Thursday 23 November 2023

కార్తిక శుద్ధ ద్వాదశి

 


ఆబాకాశిత పక్షేశు మైత్రశ్రవణ రేవతీ సంగమే

నహిభోక్తవ్యం ద్వాదశ ద్వాదశీ: హరేత్‌

అనగా రేవతి నక్షత్ర యోగం లేని కార్తిక శుద్ధ ద్వాదశి నాడు పారణ చేయవలెను. ఆషాఢ, భాద్రపద, కార్తిక శుక్ల పక్షము నందు అనురాధ, శ్రవణ, రేవతి నక్షత్రములున్నపుడు భుజించినచో ద్వాదశ ద్వాదశీ ఫలములు హరించును. రేవతీ నక్షత్ర యోగం లేని ద్వాదశి లభించినపుడు రేవతి నాల్గవ పాదాన్ని వదిలిపెట్టాలి.

వరాహపురాణంలోని మదన రత్న ప్రకరణాన్ని అనుసరించి

ఏకాదశి  సోమయుక్త కార్తికేమాసి భామిని

ఉత్తరాభాద్ర సంయోగే అనంతాసా ప్రకీర్తితా

అనగా కార్తికమాసంలో సోమవారంతో కూడిన ఏకాదశి ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నచో దాన్ని అనంత ఏకాదశిగా వ్యవహరిస్తారు. ఈనాడు చేసిన పుణ్యకార్యములు అనంత ఫలములు ఇచ్చునని అర్థం.

ఏకాదశి నాడు రాత్రి దేవాలయమున ఘంటానాదంతో క్రింద పేర్కొన్న మంత్రములతో స్వామిని మేల్కొలపవలయును.

హేమాద్రి, పద్మపురాణానుసారం…

ఏకాదస్యాంచ శుక్లాయామే కార్తికే మాసి కేశవం

ప్రసూప్తం బోధయేత్‌ రాత్రే శ్రద్ధా భక్తి సమన్విత:

భవిష్యపురాణంలోని మదనరత్నానుసారం ….

కార్తిక శుక్లపక్షేశు ఏకాదస్యాం పృధాసుత

మంత్రేనానేనా రాజేంద్ర దేవ ముత్తాపయేత్‌ ద్విజ:

ఏకాదశినాడు రాత్రి సహస్ర కలశస్నపనం లేదా కనీసం అష్ట కలశ స్నపనం దేవాలయమున ఆచరింప చేసి దేవదేవున్ని మేల్కొలపవలయును.అలాగే ప్రభోదన మంత్రము వరాహ పురాణమున ఈ విధంగా చెప్పబడింది.

బ్రహ్మేంద్ర రుద్రాగ్ని కుబేర సూర్య సోమాది భిర్వందిత పాద పద్మ

బుధ్యస్వ దేవేశ జగన్నివాస మంత్ర ప్రభావేణ సుఖేన దేవ

ఇయంతు ద్వాదశీ దేవ ప్రబోధార్ధం వినిర్మితా

త్వమేవ సర్వ లోకానాం హితార్ధం శేషశాయినా

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద త్యజ నిద్రామ్‌ జగత్పతే

త్వయి సుక్తే జగన్నాధ జగసుక్తం భవేదిదం

ఉత్తితే చేష్టతే సర ్వం ఉత్తిష్ఠోత్తిష్ఠ మాధవ

గతా మేఘా: వియచ్చైవ నిర్మలం నిర్మలా దిశ:

శారదానిచ పుష్పాణి గృహాణ మమ కేశవ

ఇదం విష్ణురితి పోక్త: మంత్ర: ఉత్థాపనే హరే:

ఇది శ్రీహరి ఉత్థాపన లేదా మేలుకొలుపు మంత్రం. ఈ విధంగా శ్రీహరిని మేలు కొలిపి ఆయన ముందర చాతుర్మాస్య వ్రతమును పూర్తి చేసుకోవలెను.

చతుర్థా గృహ్య వైజీర్ణం చాతుర్మాస్య వ్రతం నర:

కార్తిక శుక్ల పక్షేతు ద్వాదశ్యాంతు సమాపయేత్‌

ఆషాఢం, శ్రావణ ం, భాద్రపదం, ఆశ్వయుజం ఈ నాల్గు మాసములు చాతుర్మాస్య వ్రతమును ఆచరించి కార్తిక శుద్ధ ద్వాదశినాడు వ్రతసమాప్తి చేయవలయును. ‘నిర్ణయామృతము’ న సనత్‌ కుమారుడు సమాప్త మంత్రమును తెలియజేశాడు.

ఇదం వ్రతం మయాదేవ కృతం ప్రీత్యై తవ ప్రభో

న్యూనం సంపూర్ణతాం యాతు త్వత్‌ ప్రసాదాత్‌ జనార్ధనా

వరాహపురాణానుసారం ఏకాదశినాడు రాత్రి కుంభము పైన నేతితో నిండిన పాత్రను ఉంచి ఆ నేతిలో ఒక వీసమెత్తు బంగారంతో తయారుచేసిన మత ్స్యమూర్తిని ఉంచి పంచామృతంతో అభిషేకించి పీతాంబరంతో కుంకుమాది సుగంధద్రవ్యములతో వస్త్రయుగ్మంతో పద్మాదులతో మత్స్యాది దశావతారాలను పూజించి ఆనాడు జాగరణ ఉండి ద్వాదశినాడు ఉదయమే శ్రీహరిని, గురువును పూజించి వస్త్రతాంబూలాది దక్షిణాదులను అర్పించి క్రింది మంత్రమును పఠించి బ్రాహ్మణులను భుజింపచేయవలెను.

జగదాది: జగదృప: జగదాది: అనాదిమాన్‌

జగదాద్య: జగద్యోని: ప్రీయుతామే జనార్ధనా

ద్వాదశి విధి బ్రహ్మపురాణంలో ఈవిధంగా చెప్పబడింది. ఏకాదశినాడు రాత్రి దేవదేవున్ని మేలుకొలుపు అనంతరం రథంలో వేంచేయించి స్నానాధి ఆరాధనలు ముగించిన పిదప నగరమున నాలుగు వీధులలో ఊరేగించవలెను. ఆ ఉత్సవమున పాల్గొన్న భక్తులకు, బ్రాహ్మణులకు తాను ఆచరించిన చాతుర్మాస్య వ్రతమును నివేదించి దక్షిణాదులతో సత్కరించవలయును.

కార్తిక శుక్ల ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశి అని కూడా పేర్కొంటారు. స్కాంద మరియు ప ద్మపురాణాలనుసారం ఆరోజు ధాత్రీ వృక్షము కింద లేదా ధాత్రీ వనములో యధోక్త విధిగా తులసీ ధాత్రీ వివాహము జరిపి ఆ వనములో శక్తిననుసరిం చి పక్వాన్నములు చేసి లక్ష్మీనారాయణ స్వరూపులైన తులసీధాత్రులకు నివేదన చేసి బ్రాహ్మణులకు, బంధువులకు, పేదసాదలకు భోజనం పెట్టి శక్తి మేరకు గో, భూ, సువర్ణ దానాలను ఇచ్చి సత్కరించి వారి అనుమతితో తాము భుజించి ఆరోజు జాగరణ చేయాలి. మరునాడు ఉదయమే స్నానమాచరించి కార్తిక శుద్ధ త్రయోదశినాడు దేవదేవున్ని ఆరాధించి కార్తిక శుక్లచతుర్థినాడు వ్రత సమాప్తి చేయవలెను.

సర్వేజనా సుఖినో భవంతు
శుభమస్తు

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment