కార్తీకమాసంలో అందరూ దీపాలుపెట్టడంఅనవాయితీ. మహిళలు వేకువ జామునే చల్లటీ నీటితో స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు.
కార్తీక దీపాలు అంటే సాధారణంగా ఒత్తులతో చేసి వెలిగించేవే. పత్తితో చేసిన వత్తులను ఆవు నెయ్యితో నానబెట్టి వాటిని అరటి డొప్పల్లో పెట్టి వెలిగిస్తారు.
ముఖ్యంగా కార్తీక మాసంలో ఉసిరి దీపాలకు ప్రాముఖ్యత ఉంది.ఉసిరి కాయతో దీపాలు పెడితే అన్ని శుభాలు జరుగుతాయని, దీని వల్ల నవగ్రహ పరిహారం జరుగుతుందని చాలామందికి తెలియదు.
ఉసిరి కాయ గుండ్రంగా ఉండడం వల్ల దానిలో దీపం ఎలా పెట్టాలన్నది చాలామందికి సందేహంగా ఉంటుంది.మరిఉసిరికాయతో దీపం ఎలా పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉసిరి దీపం వెలిగిస్తే అధిక ప్రయోజనాలుఉసిరి చెట్టు సాక్షాత్తుఈశ్వరస్వరూపంగానే కొలుస్తారు.
శివకేవులతో పాటు బ్రహ్మ, సకల దేవతతో ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని చెబుతారు.మరీ ముఖ్యంగా దశమి, ఏకాదశి,సోమవారం, పౌర్ణమి తిథుల్లో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిస్తారు.
కార్తీక పౌర్ణమీ రోజున ఉసిరికాయను తీసుకొని దాని మధ్యలో గుండ్రంగా కట్ చేస్తే దీపం తయారు అవుతుంది.ఇలా ఉసిరి దీపం వెలిగిస్తే శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి సంతోషిస్తారు.
మరి ముఖ్యంగా ఇంటికి నరదిష్టి తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.
No comments:
Post a Comment