Tuesday, 28 November 2023

శివుడికి ఆ రెండూ సమానమే.

 


కొంతమంది ఏదో ఆశించి స్వార్థంతోదేవుడినిస్మరిస్తారు. ప్రపంచమంతా మాయతో నిండి ఉందని, చావు పుట్టుకలు చక్రంలా తిరుగుతుంటాయని తెలుసుకోలేరు.

తనువు చాలించిన తరువాత అది మట్టిలో కలిసిపోతుంది. ఆత్మకు మాత్రం మరణం లేదు. మనిషి అంతిమంగా చేరే ప్రదేశంలోనే శివుడు నివసిస్తాడు.

అసలు సృష్టి స్థితి లయకారుడైన శివుడు శ్మశానంలో ధ్యానం వెనుక కఠోరవాస్తవం ఉంది. శరీరం నుంచి విడిపోయిన తర్వాత ఆత్మకు స్వేచ్ఛ లభిస్తుంది.

ఆ శరీరం అగ్నివల్ల పునీతమైన తర్వాత మిగిలే బూడిదను ఒంటికిరాసుకుని, కపాలమాలను శివుడు మెడలో ధరిస్తాడు. విషనాగులను కూడా తన ఆభరణాలుగాధరించడమనేది సమస్త జీవరాశిని శివుడు సమదృష్టితో చూస్తాడని అర్థం.

ఆయనకు విషమైనా, అమృతమైనా సమానమే. శివునివెంట ఉండే భూతగణాలు వికృతరూపంలో ఉంటాయి. వాటి శరీరం నుంచి అవయవాలు బయటకు వచ్చి భయంకర ఆకారంలో ఉంటారు. నిజమైన శివభక్తులు వీటిని చూస్తే భయపడరు.

ఈ గణాలు నిరంతరం శివుడితోనే ఉంటాయి కాబట్టి మహాదేవుడిని ఆరాధించే ముందు వీటి పట్ల భయాన్ని వీడాలి. అంటే శివుడికి శ్మశానమైనా, ఆలయమైనా ఒకటే.

సర్వేజనా సుఖినో భవంతు

శుభమస్తు
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment