Wednesday 22 November 2023

శ్రీ గరుడ పురాణము (2)



శ్రీకృష్ణ గరుడ సంవాదరూపంలోనున్న బ్రహ్మలేదా మోక్షకాండ ఉపాధి, మాయ, అవిద్యలను ఖండించి నిజమైన జ్ఞానాన్ని ప్రతిపాదిస్తుంది. మధ్వాచార్యుల ద్వైతసిద్ధాంతి బలపరుస్తుంది. గయాక్షేత్రం వర్ణనను అనిదంపూర్వంగా ఈ పురాణం చేసింది. తిరుపతి - తిరుమల అనే మాటలనైతే వాడలేదు గాని శ్రీనివాసునీ ఆయన కొలువైన కొండలన్నిటినీ కోనేటి పరంపరతో సహా ఈ పురాణం వర్ణించింది. ఇంకా ఎన్నో ఇతర కేశాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఈ కాండలు కలిగిస్తాయి.

గరుడ పురాణంలోని సామాన్య లక్షణాలు:

మిగతా పురాణాల్లో ఎలాగూ వున్నాయి కదా అనో యేమోగాని పురాణ సహజ లక్షణాలపై ఇందులో పెద్దగా శ్రద్ధ కనబఱుపబడినట్లు తోస్తుంది. పూర్వఖండంలోని 240 అధ్యాయాలున్నా ఈ పంచ లక్షణాలు 14 అధ్యాయాలల్లోనే కనిపిస్తాయి. 4,5 అధ్యాయాల్లో సర్గ, ప్రతిసర్గలూ, ఆరవ అధ్యాయాలో దేవతల, ఋషుల వంశాలూ, 87-90, అధ్యాయాల్లో రాజవంశాలూ అదీ మరీ సంక్షిప్తంగా, 54-58 అధ్యాయాల్లో సర్గ, 224వ అధ్యాయంలో సృష్ట్యంతమూ చర్చింపబడ్డాయి. మిగతా అంతా ఈ పురాణానికే ప్రత్యేకమైన సామాజిక లక్షణమే.

గరుడపురాణం వైష్ణవ పురాణమే. విష్ణు సహస్రనామం మరొకటి (అంటే భారంతంలో భీష్ముడు చెప్పింది కాక) ఇందులో కనిపిస్తుంది. విష్ణు పంజర స్తోత్రం కనిపిస్తుంది. పాంచరాత్ర సూత్రాలనూ వైష్ణవ సంప్రదాయాన్నీ అనుసరించే ఈ పురాణం కూడా చెప్పబడింది. అయితే పాంచరాత్రాలలో విష్ణువుకి నాలుగు వ్యూహాలే వుండగా ఇందులో తొమ్మిది వ్యూహాలు పేర్కొనబడ్డాయి. అలాగే ఇతర వైష్ణవ పురాణాల్లో విష్ణు రూపాలయిదే వుండగా గరుడ పురాణంలో తొమ్మిది పేర్కొనబడ్డాయి.

(1-12, 13,14)

సహజంగానే ఈ పురాణంలో మహావిష్ణువుకే పెద్ద పీట వేయబడింది. ఆయన యొక్క పన్నెండు అవతారాలొకచోటా, ఇరవై రెండు అవతారాలు మరొకచోటా వర్ణింపబడ్డాయి. ప్రత్యేకంగా మార్కండేయ మహాముని విష్ణువుని పదునాల్గు నామాలతో స్తుతించినట్లు చెప్పబడింది. శ్రవణ కీర్తన స్మరణాది భక్తి మార్గాలను, ఈ పురాణం వర్ణించడం చూస్తే దీనికి భాగవత ప్రభావం గట్టిగానే పడినట్లు తెలుస్తుంది....


సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment