ఆధ్యాత్మికంలో స్ఫటిక లింగానికి ప్రాధాన్యత వుంది. స్ఫటిక వినాయకుడు, స్ఫటిక లింగానికి పూజ చేయడం ద్వారా అపారమైన సానుకూల శక్తి లభిస్తుంది. అలాంటి స్ఫటిక లింగానికి మాసానికి రెండుసార్లు నీటితోనైనా అభిషేకం చేస్తే.. శుభఫలితాలుంటాయి. స్ఫటిక లింగానికి ప్రతికూల ప్రభావాన్ని తనలోకి తీసుకునే శక్తి వుంటుంది. ఇంకా సానుకూల శక్తిని వ్యాపింప చేసే శక్తి వుంటుంది.
స్ఫటిక లింగం గృహంలో వుంటే.. మానసిక ఆందోళనలు, భయాందోళనలు, ఈతిబాధలు తొలగిపోతాయి. ఇంకా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇంకా స్ఫటిక మాలను ధరించడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించుకోవచ్చు. రక్తపోటు వున్నవారు స్ఫటిక మాలను ధరించడం మెరుగైన ఆరోగ్య ఫలితాన్నిస్తుంది. స్నానం చేసేటప్పుడు స్ఫటిక మాలతో స్నానమాచరించడం మంచిది.
స్ఫటిక మాలను చేతిలో వుంచి.. శివుని నామాన్ని ఉచ్ఛరించి ధ్యానించడం ద్వారా కోరిక కోరికలు నెరవేరుతాయి. స్ఫటిక మాలను ధరించేందుకు ముందు ఆ మాలను 3 గంటల సేపు నీటిలో నానబెట్టి ధరించడం మంచిది. ఒకరు ధరించిన స్ఫటిక మాలను మరొకరు ధరించడం కూడదు. రోజంతా స్ఫటిక మాలను ధరించడం ద్వారా ఒకరి శరీరంలోని ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ఇంకా మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది.
స్ఫటిక మాల ఇంట్లో శివ లింగం కు వేసి అభిషేకం చేయడం ద్వారా ఇంట్లో వున్నా వాళ్ల అందరికీ మానసికం గా ప్రసంతత కలిగి ఇంట్లో తగాదాలు తగ్గుతాయీ, స్ఫటిక మాల ఇంట్లో ఏ దేవుడి పటానికి అయినా వేయవచ్చు.
స్పటిక లింగాన్ని ఇంట్లో పూజించుకోవచు.అయితే ఈ స్పటిక లింగం మన ఇంట్లో ఉండడం వల్ల ప్రతి రోజు పాలు, పండ్ల రసం, పరిశుభ్రమైన నీటితో అభిషేకం నిర్వహించాలి.
అభిషేకం అనంతరం పువ్వులతో అలంకరించి ధూప, దీప నైవేద్యాలను సమర్పించాలి.ఈ విధంగా ప్రతిరోజు స్పటిక లింగాన్ని పూజించడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయి.
స్పటికంతో తయారైన శివలింగం మాత్రమే కాకుండా స్పటికంతో తయారైన విగ్నేశ్వరుని విగ్రహాన్ని కూడా పూజించడం వల్ల మన ఇంట్లో ఏర్పడే ప్రతికూల వాతావరణ పరిస్థితులు తొలగిపోయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.ముఖ్యంగా స్పటిక శివలింగానికి విభూతితో అభిషేకం ఎంతో ప్రీతికరమైనది.ఈ విధంగా విభూతి అభిషేకం చేయడం ద్వారా నవ గ్రహ దోషాలు తొలగిపోతాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్ఫటిక శుక్రుడు, చంద్రుడు కి ప్రతికా.
No comments:
Post a Comment