులే తరువులై నిలచిన కొండ
పూర్వ టంజనాద్రి యీ పొడవాటి కొండ
వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ
పరగు లక్ష్మీకాంతు సోబనపు గొండ
కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ
విరివైన దదివో శ్రీ వేంకటపు గొండ

No comments:

Post a Comment